Breaking News

ప్రజావాణికి అధికారులు హాజరుకావాలి

 

నందిపేట, అక్టోబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట తహసీల్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో మండల స్థాయి అధికారులందరు తప్పక హాజరుకావాలని తహసీల్దార్‌ ఉమాకాంత్‌ సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు ప్రజావాణికి వచ్చినపుడు సంబంధిత శాఖల మండల అధికారులు అందుబాటులో లేనపుడు ప్రజల సమస్యలు కావన్నారు. కావున అధికారులందరు హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రజావాణి సమస్యల నమోదు కోసం రిజిష్టర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తద్వారా వచ్చిన వినతులు, సమస్యలు పరిష్కారం అయిన వివరాలు అందులో పొందుపరుస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా ప్రజావాణిలో స్వీకరించిన వినతులకు ప్రత్యేకంగా స్టాంప్‌ వేసి రిసీవ్‌ కాపీ ఫిర్యాదుదారునికి ఇవ్వనున్నట్టు చెప్పారు. కావున ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ అన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article