Breaking News

నలంద డిగ్రీ కాలేజ్‌లో బతుకమ్మ సంబరాలు

 

భీమ్‌గల్‌, అక్టోబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌లోని నలంద డిగ్రీ కళాశాలలో బుదవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అందంగా పేర్చిన రంగు రంగులతో కూడిన బతుకమ్మలను కళాశాల ఆవరణలో ఉంచి బతుకమ్మలు ఆడారు. అనంతరం చేతబూని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఎంతోఅభినందనీయమన్నారు. వేడుకల్లో అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సురేఖ, అధ్యాపకులు జ్యోతి, కె.గోదావరి, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

ఫుట్‌ బాల్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 13 ...

Comment on the article