Breaking News

Daily Archives: October 8, 2016

ఆస్ట్రేలియాలో అల‌రించిన బ‌తుక‌మ్మ‌

బ‌తుక‌మ్మ ఉత్స‌వాల‌కు హాజ‌ర‌యిన ఎంపి క‌విత‌ సిడ్నీ న‌గ‌రం బ‌తుక‌మ్మ ఆటా-పాట‌తో పుల‌కించింది. బ‌తుక‌మ్మ‌ల చుట్టూ వ‌ల‌యాకారంలో తిరుగుతున్న మ‌హిళ‌ల కాలిఅందెల ర‌వ‌ళుల మ‌ధ్య బ‌తుక‌మ్మ పాట‌లు వీనుల‌విందు చేశాయి. బ‌తుక‌మ్మ త‌యారీ మొద‌లు కొని ఆట‌పూర్త‌య్యేంత వ‌ర‌కూ సిడ్నీ ప‌రిస‌రాలు కొత్త శోభ‌తో ప‌ర్యాట‌కుల‌ను అల‌రించాయి. సిడ్నీసైడ‌ర్స్ గా పిలువ‌బ‌డే సిడ్నీ వాసులు తెలంగాణ‌కే ప‌రిమితం అయిన పూల‌జాత‌ర‌తో ప‌ర‌వ‌శించిపోయారు. ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేష‌న్ ఆహ్వానం మేర‌కు తెలంగాణ‌ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత ఆస్ట్రేలియా వెళ్లారు. సిడ్నీ ...

Read More »

7న బతుకమ్మ ముగ్గుల పోటీ

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, అక్టోబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖచే ఈనెల 7న ఉదయం 9 గంటలకు నిజామాబాద్‌ కలెక్టరేట్‌ మైదానంతో పాటు కామారెడ్డిలోని అంగడిబజార్‌ గ్రౌండ్‌లో బతుకమ్మ ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. ముగ్గుల పోటీ నిర్వహణ బాధ్యతను జిల్లా బిసి సంక్షేమాధికారి విమలాదేవికి అప్పగించినట్టు తెలిపారు. ప్రతిచోట ఉత్తమంగా ఉన్న మూడు ముగ్గులకు నగదు ...

Read More »

రావణ దహనాన్ని అడ్డుకోవాలని వినతి

  కామారెడ్డి, అక్టోబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత, బహుజనుల ఆత్మబంధువు రావణ బ్రహ్మ ప్రతిమ దహనాన్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ యువజన సంఘం మాచారెడ్డి మండల నాయకులు శనివారం ఎస్‌ఐకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పండగ నేపథ్యంలో రావణ బ్రహ్మ ప్రతిమను దహనం చేయడం దళితుల ఆరాధ్య దైవం రావణుని దహనం చేయడమేనన్నారు. ఇది ముమ్మాటికి దళితులపై పెత్తనం చలాయించడానికి చేస్తున్న కార్యక్రమం అని ఆరోపించారు. దసరా అంటే ...

Read More »

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

  నిజాంసాగర్‌, అక్టోబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని చంద్రమౌళేశ్వర ఆలయంలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలో అలాగే ఒడ్డేపల్లి, మల్లూరు, నర్సింగ్‌రావుపల్లి, అచ్చంపేట్‌ తదితర గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. అందంగా పూలతో అలంకరించిన బతుకమ్మలను నెత్తినెత్తుకొని మహిళలు వాటి చుట్టు తిరుగుతూ పాటలు పాడారు. అనంతరం కాలువలు, చెరువుల వద్ద నిమజ్జనం చేశారు.

Read More »

19 గేట్ల ద్వారా నీటి విడుదల

  నిజాంసాగర్‌, అక్టోబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 55 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు డిప్యూటి డిఇ సురేశ్‌ బాబు తెలిపారు. ప్రాజెక్టు ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇన్‌ఫ్లో కొనసాగడంతో నిజాంసాగర్‌కు చెందిన గేట్లను పైకెత్తి దిగువకు వదులుతున్నారు. మెదక్‌ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు, పోచారం, కందివాగు తదితర ప్రాంతాల నుంచి 50 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 50 వేల పైచిలుకు ...

Read More »