Breaking News

Daily Archives: October 17, 2016

సుల్తాన్‌నగర్‌లో ఘనంగా కౌడు పీరు ప్రతిష్టాపన

  నిజాంసాగర్‌, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుల్తాన్‌నగర్‌ గ్రామంలో ఆదివారం రాత్రి రంగురంగులతో అందంగా అలంకరించిన కౌడుపీరును మసీదు వద్ద ప్రతిష్టించారు. రోజు భక్తులు పీరు వద్ద మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతిరోజు రాత్రి అసయ్‌దుల్లా… భాజా భజంత్రీలతో ఘనంగా మొహర్రం ఉత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మొహర్రం ఈనెల 22వ తేదీన గ్రామంలో కౌడు పీరు పండుగను ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో తెరాస మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు మహమూద్‌, నాయకులు చాంద్‌ తదితరులున్నారు.

Read More »

మత్తడికి మరమ్మతులు చేయరా…

  నిజాంసాగర్‌, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ -అచ్చంపేట రహదారిలోగల నాగమడుగు లోలెవల్‌ వంతెనపైనుంచి భారీస్థాయిలో ఇటీవల నీటి ప్రవాహం వల్ల వంతెన పూర్తిస్థాయిలో దెబ్బతింది. దీంతో ఈరహదారిలో రాకపోకలు నిలిచిపోయి దాదాపు 15 రోజులు గడుస్తున్నా కేవలం నడుచుకుంటూ నీటిలోంచి వెళ్లవలసిన పరిస్తితి ఏర్పడుతుంది. చిన్న చిన్న వాహనాలు తప్ప భారీ వాహనాలు వెళ్ళే పరిస్తితి లేదు. అచ్చంపేట్‌, ఆరేడు, బ్రాహ్మణ్‌పల్లి, వెల్గనూరు గ్రామాలతో పాటు నారాయణఖేడ్‌, సంగారెడ్డి, జోగిపేట్‌ ప్రాంతాలకు వెల్లే ప్రయాణీకులు ...

Read More »

మంజీరవాగులో పడి వ్యక్తి మృతి

  నిజాంసాగర్‌, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మాగి గ్రామశివారులోని నల్లవాగు మత్తడి దిగువ భాగంలో మంజీరనది లిఫ్టు మోటారు పైపులు నీటిలో మునిగిపోవడంతో తీసేందుకు వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడని ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… మాగి గ్రామానికి చెందిన మెంగారం శంకరయ్య (49) పైపులు నీటిలోంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా కాలుజారి నీటిలో మునిగి మృతి చెందినట్టు తెలిపారు. మంజీరవాగు పక్కన శంకరయ్య వ్యవసాయ పొలం ఉండడంతో నీటిలో మునిగిన పైపులు తీసే ప్రయత్నంలో ...

Read More »

కామారెడ్డి జిల్లా ప్రజావాణిలో 119 ఫిర్యాదులు

  కామారెడ్డి, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 119 ఫిర్యాదులు అందినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదు దారుల నుంచి వినతులు స్వీకరించినట్టు తెలిపారు. ఎక్కువ శాతం రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని పరిస్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read More »

తెలంగాణ యూనివర్సిటీలో కోర్సుల ఎత్తివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి

  కామారెడ్డి, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో పలు కోర్సులను ఎత్తివేస్తామని విసి సాంబయ్య ఆలోచన చేయడాన్ని గర్హిస్తున్నామని, దాన్ని విరమించుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రదాన కార్యదర్శి చెలిమెల భానుప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో సోమవారం ఏఐఎస్‌ఎఫ్‌ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన భాను మాట్లాడుతూ ఏం.ఎ. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎం.ఎ. ఎకనామిక్స్‌, ఎమ్మెస్సీ ఫార్మాసుటికల్‌, ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, ఎల్‌ఎల్‌ఎం, బిఇడి కోర్సుల ...

