Breaking News

మహ్మద్‌నగర్‌ను మండలం చేయాలి

 

నిజాంసాగర్‌, అక్టోబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిన్నటివరకు దశాబ్దాలుగా ఉన్న జుక్కల్‌ నియోజకవర్గంలో మహ్మద్‌నగర్‌ను మండలం చేయాలనే డిమాండ్‌ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. మహ్మద్‌నగర్‌ను మండలం చేయాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. పాలనా సౌకర్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాలు చేయడం జరిగిందన్నారు. సింగీతం, గాలిపూర్‌, బూర్గుల్‌, గున్కుల్‌, నర్వా, హసన్‌పల్లి గ్రామాలకు అనుగుణంగా ఉన్న మహ్మద్‌నగర్‌ను మండలం చేయాలన్నారు. ఈ విషయమై సిఎంకు, మంత్రికి విన్నవించినట్టు తెలిపారు. సింగీతం ఎంపిటిసి సభ్యురాలు పాలకొండ శైలజ, తెరాస గ్రామ అధ్యక్షుడు విఠల్‌ కోరారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article