Breaking News

ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లాకలెక్టర్‌కు సన్మానం

 

కామారెడ్డి, అక్టోబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం (ట్రస్మా) ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతో పాటు డిఇవో మదన్‌మోహన్‌, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్యలను సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్మా ప్రతినిదులు మాట్లాడుతూ కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో వచ్చిన అధికారులను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షుడు ఆనంద్‌రావు, ఉపాధ్యక్షుడు రమేశ్‌, ప్రతినిదులు రాజశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌, కృష్ణమూర్తి, హన్మంత్‌రావు, గోవర్ధన్‌రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article