Breaking News

పిఆర్‌టియు అడ్‌హక్‌ కమిటీ ఎన్నిక

 

కామారెడ్డి, అక్టోబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాకు పిఆర్‌టియు అడ్‌హక్‌ కమిటీలో స్థానం కల్పించారు. అడ్‌హక్‌ కమిటీ జిల్లా అధ్యక్షునిగా దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అల్లాపూర్‌ కుషాల్‌లను ఎన్నుకున్నారు. ఈ నియామక పత్రాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకర్‌, కమలాకర్‌రావులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. కార్యక్రమంలో పిఆర్‌టియు రాష్ట్ర నాయకులు మదుసూదన్‌రెడ్డి, పోశన్న, భాస్కర్‌రావు, రాజులు, పురుషోత్తం శర్మ, శివరంజని, శ్రీనివాస్‌చారి, సురేశ్‌, సంతోష్‌, సంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article