Read More »

జిల్లా ఎస్పీని కలిసిన యువజన సంఘాలు

  కామారెడ్డి, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కొత్త జిల్లాగాఆవిర్భవించిన నేపథ్యంలో ఎస్‌పిగా బాధ్యతలు స్వీకరించిన శ్వేతారెడ్డిని పలువురు యువజన సంఘాల సభ్యులు సోమవారం కలిసి అభినందనలు తెలిపారు. యూత్‌ కాంగ్రెస్‌ మైనార్టీ నాయకులు, ప్రయివేటు పాఠశాలల ప్రతినిదులు ఎస్‌పిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

సాందీపని విద్యార్థికి ఉత్తమ వాలంటరీ అవార్డు

  కామారెడ్డి, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో తోంగ్‌ డ్యాం వద్ద అడ్వంచర్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ను ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించగా తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బెస్టు వాలంటీర్‌గా కామారెడ్డిపట్టణం సాందీపని డిగ్రీ కళాశాలకు చెందిన రాజ్‌కుమార్‌ ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్‌, డైరెక్టర్‌ సాయిబాబా, బాలాజీరావు తెలిపారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఉత్తమ వాలంటీర్లలో తమకళాశాలకు చెందిన విద్యార్థికే స్థానం దక్కడం పట్ల అధ్యాపకబృందం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా విద్యార్తిని సన్మానించారు.

Read More »

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

  కామారెడ్డి, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూరు మండలం మాల్గుడి రెస్టారెంట్‌ వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే… ఆర్మూర్‌కు చెందిన రవిందర్‌ అతని భార్య హరిజ పుష్పలు సోమవారం ఉదయం హైదరాబాద్‌లో వారి కూతురును దిగబెట్టి కామారెడ్డికి తిరుగుప్రయాణమయ్యారు. భిక్కనూరు మండలంలోని మాల్గుడి వద్ద అల్పాహారం చేసేందుకు కామారెడ్డి వైపు వస్తూ యుటర్న్‌ తీసుకోగా హైదరాబాద్‌ వైపు వెళుతున్న ఇంద్ర ఆర్టీసి ...

Read More »

డ్రిప్‌ ఇరిగేషన్‌ కేటాయించాలి

  నందిపేట, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సోమవారం రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం 500 హెక్టార్లు కేటాయించాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి మంజూరు చేస్తామని తెలిపినట్టు చెప్పారు. ఆయన వెంట నందిపేట ఎంపిపి అంతంపల్లి యమున, తెరాస నాయకులు అంకంపల్లి రవి, ఆనంద్‌రెడ్డి, తదితరులున్నారు.

Read More »

పోలింగ్‌ స్టేషన్లలో అవసరమున్నచోట మార్పులు

  నిజామాబాద్‌, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ స్టేషన్‌ల బవనాలు కూలిపోవడం వల్ల ఓటర్లకు అందుబాటులో లేనందున నిజామాబాద్‌ జిల్లా అర్బన్‌లో మార్పు చేయడం జరిగిందని సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం జేసి చాంబరులో రాజకీయ ప్రతినిదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎలక్షన్‌ కమీషన్‌ ఆదేశానుసారం జిల్లాలో 2106 పోలింగ్‌ స్టేషన్‌లలో భవనాలు కూలిపోయిన ప్రాంతాలకు చెందిన వాటిని, ఓటర్లకు అందుబాటులో లేని పోలింగ్‌ స్టేషన్లను మార్పు చేయడం జరిగిందనే విషయం రాజకీయనాయకులకు తెలియజేసి వారి ...

Read More »

హరితహారం మొక్కలను రక్షించండి

  నందిపేట, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని సి.హెచ్‌.కొండూరు గ్రామంలో హరితహారం కింద నాటిన మొక్కలను రక్షించాలని, అక్రమంగా తవ్వుతున్న గుట్టను ఆపాలని సి.హెచ్‌.కొండూరు గ్రామానికి చెందిన భూమయ్య తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. వర్షాకాలంలో హరితహారం కింద నాటిన మొక్కలను గత వారంరోజులనుండి కొందరు కాంట్రాక్టర్లు అక్రమంగా మొరం కొరకు కొండను తవ్వుతూ నాశనం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More »

