Breaking News

Daily Archives: October 15, 2016

స్నానానికి వెళ్లి విద్యార్థి మృతి

  కామారెడ్డి, అక్టోబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండల పరిధిలోకి గర్గుల్‌ గ్రామ పరిధిలోగల తిమ్మక్‌పల్లి ఊరచెరువులో ఓ విద్యార్థి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు దేవునిపల్లి ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు. తిమ్మక్‌పల్లి గ్రమానికి చెందిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నల్లకిరణ్‌ (17) గ్రామంలోని ఊరచెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు తెలిపారు. కేసునమోదుచేసి, శవ పంచనామా నిర్వహించామన్నారు. మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించామన్నారు.

Read More »

జిల్లా ఎస్పీని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

  కామారెడ్డి, అక్టోబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించిన నేపథ్యంలో ఎస్పీగా బాద్యతలు స్వీకరించిన శ్వేతారెడ్డిని శనివారం కామారెడ్డి కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో శాంతిబద్రతల పరిరక్షణ బాధ్యతలు పకడ్బందీగా అమలుచేయాలని, నేరాల నివారణ కోసం ప్రత్యేక చర్యలుతీసుకోవాలని కోరారు. ట్రాఫిక్‌ వ్యవస్థను గాడిలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో నేతలు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, అశోక్‌రెడ్డి, రాంకుమార్‌గౌడ్‌, నాగేశ్వర్‌రావు, నర్సింలు, కైలాష్‌ లక్ష్మణ్‌రావు, ...

Read More »

ఇద్దరు దొంగల అరెస్టు – రిమాండ్‌

  కామారెడ్డి, అక్టోబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో రెండు నెలల క్రితం ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలను పట్టుకొని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి పట్టణ సిఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను, రికవరి సొత్తును విలేకరులముందు ప్రవేశపెట్టి, కేసు వివరాలు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన వెంకట్‌గౌడ్‌, జీడిమెట్లకు చెందిన నవీన్‌లు హైదరాబాద్‌లో మూడేళ్ల క్రితం గొలుసు దొంగతనాలకు పాల్పడి జైల్లో శిక్ష అనుభవించినట్టు తెలిపారు. తాజాగా ...

Read More »

ఆర్మీ కోసం విరాళాల సేకరణ

  కామారెడ్డి, అక్టోబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత జవాన్లకు సహాయాన్ని అందించి వారిని మరింత శక్తివంతంగా నిర్మించేందుకు గాను కామారెడ్డి కిరాణ వర్తక సంఘం ఆద్వర్యంలో శనివారం విరాళాలు సేకరించారు. విరాళాలు సేకరించే వరకు దుకాణాలు మూసిఉంచి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కిరాణ వర్తక సంఘం వ్యాపారులు పట్టణంలోతిరుగుతూ రూ. 66 వేలు సేకరించినట్టు చెప్పారు. వీటిని ఇండియన్‌ ఆర్మీకి బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. కార్యక్రమంలో వర్తక సంఘం ...

Read More »

కంకరతేలిన రోడ్డుతో ఇబ్బందులు

  నిజాంసాగర్‌, అక్టోబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటిపారుదల శాఖాధికారులు లక్షలాది రూపాయలు ఖర్చుచేసినప్పటికి కంకరతేలిన రోడ్డు గురించి అధికారులు పట్టించుకోవడం లేదని పర్యాటకులు అంటున్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్‌ మీదుగా ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు గల అడ్డ రహదారికి మరమ్మతులు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు గుల్‌గుస్తాకు వచ్చి వెళ్లే పర్యాటకులు సామాన్లు కొనుగోలు చేయడం కోసం నిజాంసాగర్‌ వెళ్లే రోడ్డు కంకరతేలి అధ్వాన్నంగా మారి, ఇరుపక్కల ముళ్లపొదలు పెరగడంతో ...

