Breaking News

Daily Archives: October 13, 2016

తెలంగాణ జిల్లా స్తోత్రమ్

  నిజామాబాద యాదాద్రి జనగామాదిలాభిధ: సూర్యాపేట: సిద్ధిపేట: సంగారెడ్డిర్వినిర్మల : రంగారెడ్డిర్జగిత్యాల: కామారెడ్డి : కరీంనగ: హైదరాబాద భద్రాద్రి మహబూబ్నగరాత్మక: మంచిర్యాలమెదక్ ఖమ్మం వరంగల్నగరాభిధ : వరంగల్గ్రామాసిఫాఖ్యో వికారాబాద సిర్సిల: గద్వాల వనపర్త్యాఖ్యౌ నాగర్కర్నూల్ చ మేడ్చల: పెద్దపల్లిర్నల్లగొండ:భూపాల్పల్లీతి సంజ్ఞిత: మహబూహాబాద షంషాబాదిత్యేతే లసంతి హి ఏకత్త్రింశత్తెలంగాణజిల్లాఖ్యా:భారతక్షితౌ -డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ ప్రణీతం తెలంగాణరాష్ట్ర జిల్లా స్తోత్రం సంపూర్ణమ్.

Read More »

సెంట్రల్‌ లైటింగ్‌ పనులు ప్రారంభం

  కామారెడ్డి, అక్టోబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 27వ వార్డు ఎన్జీవోస్‌ కాలనీలో గురువారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సెంట్రల్‌ లైటింగ్‌ పనులు ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 3 లక్షలతో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ మాసుల లక్ష్మినారాయణ, కౌన్సిలర్లు ప్రభాకర్‌ యాదవ్‌, నాయకులు పిట్ల వేణుగోపాల్‌, లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రూ. 36 వేలకు దుర్గామాత లడ్డు

  కామారెడ్డి, అక్టోబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవినవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విద్యానగర్‌ కాలనీలోని శ్రీగాయత్రీ యువసేన అమ్మవారి వద్ద ఏర్పాటు చేసిన అడ్డుప్రసాదాన్ని బుధవారం రాత్రి వేలం వేశారు. గంప కృష్ణ అనే భక్తుడు రూ. 36 వేలకు అమ్మవారి లడ్డును వేలం పాటలో దక్కించుకున్నారు. 9 రోజుల పాటు అమ్మవారి వద్ద పూజలందుకున్న లడ్డు దక్కించుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో యువసేన ప్రతినిదులు అశోక్‌, రాజమౌళి, కొత్తింటి శ్రీనివాస్‌రెడ్డి, కస్తూరి నాగరాజు, సంజీవ్‌కుమర్‌, రవిందర్‌రెడ్డి, ...

Read More »

అమెరికాలో వైభవంగా బతుకమ్మ వేడుకలు

అమెరికాలోని నార్త్‌కరోలినాలో ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (టీటీజీఏ) ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఆడబిడ్డలు జోర్డాన్ సరస్సు వద్ద బతుకమ్మ ఆడారు. అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ చంద్ర యల్లపంతుల, ప్రసన్న చింతల, కృష్ణ పెడోటీ, సంపత్ పీచు, రేణుక గుర్రాల, పద్మజ నాగారం, శంకర్ రేపాల, హరి అప్పని, శ్రీకాంత్ మద్దోజు, సంతోష్ వరగంటి తదితరులు పాల్గొన్నారు.

Read More »

కెనడాలో బతుకమ్మ ఉత్సవాలు

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ కాల్గరీ ఆధ్వర్యంలో కెనడాలో బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ అల్బెర్టా ఈ వేడుకలకు ప్రోత్సాహం అందించింది. కార్యక్రమంలో వీరేశం, వీరారెడ్డి, పవన్‌కుమార్, సతీశ్, రవి, మహేంద్రారెడ్డి, తిరుమల్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణలో ఎర్పడిన కొత్త జిల్లాలు గుర్తు వుంచుకోడానికి కోడ్..

  జయా వనజ మామ గని సూసి ఆ కోవ భూవి మసి కాపెశ దీనిని ఇలా గుర్తు చెసుకొండి ( జయా,వనజ, మామ వెల్తూ ఒక గని సూసి ఆ (కోవ) సైడు భూమిపై మసి కప్పెశ్హారు ) అని చదువండీ.ఇప్పుడు ఇక్కడ కొడ్ ప్రకారముగా ఇలా వస్తాయి.. జ. — జనగామ యా— యాదాద్రి వ —– వనపర్తి న —- నాగర్ కర్నుల్ జ —- జగిత్యాల మా — మల్కాజ్ గిరి మ — మంచిర్యాల గ —- ...

