Breaking News

Daily Archives: October 6, 2016

మహ్మద్‌నగర్‌లో అటుకుల బతుకమ్మ

  నిజాంసాగర్‌, అక్టోబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌, ఒడ్డేపల్లి, గోర్గల్‌ గ్రామంలో అటుకుల బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. అలాగే బతుకమ్మ ఆటపాటలతో ఆడుతూ, పాడుతూ బతుకమ్మలను తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేస్తున్నారు. ముత్తైదువలు పసుపు, కుంకుమలు ఇచ్చిపుచ్చుకొని, తీర్థ ప్రసాదాలు పంచిపెడుతూ ఆనందంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు.

Read More »

ఘనంగా బతుకమ్మ

  బాన్సువాడ, అక్టోబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలో బతుకమ్మ వేడుకలు జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం బాన్సువాడలోని చైతన్యకాలనీ, పాత బాన్సువాడ తదితర ప్రాంతాల్లో అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు పువ్వులు, కాగితపు బతుకమ్మలు తయారుచేసి పలుచోట్ల బొడ్డెమ్మలు ఆడారు. జాగృతి ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆట ఆడారు. స్తానిక నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Read More »