Breaking News

జిల్లా ఎస్పీని కలిసిన యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు

 

కామారెడ్డి, అక్టోబరు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్వేతారెడ్డిని గురువారం కామారెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కన్నయ్య, శ్రీనివాస్‌, షేరూ, విష్ణు, నర్సింగ్‌, ప్రభాకర్‌, కిషన్‌ తదితరులున్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article