Breaking News

సిపిఎం ఆద్వర్యంలో 2కె రన్‌

 

కామారెడ్డి, అక్టోబరు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి పట్టణంలో 2కె రన్‌ నిర్వహించారు. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్ర అభివృద్ది కోసం సిపిఎం రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఐదునెలల పాటు చేపట్టిన 4 వేల కి.మీ.ల మహాజన పాదయాత్రలో భాగంగా 2 కె రన్‌ నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలను వెంటనే ఆచరణలో పెట్టి పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం డివిజన్‌ నాయకులు చంద్రశేఖర్‌, రేణుక, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article