Breaking News

డిజిటల్‌ ఇండియాపై అవగాహన కార్యక్రమం

 

బీర్కూర్‌, అక్టోబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడి రూపొందించిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం గురించి బీర్కూర్‌ గ్రామంలోని గాంధీచౌక్‌ వద్ద ప్రత్యేక బృందం అవగాహన కల్పించారు. డిజిటల్‌ ఇండియాలో ఐదు యాప్స్‌ ఉంటాయని, ఇందులో మొదటి యాప్‌ వ్యవసాయ సమాచారం, దస్తావేజుల గురించి, ధాన్యం ధర, పెస్టిసైడ్‌ ధరలు ఆన్‌లైన్‌లో లభిస్తాయని తెలిపారు. రెండవది ఈ – ఆసుపత్రి యాప్‌ ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ముందస్తు టోకెన్లు తీసుకోవడానికి, ఎమర్జెన్సీ సేవల కోసం ఉపయోగపడుతుందన్నారు. మూడవ యాప్‌ ఎల్‌ఇజిడి యాప్‌, ఇందులో కుళాయి బిల్లులు, ఇన్సురెన్సుల రెన్యువల్‌, కరెంటు బిల్లులు తదితర బిల్లులు అన్ని యాప్‌లో కట్టవచ్చన్నారు. మై గవర్నమెంట్‌ యాప్‌లో ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమాచారం, సలహాలు, సూచనలు తెలుసుకోవడానికి యాప్‌ ఉపయోగపడుతుందన్నారు. ఎన్‌డిసిఎం యాప్‌, నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి కల్పించడానికి యాప్‌ అందుబాటులో ఉంటుందని, ఇంతేగాకుండా ప్రభుత్వ సేవలు, ఆర్తిక సేవలు అందుబాటులో ఉంటాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కె.సురేశ్‌ కుమార్‌రెడ్డి, ఎం.డి. హుస్సేన్‌, శివకుమార్‌, కళాకారులు ఎల్లయ్య, కనకయ్యలు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article