Breaking News

Daily Archives: October 20, 2016

పోలేరమ్మ ఆలయంలో చోరీకి యత్నం

  నందిపేట, అక్టోబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆంధ్రానగర్‌ గ్రామంలోగల పోలేరమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించినట్టు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… గ్రామంలోని పోలేరమ్మ ఆలయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తాళం పగులగొట్టి వస్తువులను దొంగిలించే ప్రయత్నం చేశారన్నారు. గురువారం గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జాన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గ్రామ కమిటీ వారు సిసి కెమెరాలు ...

Read More »

నీటికుంటలో పడి యువకుని మృతి

  నందిపేట, అక్టోబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామంలో గురువారం నీటికుంటలో పడి యువకుడు మృతి చెందాడు. నందిపేట ఎస్‌ఐ జాన్‌రెడ్డి కథనం ప్రకారం… మండలంలోని లక్కంపల్లి గ్రామానికి చెందిన గంధం గంగాధర్‌ (35) గోసంగి కులస్తుడు గ్రామంలోని నీటి కుంట వద్ద ఇతరులతో కలిసి మేకలను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తుజారిపడి మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసినట్టు ఎస్‌ఐ అన్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Read More »

ఇస్లామియా చట్టాలలో ప్రభుత్వ జోక్యం వద్దు

  – నందిపేట మండల ముస్లింల పిలుపు నందిపేట, అక్టోబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని పాత ఉర్దూ పాఠశాలలో గురువారం జరిగిన మండల స్థాయి సమావేశంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న చట్టాలను నిరసిస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముస్లింల చట్టాలలో తలాక్‌ విషయంలో తలదూర్చవద్దని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ పేరుతో ముస్లిం చట్టాలలో మార్పుచేయాలని చూడడం తగదన్నారు. ముస్లిం ...

Read More »

రైతు అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, అక్టోబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండించిన పంటలను దళారీ వ్యవస్థ లేకుండా కొనుగోలుదారులకు విక్రయించి అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం వర్ని మండలంలోని సిసిడి స్వచ్చంద సంస్థలో ఏర్పాటు చేసిన కూరగాయల పంట కాలనీలపై రైతు అవగాహన సదస్సులో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఒక లక్ష ...

Read More »

కామారెడ్డికి ఎక్స్‌ప్రెస్‌ బస్సు ప్రారంభించిన ఎంపిపి

  బీర్కూర్‌, అక్టోబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రం నుంచి నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా కేంద్రానికి గురువారం రెండు ఆర్టీసి బస్సులను ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో రెండు బస్సులు ప్రారంభిస్తున్నట్టు ఎంపిపి మల్లెల మీణ తెలిపారు. ఈ సందర్భంగా జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండల కేంద్రం కామారెడ్డి జిల్లాకు దూరంగా ఉండడంతో మండలం వెనకబడిపోతుందనే కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మొద్దని, మండల ప్రజల ...

Read More »

ఎడారి దేశంలో భారీ మోసం.. 55 కోట్లతో ప్రవాసీ పరార్

‘ఎడారి’లో ఆషాఢభూతి  తోటి తెలుగువారి నమ్మకమే పెట్టుబడి.. భారీగా లాభాలంటూ ప్రలోభం  ఇష్టారీతిన వసూళ్లు.. దుబాయ్‌లో రూ.55 కోట్లతో ప్రవాసీ కుచ్చుటోపీ..  కుటుంబంతో కలిసి భారతకు పరార్‌.. లబోదిబోమంటున్న బాధితులు  దేశంకాని దేశంలో ఓ తెలుగువాడు కనిపించి పలకరిస్తే హ్యాపీగా ఫీలవుతాం. అలాంటిది కోట్లకు పడగలెత్తిన వ్యక్తి ఇంటికి పిలిపించుకొని రాచమర్యాదలు చేస్తే, చక్కని తెలుగులో మాట్లాడుతూ ఆప్యాయతలు ఒలకబోస్తే ఫిదా అవకుండా ఉంటామా? సౌదీలో రెండేళ్ల క్రితం స్థిరపడ్డ ఓ తెలుగాయన తోటి తెలుగువారిని ఈ విధంగానే ఆకర్షించాడు. తన భార్య పేరిట ...

