Breaking News

Daily Archives: October 16, 2016

ఆటోలను తాళ్లతోలాగి వినూత్న నిరసన

  కామారెడ్డి, అక్టోబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం మరోసారి డీజిల్‌ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ కామారెడ్డిలో ఆదివారం ఆర్‌ఎస్‌పి ఆద్వర్యంలో ఆటోలను తాళ్లతో లాగి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు కొత్త నర్సింలు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రబుత్వం పదేళ్ల పాలనలో 12 సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచితే నేటి ఎన్డీయే ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లోనే 9 సార్లు వాటి ధరలు పెంచిందన్నారు. తద్వారా ఆర్టీసి బస్సు చార్జీలు ...

Read More »

ప్రారంభమైన అయ్యప్పస్వాముల మహాపాదయాత్ర

  కామారెడ్డి, అక్టోబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయ్యప్ప దీక్షాపరులు 119 మంది కామారెడ్డి అయ్యప్ప దేవాలయం నుంచి శబరిమలకు మహాపాదయాత్రగా తరలివెళ్లేందుకు సంకల్పించారు. ఆదివారం అయ్యప్ప ఆలయంలో గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వాములు మహాపాదయాత్రను ప్రారంభించారు. దీనికి ఎంపి బి.బి.పాటిల్‌ హాజరయ్యారు. స్వాములు చేపట్టిన దీక్షను ప్రశంసించారు. దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. పాదయాత్రను అయ్యప్ప దేవాలయ కమిటీ అధ్యక్షుడు చీల ప్రభాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉదయ్‌, రమేశ్‌, ...

Read More »

ఉద్యమాల ఫలితంగానే కామారెడ్డిజిల్లా

16 కామారెడ్డి, అక్టోబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిజివిపి ఆధ్వర్యంలో చిన్న జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశామని దాని ఫలితంగానే కామారెడ్డి జిల్లా ఏర్పాటయిందని టిజివిపి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎనుగందుల నవీన్‌ చెప్పారు. కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 నుంచి 24 నూతన జిల్లాలను ఏర్పాటు చేయాలని అందులో కామారెడ్డిని చేర్చాలని ఉద్యమాలు చేశామన్నారు. కామారెడ్డి జిల్లా కావడాన్ని తాము హర్షిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యాపరంగా కామారెడ్డి జిల్లా అట్టడుగున ఉండడం బాధాకరమన్నారు. విద్యారంగంపై ...

Read More »

వృద్దుని అదృశ్యం

  కామారెడ్డి, అక్టోబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన కుంచాల నర్సింలు (75) అనే వృద్దుడు అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందిందని పట్టణ పోలీసులు తెలిపారు. నర్సింలు పుట్టుకతో మూగ అని, ఏడాదిగా మతిస్తిమితం లేదని చెప్పారు. మూడురోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిన నర్సింలు తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వృద్దుడు తెల్లని ధోవతి, చొక్క, రుమాలు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తుజరుపుతున్నామని వివరించారు.

Read More »

యువకుని అదృశ్యం

  కామారెడ్డి, అక్టోబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన కొమ్మగిరి కృష్ణయ్య (20) అనే యువకుని ఆచూకి లభించడం లేదని ఫిర్యాదు అందినట్టు పట్టణ ఎస్‌ఐ శోభన్‌ తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన కృష్ణయ్య కామారెడ్డి శ్రీరాంనగర్‌ కాలనీలో ఉంటూ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడన్నారు. ఈనెల 5వ తేదీన ఇంట్లోంచి వెళ్లిన కృష్ణయ్య తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుజరుపుతున్నామని వివరించారు.

Read More »

మత్స్య విత్తనోత్పత్తి కేంద్రాన్ని అభివృద్ది చేస్తాం

  – కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నిజాంసాగర్‌, అక్టోబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్య విత్తనోత్పత్తి కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి, మత్స్య కార్మికులను ఆదుకుంటామని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఆదివారం నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట మత్స్య విత్తనోత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కేంద్రంలోని కార్యాలయాన్ని, నర్సరీలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 453 చెరువుల్లో కోటి 58 లక్షల చేప పిల్లలను విడుదల ...

Read More »