Breaking News

షబ్బీర్‌ అలీకి సోదర వియోగం

 

కామారెడ్డి, అక్టోబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ అన్న మహ్మద్‌ జైన్‌లాబుద్దీన్‌ (68) శుక్రవారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియలు చేశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జైన్‌లాబుద్దీన్‌ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన్ను స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి, జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే గంగారాంలతో పాటు పలువురు నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని పరామర్శించారు. రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌తోపాటు ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి హరీష్‌రావుతో పాటు కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌, జానారెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ఇతర నాయకులు షబ్బీర్‌ అలీని ఫోన్‌లో పరామర్శించారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article