Breaking News

Daily Archives: October 19, 2016

సాందీపని డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం

  కామారెడ్డి, అక్టోబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం, రోటరీ క్లబ్‌ సంయుక్త ఆద్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 20 మంది విద్యార్థులు, అద్యాపకులు రక్తదానం చేసి రెడ్‌క్రాస్‌ సంస్తకు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కళాశాల సిఇవో హరిస్మరణ్‌ రెడ్డిలు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ...

Read More »

సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, అక్టోబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా విద్యాదికారికి బుధవారం కార్మికులు వినతి పత్రం సమర్పించారు. వంట కార్మికులు జిల్లా విద్యాధికారి మదన్‌మోహన్‌ను కలిసి మర్యాదపూర్వకంగా నోటుపుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారంలో మూడుసార్లు కోడిగుడ్లు పెట్టడం వీలుకావడం లేదన్నారు. గుడ్డుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని, నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా స్లాబ్‌రేటు పెంచాలని, ...

Read More »

జిల్లా కలెక్టర్‌కు సన్మానం

  కామారెడ్డి, అక్టోబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిజిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణను మునిసిపల్‌ కౌన్సిలర్లు, ఆయా పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు బుధవారం సన్మానించారు. కామారెడ్డి మునిసిపల్‌ మహిళా కౌన్సిలర్లు ఫిరోజ్‌ సుల్తానా, పద్మ రాంకుమార్‌, యాదమ్మ, శశిరేఖ, గోనె సునితలు జిల్లా కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. మునిసిపల్‌ అభివృద్దికి సహకరించాలని కోరారు. టిడిపి నాయకులు ఉస్మాన్‌, రాములు, చీల ప్రభాకర్‌, పల్లె రామస్వామి, మాణిక్య రెడ్డి, రాజమౌళి, నర్సింగ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డితోపాటు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ...

Read More »

సానిటరీ ఎస్‌ఐపై కమీషనర్‌కు ఫిర్యాదు

  కామారెడ్డి, అక్టోబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీ సానిటరీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మహిళా కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడని బుధవారం కాంట్రాక్టు కార్మికులు మునిసిపల్‌ కమీసనర్‌ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి వినతి పత్రం సమర్పించారు. మహిళా కార్మికుల చేత మగవారుచేసే పనులు చేయిస్తూ వారిని వేదింపులకు గురిచేస్తున్నారన్నారు. వారిని దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. తక్షణమే సానిటరీ ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విదులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్మికులకు గ్రూప్‌ ఇన్సురెన్సు, సాధారణ, వారాంతపు సెలవులు, పనిముట్లు, ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించాలి

  – కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, అక్టోబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వైద్యాధికారులను, సిబ్బందిని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో కలియతిరిగారు. రోగులకు వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రోగులు వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రితోపాటు, పరిసరాలను ...

Read More »

మిషన్‌ భగీరథ పనులు నిర్ణీత గడువులో పూర్తిచేయాలి

  కామారెడ్డి, అక్టోబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌ భగీరథ పథకం పనులకు వాటర్‌ గ్రిడ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖాధికారులు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పనులు నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ చాంబరులో మిషన్‌ బగీరథ పథకం పురోగతిపై వాటర్‌గ్రిడ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, జాతీయ రహదారులు, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఫేస్‌- 1,2,3 కింద జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు అందరు ...

Read More »

పిచ్చిమొక్కల తొలగింపు

  నిజాంసాగర్‌, అక్టోబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని స్తానిక ఎంపిడివో కార్యాలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలద్వారా గడ్డిమొక్కలు తొలగించి, ఆవరణ శుభ్రం చేశారు. కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కల చుట్టు కంచెలు ఏర్పాటు చేసి మొక్కలను సంరక్షించేలా చర్యలు చేపడుతున్నారు. హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించాలని సిఎం కెసిఆర్‌ ఆదేశాలు ఉండడంతో ఆదిశగా చర్యలు చేపడుతున్నారు.

Read More »

పోలీసుల ఆద్వర్యంలో వ్యాసరచన పోటీలు

  బీర్కూర్‌, అక్టోబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని బీర్కూర్‌ ఉన్నత పాఠశాలలో ఏఎస్‌ఐ మజీద్‌ఖాన్‌, పోలీసుల ఆధ్వర్యంలో ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు సమాజంలో పోలీసుల పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. అనంతరం కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు పోలీసు స్టేషన్‌లో వ్యవహారాలు, పనితీరు, ఆయుధాల గురించి అవగాహన కల్పించారు. పోలీసుల త్యాగాలు గుర్తుచేసేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఏఎస్‌ఐ పేర్కొన్నారు. విద్యార్థులకు చట్టం గురించి ...

