Breaking News

Daily Archives: October 1, 2016

నిజామాబాద్‌ బతుకమ్మ వేడుకలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మహిళల ఆడబిడ్డ బతుకమ్మ అని, ప్రతి మహిళ సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శనివారం బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈనెల 8న కలెక్టరేట్‌ మైదానంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కనీసం 3 వేల ...

Read More »

3 నుంచి గ్రామసభలు

  రెంజల్‌, అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని ఆయాగ్రామాల్లో ఈనెల 3వ తేదీ నుంచి 6వ తేది వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు ఎంపిడివో చంద్రశేఖర్‌ తెలిపారు. 3న రెంజల్‌, కళ్యాపూర్‌, కందకుర్తి, ధూపల్లి, 4న నీలా, కూనేపల్లి, తాడ్‌బిలోలి, 5న బాగేపల్లి, బోర్గాం, సాటాపూర్‌, 6న వీరన్నగుట్ట గ్రామాల్లో పారిశుద్యంపై అవగాహన గ్రామసభలు జరపనున్నట్టు ఆయన తెలిపారు.

Read More »

పారిశుద్యం, మరుగుదొడ్లపై శ్రద్ద వహించాలి

  – ఎంపిడివో చంద్రశేఖర్‌ రెంజల్‌, అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా పారిశుద్య వారోత్సవాలను సక్రమంగా నిర్వహించాలని ఎంపిడివో చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో పారిశుద్యంపై పలు శాఖల సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్య కమిటీలకు, ప్రజలకు పారిశుద్యంపై పూర్తిగా అవగాహన చేయాల్సిన అవసరముందన్నారు. పారిశుద్యం లోపం కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎంపిడివో స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ...

Read More »

తెయులో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు

  డిచ్‌పల్లి, అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో శనివారం బతుకమ్మ సంబరాలు వేడుకగా జరిగాయి. వర్సిటీ మహిళా సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థినిలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆట,పాటలతో హోరెత్తించారు. తెయు సాంస్కృతిక కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ త్రివేణి ఆధ్వర్యంలో ఈ వేడుకలు పరిపాలనా భవనం ముందు ఘనంగా నిర్వహించారు. మొదట అందంగా, సంప్రదాయ బద్దంగా అలంకరించిన బతుకమ్మలకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు, కంట్రోలర్‌ ఆప్‌ఎగ్జామినేషన్స్‌ ఆచార్య కనకయ్య, సీనియర్‌ ఆచార్యులు ప్రొఫెసర్‌ సత్యనారాయణచారి, ...

Read More »

మళ్ళీ తెగిన నల్లవాగు వంతెన

  నిజాంసాగర్‌, అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగ్‌రావు పల్లి గ్రామ శివారులోగల నల్లవాగు మత్తడి భారీగా వరద నీరు రావడంతో శనివారం మళ్లీ తెగిపోయింది. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కరంగా మారింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తెగిపోవడంతో బస్సు సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, వెనుదిరిగి పోయాయి. హైదరాబాద్‌ 2 డిపోబస్సు నల్లవాగు మత్తడికి రాగానే వెనుదిరిగి ఎల్లారెడ్డి, మెదక్‌ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లింది. వంతెన తెగిపోవడంతో రాకపోకలకు సాయంత్రం 5 గంటల నుంచి ...

Read More »

శైలపుత్రిగా అమ్మవారు

  బీర్కూర్‌, అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ హనుమాన్‌ ఆలయకమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈ మేరకు శనివారం అమ్మవారు శైలపుత్రిగా భక్తులకు దర్శనమిచ్చారు. శేష్‌కుమార్‌ జోషి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ అవారి గంగారాం ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. 16 మంది మాల ధారణ చేశారు. నవరాత్రుల్లో ప్రత్యేక పూజా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

Read More »

నిజాంసాగర్‌ 16 గేట్లు ఎత్తివేత

  నిజాంసాగర్‌, అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు 6వ రోజు కొనసాగుతున్న వరద ఉధృతితో 16 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ఇన్‌ఫ్లో లక్ష 20 వేల క్యూసెక్కులు రావడంతో 80 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా అంతే నీటిమట్టాన్ని కొనసాగిస్తున్నారు. పర్యాటకులు శనివారం కూడా భారీ సంఖ్యలో చేరుకొని ఆనందంగా ...

Read More »

బీర్కూర్‌లో 7 సెం.మీ.ల వర్షపాతం

  బీర్కూర్‌, అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శనివారం సాయంత్రానికి 7సెంమీ.ల వర్షపాతంగా నమోదైనట్టు తహసీల్దార్‌ కృష్ణ నాయక్‌ తెలిపారు. అకాల వర్షాలకు మండలంలో పెసర, సోయా, వరి, మొక్కజొన్న పంటలు నష్టమయ్యాయని, అంచనా వివరాలను ఆయాగ్రామాల విఆర్వోలు సేకరిస్తున్నారని, నివేదికలు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నస్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్తిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా గత మూడురోజులుగా కురుస్తన్న వర్షాలకు మండలంలో పలుచోట్ల ...

Read More »

ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

  బాన్సువాడ, అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ డివిజన్‌లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ చోట్ల దేవి మండపాల్లో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. బాన్సువాడలోని విద్యాజ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ ఛైర్మన్‌ శంభురెడ్డి దంపతులు విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఆలయ నిర్మాణ కర్తల్లో ఒకరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం అమ్మవారిని దర్శించుకున్నారు. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి ఉత్సవాలు ...

Read More »

వాగులో కారు గల్లంతు

  – ప్రయాణీకుల ఆచూకి లభించలేదు బాన్సువాడ అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలం కారేగాం శివారులోని వాగులో శనివారం కారు గల్లంతైన సంఘటనలో ఐదుగురి ఆచూకి లేకుండాపోయింది. గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు పొంగి ప్రవహిస్తోంది. పిట్లం, కర్ణాటకల మధ్య రోడ్డు కీలకంగా ఉంటుంది. మెదక్‌జిల్లా కంగిటి మండలం తడకల్‌ గ్రామానికి చెందిన ఓ కుటుంబం స్వంత కారులో పిట్లంలోని ఆసుపత్రికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. జంగం రాజు అనే ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం ...

Read More »