Read More »

ఆన్‌లైన్‌ మ్యాట్రిమోని మోసం

బాధితురాలి నుంచి 7.50 లక్షలు, నగలు కాజేసిన కేరళవాసి అరెస్టు  మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రబుద్ధుడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ పాలక్కడ్‌కు చెందిన శశిధరన్‌ ఓ కంపెనీలో అడ్మినిసే్ట్రషన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. జీవనసతి మ్యాట్రిమోని వైబ్‌సెట్లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు. బ్రిటన్‌లో నివసిస్తున్నట్టు అందులో పేర్కొన్నాడు. మాదాపూర్‌కు చెందిన ఓ యువతి పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె బ్రిటన్‌కు రావాలంటే వీసాకు ఖర్చవుతుందన్నాడు.విజయబ్యాంక్‌ అకౌంట్‌లో రూ.7.50 ...

Read More »

కాశ్మీర్‌లో భారీగా పాక్, చైనా జెండాలు..

జమ్మూకశ్మీర్: రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆర్మీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్న 100 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. వీరిని జైషే మహ్మద్, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులుగా అనుమానిస్తున్నారు. ఆందోళనకారుల వద్ద నుంచి పాకిస్థాన్, చైనా జెండాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. భారీస్థాయిలో పాకిస్థాన్ జెండాలు ఉండడం ఆర్మీ అధికారులను విష్మయానికి గురిచేసింది.

Read More »

రామనామం

అయోధ్యలో ‘రామాయణం మ్యూజియం’ నిర్మించాలన్న కేంద్రప్రభుత్వం నిర్ణయంలో రాజకీయం లవలేశమైనా లేదంటే ఎవరూ నమ్మరు. పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రతిపాదనలను స్వాగతించవలసిందే కానీ, ఇందుకు కేంద్రం ఎంచుకున్న స్థలకాలాదుల్ని చూసినప్పుడు కేంద్ర మంత్రి మహేష్‌ శర్మ మాటల్లో విశ్వాసం కలగదు. వివాదాస్పద రామజన్మభూమి స్థలానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో, పాతిక ఎకరాల్లో ఈ మ్యూజియం తలపెట్టడంతో, రామమందిరం నిర్మాణం డిమాండ్‌ మళ్ళీ రాజుకుంటున్నది. ఉమాభారతి, వినయ్‌ కతియార్‌ ఇత్యాది నాయకులు ఇలా లాలీపాప్‌లతో సరిపెట్టవద్దంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించకుండా ‘నమో’ ...

Read More »

స్మార్ట్ఫోన్ రారాజులకు చైనీస్ బ్రాండ్ల దెబ్బ

భారత్లో స్మార్ట్ఫోన్ రారాజులు శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ల మార్కెట్ షేరుకు దెబ్బకొడుతూ చైనీస్ కంపెనీలు దూసుకెళ్లాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనీస్ స్మార్ట్ఫోన్ ప్లేయర్లు లెనోవో, షియోమి, వివో, ఓపోలు మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టి, టాప్-10 స్థానాల్లో నిలిచాయని హాంగ్కాంగ్ ఆధారిత మార్కెట్ రీసెర్చర్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గత క్వార్టర్లో 27శాతమున్న చైనీస్ బ్రాండ్ల మార్కెట్ షేరు ఈ క్వార్టర్లో 32శాతానికి ఎగిసిందని పేర్కొంది. అదేవిధంగా సెప్టెంబర్లో లాంచ్ చేసిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సర్వీసులతో ఆ ఇండస్ట్రీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ...

Read More »

తిరుపతిలో సైకో పాఠశాలకు వెళ్ళి బట్టలిప్పేశాడు.. ఆ తరువాత ఏం చేశాడు?