Read More »

విద్యార్థులకు తప్పని అవస్థలు

  నిజాంసాగర్‌, అక్టోబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కళాశాల విద్యార్థులకు ప్రతిరోజు బాన్సువాడ వెళ్లేందుకు అవస్థలు తప్పడం లేదు. నిజాంసాగర్‌ మండలం నుంచి ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు బాన్సువాడ పట్టణానికి కళాశాలలకు చదువుకోవడానికి వెళుతుంటారు. వారికి జహీరాబాద్‌-2 డిపోకు చెందిన బస్సు మినహా బాన్సువాడ డిపోకు చెందిన ఆర్డినరి బస్సులు లేవు. దీంతో విద్యార్థులు ప్రతినిత్యం బస్సుల కోసం పడుతున్న బాధలు అన్ని, ఇన్నికావు. నిజాంసాగర్‌ నుంచి బాన్సువాడకు ఆర్డినరి బస్సులు ఏర్పాటు ...

Read More »

ఇన్‌శాట్ 3డీ/3డీఆర్‌ ఉపగ్రహాల ద్వారా అద్భుతమైన సమాచారం: ఇస్రో

నెల్లూరు: ఇన్‌శాట్ 3డీ/3డీఆర్‌ ఉపగ్రహాల ద్వారా అద్భుతమైన సమాచారం అందుతోందని ఇస్రో తెలిపింది. భూమి, వాతావరణం, సముద్రాలపై ఇన్‌శాట్ 3డీ సమాచారం అందిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. రెండు ఉపగ్రహాల పనితీరును తెలుపుతూ యానిమేషన్ వీడియోను ఇస్రో విడుదల చేసింది. సెప్టెంబర్ 8న అంతరిక్ష్యంలోకి ఇన్‌శాట్ 3డీఆర్ చేరింది.

Read More »

కింగ్‌ఫిషర్ విల్లా అమ్మకం రేపే

ముంబాయి: పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి బ్యాంకు రుణం చెల్లించలేక విదేశాల్లో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా కింగ్‌ఫిషర్ విల్లాను రేపు అమ్మాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాల కోసం ఈ భవనాన్ని 2010లో బ్యాంకుల కన్సార్టియం వద్ద తనఖా పెట్టాడు. దీంతో 17 మంది రుణదాతల కన్సార్టియం వేలానికి ఉంచింది ఎస్‌బీఐ. ఈ విల్లా రిజర్వు ధరను రూ.85.29 కట్లుగా వెల్లడించారు.

Read More »

కిగాలి ఒడంబడిక

భూతాపాన్ని వేగంగా పెంచే శీతలీకరణ వాయువుల (హైడ్రో ఫ్లోరో కార్బన్స్‌-హెచ్‌ఎ్‌ఫసీ) వినియోగాన్ని దశలవారీగా తొలగించే లక్ష్యంతో రువాండా రాజధాని కిగాలిలో 197 దేశాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం జరిగింది. ఏసీలు, ఫ్రిజ్‌లు, కార్లు తదితరాల్లో శీతలం కలిగించేందుకు వినియోగించే యంత్ర పరికరాలు హెచ్‌ఎ్‌ఫసీ వాయువుల ఆధారంగా నడుస్తాయి. అయితే కార్బన్‌డై ఆక్సైడ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, నీటి ఆవిరి వంటి ఇతర హరిత గృహ వాయువులు (గ్రీన్‌ హౌస్‌ గ్యాసెస్‌) కంటే హెచ్‌ఎ్‌ఫసీలు కొన్ని రెట్లు ఎక్కువ భూతాపం కలిగిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ...

Read More »

సుధీర్‌పై రష్మి సీరియస్!

