Breaking News

చెరువులో పడి గుర్తుతెలియని యువకుని మృతి

 

కామారెడ్డి, అక్టోబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు మత్తడి వద్ద బుధవారం గుర్తు తెలియని యువకుని (28) మృత దేహం లభించినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో చెరువులో నీరునిండి అలుగులు పారుతున్నాయి. ఈ క్రమంలో యువకుడు ఈతగొట్టేందుకు వెళ్లి మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన యువకుని గుర్తించలేదని, గుర్తు తెలియని యువకుని శవం కింద కేసు నమోదుచేసినట్లు తెలిపారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article