Read More »

జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన

  నిజాంసాగర్‌, అక్టోబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలవిద్యుత్‌ కేంద్రంలోని అనుసంధానంగా ఉన్న హెర్త్‌లూస్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్టు జెన్‌కో ఎడిఎ శ్రీకాంత్‌ తెలిపారు. ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడంతో రెండవ టర్బయిన్‌ ద్వారా నాలుగు మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా 720 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్టు జలాశయంలో ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో వరదగేట్లు మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ...

Read More »

నాగమడుగుకు మరమ్మతులు

  – సొంత ఖర్చులతో మరమ్మతులు చేస్తున్న ఆటో యూనియన్‌ సభ్యులు నిజాంసాగర్‌, అక్టోబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు అచ్చంపేట్‌ వెళ్లే రహదారిలో నీటిప్రవాహానికి కొట్టుకుపోయిన రహదారికి ఆటోయూనియన్‌ సభ్యులు మరమ్మతులు చేస్తున్నారు. నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌, ఆరేపల్లి, బ్రాహ్మణ్‌పల్లి వెళ్లే రహదారిలో గుంతలు ఏర్పడడంతో వారు సొంత ఖర్చులతో మరమ్మతులు చేపడుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీస మరమ్మతులు చేయకపోవడంతో ఆటో ప్రయాణీకులకు ఇటీవల గాయాలయ్యాయని, ...

Read More »

అమ్మాయి అందంగా ఉంది కదా అని చాట్ చేస్తే…

సౌదీ అరేబియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇతర దేశాలతో పోల్చుకుంటే అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. తప్పు చిన్నదైనా, పెద్దదైనా ఇక్కడ శిక్ష తప్పదు. అబుసిన్ అనే 14 ఏళ్ల టీనేజ్ యువకుడు ఓ యువతితో చాట్ చేసి కటకటాల పాలయ్యాడు. అబుసిన్ యూనౌ అనే ఆన్‌లైన్ కమ్యూనిటీ ఫోరమ్ ద్వారా కాలిఫోర్నియాకు చెందిన 21 సంవత్సరాల క్రిష్టియానా క్రాకెట్‌ అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు. రోజూ గంటల తరబడి ఇద్దరూ చాట్ చేస్తుండేవారు. ఆమెకు అరబిక్ ...

Read More »

జియో కి షాకిచ్చిన ట్రాయ్…

  జియో ఇస్తున్న ఫ్రీ ఆఫర్లకి ఇతర నెట్ వర్కులన్నీ బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జియోకే షాకిచ్చింది ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా). నిమిషానికి రూ. 1.20 వాయిస్ టారిఫ్ అమలులో ఉండగా, ఉచిత కాల్స్ ఆఫర్ ఎలా ఇస్తారంటూ షాకిచ్చింది. రెగ్యులేటరీకి సమర్పించిన రిపోర్టుకు, ప్రస్తుతం ప్రకటించిన ఆఫర్లకు చాలా తేడా ఉన్న కారణంగా జియోను వివరణ కోరినట్టు ట్రాయ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ట్రాయ్ ఉన్నతాధికారులు రిలయన్స్ జియో ప్రతినిధులతో భేటీ అయి, టారిఫ్ ప్లాన్ ...

Read More »

‘ఓయ్ సెక్సీ’ అంటూ పిలిచాడని..!

కాలిఫోర్నియా బేస్డ్ ఫ్లైట్ లో అలస్కా ఎయిర్ లైన్స్ మహిళా సిబ్బందితో ఓ ప్యాసింజర్ దురుసుగా ప్రవర్తించాడన్న కారణంతో అతడిని విమానం నుంచి దింపివేశారు. భద్రత కోసం మహిళా ఉద్యోగిని సూచనలు, సలహాలు ఇస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఓయ్ సెక్సీ.. అంటూ అసభ్యపదజాలంలో మహిళా సిబ్బందిని సంబోధించాడు. అక్టోబర్ 9న జరిగిన ఘటనపై అలస్కా ఎయిర్ లైన్స్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. సీటెల్ నుంచి బర్బాంక్ కు డిపార్టర్ అవడానికి రెడీగా ఉన్న ఫ్లైట్-520 నుంచి ఆ ప్యాసింజర్ ...

