Breaking News

తనిఖీలతో కమీషనర్‌ హల్‌చల్‌

 

కామారెడ్డి, అక్టోబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ విజయలక్ష్మి తనిఖీలతో హల్‌చల్‌ చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆమె పారిశుద్య విభాగంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్య కార్మికుల హాజరును స్వయంగా తీసుకున్నారు. ఉదయం నుంచి కార్మికుల వెంటే ఉండి పట్టణంలోని వివిద వార్డుల్లో పర్యటించారు. కమీషనర్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా వార్డుల్లో కార్మికులు పనిచేస్తున్నారా, లేదా, ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారా అని అక్కడికి వెళ్లి ఆరాతీశారు. పారిశుద్య జవాన్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వరదల కారణంగా భారీగా మురికినీరు, చెత్త పేరుకుపోయిందని, వాటిని తొలగించడంలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు చెత్తను, మురికి నీటిని తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. లేనిపక్షంలోచర్యలు తప్పవని హెచ్చరించారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article