Breaking News

Daily Archives: October 7, 2016

ఘనంగా అట్ల బతుకమ్మ వేడుకలు

  నిజాంసాగర్‌, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ బతుకమ్మఉయ్యాలో అంటూ మహిళలు బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. నిజాంసాగర్‌ మండలంలోని చౌరస్తా వద్ద బతుకమ్మ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి, మాగి, ఒడ్డేపల్లి గ్రామాల్లో అట్ల బతుకమ్మ సంబరాలు శుక్రవారం ఘనంగా జరిపారు. అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలను నెత్తిన పెట్టుకొని చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఎంపిడివో రాములు నాయక్‌, ఎపిఎం రాంనారాయణగౌడ్‌, ఎంపిపి ...

Read More »

సంస్కృతిని ప్రతిబింబించిన రంగోళి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ముగ్గుల పోటీ సంస్కృతిని ప్రతిబింబించిందని, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న మహిళలు బతుకమ్మ మహా ప్రదర్శనలో కూడా అంతకు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ మైదానంలో ముగ్గుల పోటీనిర్వహించారు. బతుకమ్మ మహా ప్రదర్శనలో భాగంగా జిల్లా సాంస్కృతికశాఖ, జిల్లా యంత్రాంగం ఆద్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో 170 ...

Read More »

నామమాత్రంగా గ్రామసభలు

  నిజాంసాగర్‌, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభలు నామమాత్రంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన గ్రామసభల్లో ఏ సమస్యలు పరిష్కారం కావడం లేదని, నామమాత్రంగా సభలు కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గ్రామసభలో చేసిన తీర్మానాలు మళ్ళీ మళ్ళీ గ్రామ సభలు నిర్వహిస్తున్నా పరిష్కారం కావడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. గ్రామాలను పరిశీలిస్తే నర్వా గ్రామంలో తీవ్ర నీటి సమస్య ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. హసన్‌పల్లిగ్రామంలో ...

Read More »

సాగర్‌లో 5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన

  నిజాంసాగర్‌, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టులో జలాశయానికి అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్‌ కేంద్రంలో 2 యూనిట్ల ద్వారా 5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని ఎడిఇ శ్రీకాంత్‌ తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల జరుగుతుందని, 5 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుందన్నారు. నీటిని ప్రధాన కాలువ ద్వారా మంజీర నదిలోకి విడుదలవుతుందని తెలిపారు.

Read More »

జైభవాని ఆద్వర్యంలో కుంకుమ పూజలు

  కామారెడ్డి, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీ జైభవాని అసోసియేషన్‌ ఆద్వర్యంలో శుక్రవారం దేవీ మండపం వద్ద సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు జరిపారు. ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు లక్ష్మినారాయణ, శ్రీనివాస్‌గౌడ్‌, రాజేందర్‌గౌడ్‌, బాల్‌రాజు, రతన్‌, నర్సింహారెడ్డి, సాగర్‌, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సాయిబాబా ఆలయంలో అన్నదానం

  కామారెడ్డి, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సాయిబాబా మందిరంలో శుక్రవారం సాయిగాయత్రీ యువసేన ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు అన్నదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో యువసేన ప్రతినిధులు సల్ల అశోక్‌ కుమార్‌, రాధికా, శ్రీనివాస్‌రెడ్డి, సంజీవ్‌కుమార్‌, పబ్బ శ్రీహరి, రాజమౌలి, గిరి, శేఖర్‌, మందశ్రీనివాస్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు

  కామారెడ్డి, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బంగారు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కామారెడ్డి గాందీ గంజ్‌లో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆహుతులను విశేషంగా అలరించాయి. మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను తీర్చిదిద్దారు. వివిధ రకాల రంగవల్లులు రూపొందించారు. జై తెలంగాణ, బోనాలు, మిషన్‌ కాకతీయ, హరితహారంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ఇతర పథకాలను రంగవల్లుల ద్వారా ప్రదర్శించారు. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెప్మా పిడి జనార్దన్‌రెడ్డి, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ ...

Read More »

వాలీబాల్‌ రెండోరోజు విజేతలు వీరే…

  కామారెడ్డి, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్న యూత్‌ ఇంటర్‌ డిస్ట్రిక్‌ వాలీబాల్‌ జిల్లాస్థాయి చాంపియన్‌ షిప్‌ పోటీల్లో రెండోరోజు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. పురుషుల విభాగంలో వేరువేరు జిల్లాలు తలపడగా ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, హైదరాబాద్‌ జట్లు ప్రత్యర్థి జిల్లాలపై విజయం సాధించారు. మహిళల విభాగంలో హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జట్లు ప్రత్యర్థి జట్లపై విజయం సాదించాయి. మహిళా విభాగంలో నిజామాబాద్‌- హైదరాబాద్‌జట్లు సెమి ఫైనల్‌కు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో ...