Read More »

జిల్లా ఎస్పీని కలిసిన యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు

  కామారెడ్డి, అక్టోబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్వేతారెడ్డిని గురువారం కామారెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కన్నయ్య, శ్రీనివాస్‌, షేరూ, విష్ణు, నర్సింగ్‌, ప్రభాకర్‌, కిషన్‌ తదితరులున్నారు.

Read More »

టెకా ఆధ్వర్యంలో యూరోప్‌లోని బర్మింగ్‌హామ్‌లో బతుకమ్మ

తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్ (టెకా) ఆధ్వర్యంలో యూరోప్‌లోని బర్మింగ్‌హామ్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాట్లాడుతున్న ప్రముఖ కవి నందిని సిధారెడ్డి. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి మందిరంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు నందిని సిధారెడ్డితోపాటు భారత కౌన్సిల్ జనరల్ జేకే శర్మ, సినీ నటుడు ఆకాశ్, ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, తెలంగాణ జాగృతి లండన్ అధ్యక్షుడు సంపత్, ప్రముఖ బిజినెస్‌మాన్ డాక్టర్ రాజా పప్పు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని టెకా కార్యదర్శి శేషేంద్ర శేషభట్టర్, కార్యదర్శి రమేశ్ తాటిశెట్టి, కోర్ ...

Read More »

సిపిఎం ఆద్వర్యంలో 2కె రన్‌

  కామారెడ్డి, అక్టోబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి పట్టణంలో 2కె రన్‌ నిర్వహించారు. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్ర అభివృద్ది కోసం సిపిఎం రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఐదునెలల పాటు చేపట్టిన 4 వేల కి.మీ.ల మహాజన పాదయాత్రలో భాగంగా 2 కె రన్‌ నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని ...

Read More »

ప్రమాదవశాత్తు ఒర్రెలోపడి వ్యక్తి మృతి

  కామారెడ్డి, అక్టోబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగాయపల్లి వార్డుమెంబరు గులాల రాజ (36) బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు ఒర్రెలో పడి మృతి చెందినట్టు దేవునిపల్లి పోలీసులు తెలిపారు. బహిర్భూమికి వెళ్లగా ప్రమాదవశాత్తు ఒర్రెలో పడి మృతి చెందాడన్నారు. ఇంటికి రాకపోవడంతో బంధువులు, కుటుంబీకులు గాలించడంతో ఒర్రెలో రాజ మృతదేహం లభించిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Read More »

చెరువులో పడి వృద్దుడు మృతి

  నిజాంసాగర్‌, అక్టోబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన చింతకింది బాలయ్య (60) అనే వృద్దుడు ఊర చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్టునిజాంసాగర్‌ ఎస్‌ఐ అంతిరెడ్డి గురువారం తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… మల్లూరు గ్రామానికి చెందిన చింతకింది బాలయ్య మంగళవారం దసరా పండగ రోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఊరచెరువు వద్దకు వెళ్లి కాలుజారి ప్రమాదవశాత్తు పడి మృతి చెంది ఉంటాడని చెప్పారు. బాలయ్య ఆచూకి కోసం గ్రామ పరిసర ప్రాంతాల్లో కుటుంబీకులు ...

Read More »

ఘనంగా మొహర్రం పండగ

  బీర్కూర్‌, అక్టోబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బీర్కూర్‌ గ్రామంలో గురువారం ఘనంగా మొహర్రం పండగ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన కథలను గ్రామ పెద్దలు వివరించారు. గురువారం సాయంత్రం గాంధీచౌక్‌ వద్దకు పీర్లను తీసుకొచ్చి భాజా భజంత్రీలతో ఆటలు ఆడారు. హిందూ, ముస్లింలకు మొహర్రం పండగ పవిత్రమైందని గ్రామ పెద్ద అవారి గంగారాం అన్నారు. పండగ సందర్భంగా వివిధ వేషాలతో నాటకాలు వేశారు. ముస్లింలు, హిందువులకు రొట్టె మలీద ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం ...

Read More »