Breaking News

Daily Archives: October 3, 2016

8న బతుకమ్మ మహా ప్రదర్శన

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, అక్టోబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ సంబరాల్లో బాగంగా ఈనెల 8న సాయంత్రం 4 గంటలకు నిజామాబద్‌ కలెక్టరేట్‌ గ్రౌండ్‌తోపాటు కామారెడ్డి అంగడి బజార్‌ గ్రౌండ్‌లో బతుకమ్మ మహా ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన సూచనలకు అనుగుణంగా గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కనీసం 3 వేల మంది మహిళలు బతుకమ్మలతో ఈ ప్రదర్శనకు హాజరు కావాలని ...

Read More »

కళాశాలల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

  కామారెడ్డి, అక్టోబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రజ్ఞ, వశిష్ట డిగ్రీ కళాశాలల్లో సోమవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను కళాశాల ఆవరణలో ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ వేడుకలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కళాశాలల అద్యాపకులు మాట్లాడుతూ తెలంగాణ బతుకు చిత్రాన్ని చెప్పేది బతుకమ్మ పండగ అని, అలాంటి పండగను విద్యార్థులు కలిసి కళాశాలల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ...

Read More »

ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండగ

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, అక్టోబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మహిళల ఆడబిడ్డ బతుకమ్మ పండగను మహిళలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా మండల స్తాయి అధికారులకు సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా డివిజన్‌, మండల స్థాయి అధికారులతో బతుకమ్మ మహా ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పండగ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నందున ప్రతి ...

Read More »

ఆర్గానిక్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపాలి

  కామారెడ్డి, అక్టోబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలను కాలుష్యపు కోరలకు గురిచేసి రోగాల బారిన పడేలా చేసే సఫాలా ఆర్గానిక్‌ కెమికల్‌ ప్రయివేటు ఫ్యాక్టరీ నిర్మాణ ఆలోచన విరమించుకోవాలని సిపిఎం జిల్లా నాయకుడు చంద్రశేఖర్‌, డివిజన్‌ నాయకుడు మోతిరాం, రాజలింగం డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలోవారు సోమవారం విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి మండలంతో పాటు తాడ్వాయి మండలంలోని పలు గ్రామాలు ఆర్గానిక్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయే ఆస్కారముందన్నారు. ప్రభుత్వ భూమిలో అమితాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌లు నిర్మించనున్న కెమికల్‌ ఫ్యాక్టరీ ...

Read More »