Read More »

బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా రాజలింగం

  కామారెడ్డి, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి మండల ప్రదాన కార్యదర్శిగా దేవునిపల్లికి చెందిన కాసర్ల రాజలింగంను నియమించారు. ఈ మేరకు బిజెపి మండల అధ్యక్షుడు కిషన్‌ శుక్రవారం నియామక పత్రం అందజేశారు. రాజలింగం మాట్లాడుతూ మండలంలోని ప్రతి బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం కోసం తనవంతు కృసి చేస్తానని పేర్కొన్నారు. తనకుబాధ్యతలు అప్పగించినందుకు నాయకులు బత్తుల కిషన్‌, నీలం చిన్న రాజులు, మోతె కృష్ణాగౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాల నర్సింలు, మీసాల నర్సింలు, ...

Read More »

భక్తి శ్రద్దలతో కుంకుమ పూజలు

  కామారెడ్డి, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని విద్యానగర్‌ కాలనీ సాయిబాబా మందిరంలో సాయి గాయత్రీ యువసేన ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమార్చన నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిపారు. సుమారు 1200 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సాయిగాయత్రీ యువసేన ప్రతినిదులు సల్ల అశోక్‌, కొత్తింటి శ్రీనివాస్‌రెడ్డి, సంజీవ్‌కుమార్‌, పబ్బ శ్రీహరి, రాజమౌళి, గిరి, శేఖర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉయ్యాలో.. ఉయ్యాలో…

  నందిపేట, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం బంగారు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ కోలాటాలు, గొబ్బెమ్మలు వేస్తు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరు బతుకమ్మలను ఒకచోటికి చేర్చడంతో పండగ వాతావరణం నెలకొంది. స్తానిక జడ్పిహెచ్‌ఎస్‌ నుంచి ప్రారంభమైన బతుకమ్మల ర్యాలీ చెరువు వరకు కొనసాగింది. ప్రజాప్రతినిదులు అధికారులు పాల్గొన్నారు. సర్పంచ్‌ షాకీర్‌, ఎంపిటిసి అహ్మద్‌ ఖాన్‌, గాండ్ల నర్సుబాయి, ...

Read More »

ఒక్కొక్క పువ్వేసి చందమామ

  బీర్కూర్‌, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒక్కొక్క పువ్వేసి చందమామ అంటూ మహిళలు శుక్రవారం ఘనంగా అట్ల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచి పూలు సేకరించి అందంగా బతుకమ్మలను పేర్చారు. గ్రామ ప్రధాన వీధుల గుండా గాంధీచౌక్‌ వద్ద వేడుకలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన పూల పండుగ బతుకమ్మ ఏర్పాట్లను తహసీల్దార్‌ కృష్ణానాయక్‌, మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌లు పర్యవేక్షించారు. బతుకమ్మల నిమజ్జన ప్రాంతంలో మహిళలకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకున్నట్టు గ్రామ ...

Read More »

ఘనంగా కుంకుమార్చనలు

  బీర్కూర్‌, అక్టోబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని హనుమాన్‌ దుర్గా భవాని కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. శేషు పూజారి ఆద్వర్యంలో ప్రతిరోజు మాలధారణ స్వాములచే అర్చన, అభిషేకాలు, మధ్యాహ్నం ముత్తైదువలచే కుంకుమార్చన, సాయంత్రంవేళ అర్చనలు, విశేష పూజలు చేస్తున్నారు. సిరిసంపదలు, భోగభాగ్యాలు ప్రసాదించేందుకు అమ్మవారిని వేడుకుంటున్నట్టు చెప్పారు. భరత్‌ రాజ్‌ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Read More »

8న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రాక

  నందిపేట, అక్టోబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 8న శనివారం మాక్లూర్‌ మండలం ముల్లంగి గ్రామానికి టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ వస్తున్నట్టు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలిస్తారని అన్నారు. అదేవిధంగా బాధిత రైతులను, ఇళ్లు కూలిపోయిన బాధితులను పరామర్శిస్తారని అన్నారు. వరి,సోయా, మొక్కజొన్న తదితర పంటలు పరిశీలిస్తారని అన్నారు. రైతులు, మండల కార్యకర్తలు తరలిరావాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో ...

Read More »

నష్టపరిహారం ఇవ్వండి

  నందిపేట, అక్టోబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులకు సంబందించిన చేతికొచ్చిన పంటలు సోయా, మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా నష్టపోయాయని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ అన్నారు. ఈమేరకు గురువారం తహసీల్దార్‌ ఉమాకాంత్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో కొన్ని ప్రాంతాల్లో నీట మునిగిన పంట ఇంతవరకు తేలలేదని పేర్కొన్నారు. మరికొన్నిచోట్ల రోడ్లు, మురికి కాలువల వ్యవస్థలు అస్తవ్యస్థమయ్యాయని అన్నారు. పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని వివరించారు. ...

Read More »