Breaking News

ఫైళ్ల విభజన, కామారెడ్డి కలెక్టరేట్‌ ఏర్పాట్ల పరిశీలన

 

నిజామాబాద్‌, అక్టోబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్తగా ఏర్పాటవుతున్న కామారెడ్డి జిల్లా కార్యాలయాలకు సంబంధించిన పనులను ఈనెల 7వ తేదీ లోపు పూర్తి చేయాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంచే చేపట్టిన ఫైల్ల విభజన ప్రక్రియను శాంతికుమారి పరిశీలించారు. రెవెన్యూ రికార్డుల విభజన చాలా బాగుందని ప్రశంసించారు. పైళ్ల విభజన, స్కానింగ్‌ సిబ్బంది వివరాల నమోదును మానిటరింగ్‌ చేసేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా వివరించారు. భూగర్జ జల శాఖ డిడి, జిల్లా ఆడిట్‌ అధికారులను ప్రత్యేకంగా నియమించినట్టు తెలిపారు. ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ కార్యాలయంలో రిపేర్లు చేస్తున్న ఫర్నీచర్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి పరిశీలించారు. ఆమె వెంట సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, డిఆర్వో పద్మాకర్‌, కలెక్టరేట్‌ ఎఓ గంగాధర్‌, డిడి గ్రౌండ్‌ వాటర్‌, తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్సు, ఎస్పీ కార్యాలయ భవనాలను జిల్లా కలెక్టర్‌డాక్టర్‌ యోగితా రాణాతో కలిసి పరిశీలించారు. 56 కార్యాలయాలను కలెక్టరేట్‌ కాంప్లెక్సులో ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ కార్యాలయ భవనం సమీపంలోని 90 ఎకరాల ప్రభుత్వ భూమిలో నూతన కలెక్టరేట్‌ భవనాల నిర్మాణానికి ప్రతిపాదించిన భూములను పరిశీలించారు. జాతీయ రహదారి పక్కన ఇంత సువిశాల స్థలం అందుబాటులో ఉండుట పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆమె వెంట ఆర్డీవో నగేశ్‌, డిఎస్పీ తదితరులున్నారు.

Check Also

పరీక్ష కేంద్రం తనిఖీ

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో ...

Comment on the article