తిరుపతిలో ఒక సైకో హల్‌‌చల్‌ చేశాడు. ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌లో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలోకి వెళ్ళాడు. విద్యార్థులు చూస్తుండగానే ఒంటిపై ఉన్న బట్టలన్నింటినీ విప్పేశాడు. అంతటితో ఆగలేదు… అన్ని తరగతులను తిరిగాడు. సైకో చేష్టలను చూసిన విద్యార్థులు గట్టిగా కేకలు వేశారు. విద్యార్థులతో కలిసి సైకో అరవడం మొదలుపెట్టాడు. అన్ని తరగతులను చుట్టేశాడు. పాఠశాలలోని కొంతమంది అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా ఫలితం లేకుండా పోయింది. టీచర్లు ఉండే గది వద్దకు వెళ్లాడు. అక్కడ వారితో అసహ్యంగా ప్రవర్తించాడు. దీంతో కొంతమంది మహిళా టీచర్లే ...

Read More »

అమ్మకు విదేశాల్లో వైద్యం వద్దే వద్దు.. పండితులు చెప్పేశారు.. శశికళ నుంచి నో సిగ్నల్..

తమిళనాడు సీఎం జయలలిత గత 28 రోజులుగా చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22వ తేదీన ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరిన జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్‌ వారం రోజులుగా రిలీజ్ కాలేదు. అమ్మకు చికిత్స అందించేందుకు ముందుగా ముంబై నుంచి డాక్టర్లు అపోలోకు వచ్చారు. ఆపై లండన్ నుంచి రిచర్డ్ తన వైద్య బృందంతో చెన్నైకి వచ్చారు. వీరికి తర్వాత ఎయిమ్స్ వైద్యులను కేంద్రం చెన్నైకి పంపింది. ప్రస్తుతం సింగపూర్ నుంచి ఫిజియోథెరపీ నిపుణులు చెన్నై అపోలోకి వచ్చారు. ...

Read More »

మేకప్ లేకుండా తొలిసారి భార్యను చూసి…

దుబాయ్ : పెళ్లి చూపులలోను, పెళ్లిలోను కూడా అమ్మాయిలకు మేకప్ చేసి చూపించడం సర్వసాధారణం. అయితే అది ఒక మాదిరిగా ఉంటే పర్వాలేదు గానీ.. ఏకంగా పూర్తిగా రూపాన్నే మార్చేసేలా ఉంటే కష్టమే. తన భార్యను మేకప్ లేకుండా మొట్టమొదటిసారి చూసిన ఓ అమాయకుడు.. ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి పెళ్లి చేసుకున్న భార్య ఈమేనా అని బాధపడి.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన యూఏఈలో చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లయిన జంటలోని సదరు మహిళామణి.. సరదాగా స్విమ్మింగ్‌కు వెళ్లి వచ్చేసరికి ఆమె ...

Read More »

అజిత్‌పై అమ్మ ఎక్స్‌ట్రా కేర్.. రిస్కులు తీసుకోవద్దు బాబూ.. ఫ్యామిలీ ఉంది గుర్తుపెట్టుకో..

తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఎనిమిది రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటనే దానిపై అపోలో వైద్యులు బులిటెన్ విడుదల చేయని నేపథ్యంలో.. జయలలిత సినీ నటుడు అజిత్‌ను సీఎంగా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. తాను కోలుకున్నాక.. అజిత్‌కు ఎలాగో నచ్చజెప్పి పార్టీ పగ్గాలతో పాటు సీఎం బాధ్యతలను అతనికే అప్పజెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో అజిత్, జయలలిత కలుసుకున్నారని.. పార్టీ భవిష్యత్తు పైన చర్చించారని కూడా సమాచారం. తాజాగా తమిళనాట అజిత్, జయ పట్ల ...

Read More »

పెట్రోల్ బంకులు ఆరు రోజులు బంద్

న్యూఢిల్లీ: పెట్రోల్ బంకులు వినియోగదారులకు షాకిచ్చాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగేందుకు సిద్ధమయ్యాయి. 2012లో కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగనున్నాయి. ఈ కారణంగా నవంబర్‌లో బంకులకు యాజమాన్యాలు 5రోజుల సెలవు ప్రకటించాయి. నవంబర్ 3, 15న బంకులు పూర్తిగా మూతపడే అవకాశమున్నట్లు సమాచారం. పబ్లిక్ హాలిడేలు, సెలవు దినాల్లో బంకులు తెరవకూడదనే నిర్ణయానికొచ్చాయి. నవంబర్ 5 నుంచి బ్యాంకు సెలవులు, పండుగ రోజుల్లో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడే ...

Read More »