Read More »

మహిళల్ని పిచ్చపిచ్చగా వాడుకుంటాం.. నా చెల్లి 16 ఏళ్ల వయస్సులో 7 పురుషుల్ని పెళ్లాడింది!

ఉగ్రవాదం అనేది దారుణాలకు, విధ్వంసాలకు మారుపేరు. వారు క్రూరానికి పెట్టింది పేరు. అలాంటి ఉగ్రవాదంలో ఉగ్రమూకలుగా తిరగాడేవారికి మహిళలపై దయాగుణం ఎక్కడుంటుంది. ప్రజల మధ్య ఉండే  కామాంధులే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుంటే.. కిరాతకంగా వ్యవహరించే ఉగ్రవాదులు మహిళల పట్ల క్రూరంగానే ప్రవర్తిస్తారు. తాజాగా ఉగ్రవాదులు మహిళలను బానిసలుగా, సెక్స్ వర్కర్లుగా చూస్తారని ఓ ఇంటర్వ్యూ తేల్చింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిగా ఉంటూ, స్లీపర్ సెల్స్‌ను నియమించేందుకు వెళ్లిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు నాలుగు నెలల క్రితం అరెస్ట్ చేశారు. అంతేగాకుండా.. అతడి వద్ద ఇంటర్వ్యూ ...

Read More »

మూడులక్షల మంది సైనికులను తగ్గించనున్న చైనా

బీజింగ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాన్ని కలిగిన చైనా తన బలగంలో 3లక్షల సైనికులను తగ్గించుకోనుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో వస్తున్న వదంతులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. చైనా సైన్యం దాదాపు 23లక్షల మేర ఉంది. దీన్ని 3లక్షల మేర తగ్గించనున్నట్లు దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ గత సెప్టెంబర్‌లో ప్రకటించారు. దేశంలో ఆర్థికపరమైన అనిశ్చితి, వృద్ధి రేటు మందగించడం వంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే ఉద్వాసనకు గురైన వందలాది సైనికులు మంగళవారం బీజింగ్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సోవియట్‌ కాలం నాటి విధానాలకు ...

Read More »

సాధారణ మహిళ కోటీశ్వరురాలైంది… ఎలా అయిందో తెలిస్తే షాకే!

జోధ్‌పూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ భారీ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ విస్తుగొలిపే విషయమేంటంటే ఈ స్మగ్లింగ్ ముఠాకు కర్త, కర్మ, క్రియ ఓ మహిళ. జోధ్‌పూర్‌కు చెందిన సుమిత అలియాస్ సునీత ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. అయితే ఆమె ఆశలన్నీ ఆకాశాన్ని చూసేవి. ఆ ఆశే మాదక ద్రవ్యాల అక్రమ దందాలో ఆమెను అంచెంలంచెలుగా ఎదిగేలా చేసింది. ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవనాలతో కోటీశ్వరురాలుగా మార్చింది. అయితే చేసే అక్రమం ఎన్నాళ్లో దాగదు కదా. సుమిత అక్రమంగా విక్రయిస్తున్న ...

Read More »

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ జయంతి

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 – జులై 27, 2015), భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి. “ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్ని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను ...

Read More »

ఇన్ఫీ.. మళ్లీ కోత

ఇన్ఫోసిస్‌ ఫలితాలు అంచనాలను మించి వెలువడ్డాయి. అయితే ఆదాయ అంచనాలను మాత్రం మూడు నెలల్లోనే రెండో సారి కంపెనీ తగ్గించడంతో మదుపర్లకు పెద్దగా రుచించినట్లు లేదు. అనిశ్చిత వ్యాపార పరిస్థితులు ఇందుకు నేపథ్యమని కంపెనీ పేర్కొన్నప్పటికీ స్టాక్‌ మార్కెట్లలో ఇన్ఫీ షేరు ధర 2% శాతం పైగా నష్టాల పాలైంది. ఇవీ ఫలితాలు * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.3,606 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన లాభం రూ.3,398 కోట్లతో పోలిస్తే ఇది ...

Read More »