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచనపోటీలు

  నందిపేట, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు అమరవీరుల దినోత్సవంపై అవగాహన కల్పించేందుకు నందిపేటలోని ప్రభుత్వ ఉర్దూ, తెలుగు మీడియం హైస్కూల్లో నందిపేట పోలీసుల ఆధ్వర్యంలో మహిళల భద్రత-తీసుకోవాల్సిన జాగ్రత్త అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచనపోటీలు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎస్‌ఐ జాన్‌రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 21వతేదీ అక్టోబరులో పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు శ్రద్దాంజలి ఘటిస్తామన్నారు. 1959 అక్టోబరు 21న ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. విద్యార్థులకు, ...

Read More »

జిల్లా అభివృద్దికి అధికారులందరు కృషి చేయాలి

  నిజామాబాద్‌, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలన్నా అన్ని శాఖల అధికారులు అహర్నిశలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లా అధికారులతో కలెక్టర్‌ మట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనా సౌలభ్యం కొరకు చిన్న చిన్న జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల ముంగిట పాలన అందించాలనే ఆశయం మేరకు ప్రతి శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారి మంగళవారం నుంచి ఈనెల 31వ ...

Read More »

తెవివిని సందర్శించిన జవహార్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ ఆచార్యులు

  డిచ్‌పల్లి, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిష్టాత్మక ఢిల్లీ జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌ ఆచార్యులు అజయ్‌ తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సాంబయ్యను తన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆచార్య అజయ్‌ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీకి సువిశాల ప్రాంగణం, అనుభవం కలిగిన అధ్యాపకులు ఉండడం శుభసూచకమని పేర్కొన్నారు. విద్య, పరిశోధనా రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించిందని అన్నారు. భవిష్యత్తులో ఢిల్లీ జవహార్‌లాల్‌ విశ్వవిద్యాలయంలో తెలంగాణ యూనివర్సిటీ అవగాహన ఒప్పందంపై ప్రాథమికంగా చర్చించడం జరిగిందన్నారు. ...

Read More »

కోతమిషన్‌ కిందపడి యువకుని మృతి

    బీర్కూర్‌, అక్టోబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి కొరకు వరి కోత మిషన్‌పై పనిచేసే యువకుడు అదే మిషన్‌ కింద పడి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సిఐ రమణారెడ్డి, ఏఎస్‌ఐ మజీద్‌ఖాన్‌ కథనం ప్రకారం… వర్ని మండలం తైలపల్లి గ్రామానికి చెందిన చెట్టుకింద వీరేశం (26) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వరి కోత మిషన్‌పై డ్రైవర్‌గా చేరాడు. ఇదే క్రమంలో వరికోతల సీజన్‌ దృష్ట్యా బీర్కూర్‌ గ్రామానికి ఆదివారం సాయంత్రం ...

Read More »

రెండు కార్ల ఢీ… ఇద్దరు పారిశ్రామిక వేత్తల దుర్మరణం!

చెన్నై : మహాబలిపురం సమీపం ఈసీఆర్‌ రోడ్డులో ఆదివారం ఉదయం రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు పారిశ్రామికవేత్తలు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మన్నడి ప్రాంతానికి చెందిన సైజర్‌ డి జోకర్‌ (52), ఆర్టీఎం జోకర్‌ అనే ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఆదివారం వేకువజామున వ్యాపార లావాదేవీల నిమిత్తం కారులో పుదుచ్చేరికి బయలుదేరారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మహాబలిపురం బైపాస్‌రోడ్డులో ఆ కారు వెళుతుండగా ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పారిశ్రామికవేత్తలు ప్రయాణించిన కారు ...

Read More »

చేనేత కార్మికులకు ప్రత్యేక నిదులు కేటాయించాలి

  కామారెడ్డి, అక్టోబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి వారికి చేయూత నివ్వాలని పద్మశాలి యువజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. పివైఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐరేని సందీప్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికి ప్రభుత్వం వారిని పట్టించుకొని ఆర్థికంగా అభివృద్ది పరిచే దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. పింఛన్‌ విధానాన్ని తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అందరు ...

Read More »