Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

 

కామారెడ్డి, అక్టోబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తెలంగాణా రాష్ట్ర పోలీసు అభిమాన సంఘం ఆద్వర్యంలో కామారెడ్డి ప్రబుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరై రోగులకు అరటి, సేపు పండ్లను అందజేశారు. పోలీసు అమరవీరులను స్మరిస్తూ వారి పేరిట పోలీసు అభిమాన సంఘం ప్రతినిదులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు శోభన్‌, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వినోద్‌, ప్రతినిదులు నవీన్‌రావు, అమర్‌, శ్రీకాంత్‌, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article