Breaking News

Daily Archives: October 5, 2016

ఘనంగా బతుకమ్మ వేడుకలు

  కామారెడ్డి, అక్టోబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పట్టణంలోని సాయిబాబా మందిరం, వేణుగోపాల స్వామి ఆలయం, కిష్టమ్మ గుడి, ప్రసన్నాంజనేయస్వామి ఆలయంతో పాటు వివిధ ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలతో లయబద్దంగా ఆడుతూ పండగ నిర్వహించారు. బతుకమ్మలను కొలిచి అనంతరం నిమజ్జనం చేశారు.

Read More »

తనిఖీలతో కమీషనర్‌ హల్‌చల్‌

  కామారెడ్డి, అక్టోబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ విజయలక్ష్మి తనిఖీలతో హల్‌చల్‌ చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆమె పారిశుద్య విభాగంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్య కార్మికుల హాజరును స్వయంగా తీసుకున్నారు. ఉదయం నుంచి కార్మికుల వెంటే ఉండి పట్టణంలోని వివిద వార్డుల్లో పర్యటించారు. కమీషనర్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా వార్డుల్లో కార్మికులు పనిచేస్తున్నారా, లేదా, ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారా అని అక్కడికి వెళ్లి ఆరాతీశారు. పారిశుద్య జవాన్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ...

Read More »

చెరువులో పడి గుర్తుతెలియని యువకుని మృతి

  కామారెడ్డి, అక్టోబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు మత్తడి వద్ద బుధవారం గుర్తు తెలియని యువకుని (28) మృత దేహం లభించినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో చెరువులో నీరునిండి అలుగులు పారుతున్నాయి. ఈ క్రమంలో యువకుడు ఈతగొట్టేందుకు వెళ్లి మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన యువకుని గుర్తించలేదని, గుర్తు తెలియని యువకుని శవం కింద కేసు నమోదుచేసినట్లు తెలిపారు.

Read More »

ఆటో ఢీ- పలువురికి గాయాలు

  కామారెడ్డి, అక్టోబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో రెండు ఆటోలు ఢీకొన్న సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రామారెడ్డి రోడ్డులో సుభాష్‌ టాకీస్‌ వద్ద బుధవారం మినరల్‌ వాటర్‌ ట్రాలీ ఆటో, ప్యాసింజర్‌ ఆటోను ఢీకొంది. దీంతో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Read More »

నలంద డిగ్రీ కాలేజ్‌లో బతుకమ్మ సంబరాలు

  భీమ్‌గల్‌, అక్టోబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌లోని నలంద డిగ్రీ కళాశాలలో బుదవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అందంగా పేర్చిన రంగు రంగులతో కూడిన బతుకమ్మలను కళాశాల ఆవరణలో ఉంచి బతుకమ్మలు ఆడారు. అనంతరం చేతబూని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఎంతోఅభినందనీయమన్నారు. వేడుకల్లో అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సురేఖ, అధ్యాపకులు జ్యోతి, కె.గోదావరి, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ఫైళ్ల విభజన, కామారెడ్డి కలెక్టరేట్‌ ఏర్పాట్ల పరిశీలన

  నిజామాబాద్‌, అక్టోబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్తగా ఏర్పాటవుతున్న కామారెడ్డి జిల్లా కార్యాలయాలకు సంబంధించిన పనులను ఈనెల 7వ తేదీ లోపు పూర్తి చేయాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంచే చేపట్టిన ఫైల్ల విభజన ప్రక్రియను శాంతికుమారి పరిశీలించారు. రెవెన్యూ రికార్డుల విభజన చాలా బాగుందని ప్రశంసించారు. పైళ్ల విభజన, స్కానింగ్‌ సిబ్బంది వివరాల నమోదును మానిటరింగ్‌ చేసేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు ...

Read More »

జడ్పి సర్వసభ్య సమావేశం వాయిదా

  – ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు నిజామాబాద్‌, అక్టోబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోరం లేనందున బుధవారం జరగాల్సిన జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాయిదా వేస్తున్నట్టు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని బుదవారం ఉదయం 11 గంటలకు నిర్వహించడానికి సభ్యులకు, అధికారులకు ఆహ్వానాలు పంపించారు. 11 గంటలకు జరగాల్సిన ఈసమావేశం సభ్యులు రాకపోవడంతో 11.30 గంటలకు ఛైర్మన్‌, జడ్పి సిఇవో మోహన్‌లాల్‌ సమావేశ మందిరానికి వచ్చి కోరం ...

Read More »

డిజిటల్‌ ఇండియాపై అవగాహన కార్యక్రమం

  బీర్కూర్‌, అక్టోబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడి రూపొందించిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం గురించి బీర్కూర్‌ గ్రామంలోని గాంధీచౌక్‌ వద్ద ప్రత్యేక బృందం అవగాహన కల్పించారు. డిజిటల్‌ ఇండియాలో ఐదు యాప్స్‌ ఉంటాయని, ఇందులో మొదటి యాప్‌ వ్యవసాయ సమాచారం, దస్తావేజుల గురించి, ధాన్యం ధర, పెస్టిసైడ్‌ ధరలు ఆన్‌లైన్‌లో లభిస్తాయని తెలిపారు. రెండవది ఈ – ఆసుపత్రి యాప్‌ ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ముందస్తు టోకెన్లు తీసుకోవడానికి, ఎమర్జెన్సీ సేవల కోసం ఉపయోగపడుతుందన్నారు. ...

Read More »