Breaking News

టెకా ఆధ్వర్యంలో యూరోప్‌లోని బర్మింగ్‌హామ్‌లో బతుకమ్మ

తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్ (టెకా) ఆధ్వర్యంలో యూరోప్‌లోని బర్మింగ్‌హామ్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాట్లాడుతున్న ప్రముఖ కవి నందిని సిధారెడ్డి. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి మందిరంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు నందిని సిధారెడ్డితోపాటు భారత కౌన్సిల్ జనరల్ జేకే శర్మ, సినీ నటుడు ఆకాశ్, ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, తెలంగాణ జాగృతి లండన్ అధ్యక్షుడు సంపత్, ప్రముఖ బిజినెస్‌మాన్ డాక్టర్ రాజా పప్పు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని టెకా కార్యదర్శి శేషేంద్ర శేషభట్టర్, కార్యదర్శి రమేశ్ తాటిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు విష్ణు, క్రాంతి, శశికాంత్, రాంరెడ్డి, వెంకట్, కిరణ్, ఉపేందర్, అజయ్, నరేశ్, మూర్తి, తేజ, హరీశ్, శివాజీ, చందన్, రఘు, ప్రవీణ్, మహిళా విభాగం సభ్యులు రేఖ, రమ్య, సౌందర్య, హేమ, స్రవంతి, ఉష, సౌమ్య, మౌనిక, సోనాలి, వోల్గా తదితరులు పర్యవేక్షించారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article