జబర్దస్త్ కామెడీ షోతో రష్మి ఎంత పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే. ఆ పాపులారిటీతోనే సినిమాల్లో హీరోయిన్‌గానూ అవకాశాలు దక్కించుకుంటోంది. గుంటూర్ టాకీస్‌తో హీరోయిన్‌గా అరంగేట్రం చేసి.. హాట్‌హాట్‌గా కనిపించిందీ భామ. అయితే.. అదే జబర్దస్త్ కామెడీషోలో పాల్గొంటున్న సుడిగాలి సుధీర్‌తో ఆమెకు ఎఫైర్ ఉందంటూ అప్పట్లో రూమర్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే.. తాజాగా సుడిగాలి సుధీర్‌కు రష్మి వార్నింగ్ ఇచ్చింది. ఓ ప్రముఖ చానెల్ వచ్చే ఢీ జోడి కార్యక్రమంలో మాట్లాడిన సుధీర్.. ఢీ జోడి ప్రోగ్రామ్ పూర్తయ్యే లోపు ఎప్పుడైనా జోడీగా ...

Read More »

సౌదీ యువరాజు ఉరితీత.. హత్య కేసులో శిక్ష అమలు

రియాద్‌,: ఓ హత్య కేసులో నిందితుడైన సౌదీ రాజ కుటుంబ సభ్యుడిని ఉరి తీశారు. అదెల్‌ అల్‌ మహ్మ ద్‌ అనే వ్యక్తిని కాల్చి చంపిన సౌదీ యువరాజు టర్కిబిన్‌ సౌద్‌ అల్‌ కబీర్‌కు మంగళవారం రియాద్‌లో ఈ శిక్ష అమలు చేశారు. దీంతో సౌదీలో ఈ ఏడాది మరణశిక్ష అమలు చేసిన వారి సంఖ్య 134కి చేరింది. కాగా, రాజ కుటుంబ సభ్యుడిని ఉరి తీయడం సౌదీలో అరుదైన ఘటనగా నిల్చింది. మిత్రుడితో ఘర్షణ పడిన సౌదీ యువరాజు అల్‌ కబీర్‌, 2012లో ...

Read More »

అనంతలో ఉండి చీపురుపట్టుకుంటా.. అప్పుడే అమ్మాయికి లవలెటర్ రాశా: జేసీ

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు తోచిన విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేసే జేసీ.. తాజాగా అనంత పర్యటనలో ఉన్నారు. అనంతపురం నగర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ పారిశుద్ధ్య శంఖారావం సదస్సులో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనంతలో ఉండి రేపటి నుంచి చీపురుపట్టుకుని తానే ఊడుస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి స్థానిక రాజకీయాలు అడ్డుపడుతున్నాయని.. ఎవరు అడ్డుపడినా తాను జిల్లా అభివృద్ధికి పాటుపడతానని జేసీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేసీ ఆసక్తికర వ్యక్తిగత ...

Read More »

‘వాట్సాప్’ సెక్స్ రాకెట్.. రేటు, చోటు ముందే ఫిక్స్!

గురుగావ్: టెక్నాలజీని వాడుకోవడం తెలియాలే గానీ తమకంటే బాగా వాడేవారు ఎవరూ ఉండరని నిరూపించిందో సెక్స్ రాకెట్ ముఠా. తమ కార్యకలాపాలకు ‘వాట్సాప్‌’ను విస్తృతంగా ఉపయోగించుకుంది. చివరికి పోలీసులకు ఉప్పందడంతో ముఠా సభ్యులు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో సెక్టార్ 51లో వాట్సాప్ ద్వారా ఓ ముఠా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. మిగతా ముగ్గురు ఢిల్లీకి చెందిన వారు. ...

Read More »

సీసీటీవీలో దెయ్యం కనిపించింది.. లారీలు, కారులు డాష్ ఇచ్చినా ఏం కాలేదు..

సీసీటీవీలో దెయ్యం కనిపించిందంటే నమ్ముతారా..  నమ్మితీరాల్సిందే. పలు వాహనాలు ఢీకొట్టినా ఆ దెయ్యం రోడ్డుపై అలానే నడిచిపోతున్న దృశ్యంతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దెయ్యాలతో కూడిన వీడియోలు యూట్యూబ్‌లో కోకొల్లలు. అలాంటి దెయ్యమే చిల్లాంగ్ నగరంలోని ఓ సీసీటీవీకి ఓ దెయ్యం చిక్కింది. చిల్లాంగ్ రోడ్డులో తెల్లవారు జామున 2.11 గంటలకు ఓ నల్లటి ఆకృతి గల దెయ్యం రోడ్డుపై నడుస్తూ వెళ్ళింది. ఆ సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న లారీలు, బస్సులు ఆ నల్లటి ఆకృతి గల ...

Read More »