Breaking News

కెసిఆర్‌ చిత్రానికి పాలాభిషేకం

 

కామారెడ్డి, అక్టోబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెరాస పట్టణ బిసి సెల్‌ ఆద్వర్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చిత్రపటాలకు పాలతోఅభిషేకం చేశారు. ఈసందర్భంగా బిసి సెల్‌ ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్‌, పట్టణ మైనార్టీ ఆధ్వర్యంలో షౌకత్‌అలీఖాన్‌ మాట్లాడుతూ కామారెడ్డి ప్రజల చిరకాల వాంచ అయిన జిల్లా ఏర్పాటును గుర్తించి ముఖ్యమంత్రి, స్తానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌లు జిల్లాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందుకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు షకీల్‌, అక్రమ్‌, విద్యాసాగర్‌, రవి, జమీల్‌, రాము, అనిల్‌, రాజ్‌కుమార్‌, మధు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article