Breaking News

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

 

బీర్కూర్‌, అక్టోబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో ఎస్‌ఐ రాజ్‌భరత్‌ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గ్రామ ప్రధాన వీధుల గుండా పోలీసు అమరవీరులకు జోహార్లు అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక జడ్పిహెచ్‌ఎస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌ఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో అవిచ్చిన్నకర శక్తులతో పోరాటాల్లో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు కొనియాడారు. చట్టం దృష్టిలో అందరు సమానులేనని, చట్టాన్ని అతిక్రమించిన వారు ఎంతటి వారైనా శిక్షించే అధికారం రాజ్యాంగం పోలీసులకు, న్యాయస్థానాలకు అప్పగించిందని ఆయన అన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విదులకు విధేయులై ఉన్ననాడే సమాజం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ మజీద్‌ఖాన్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజ్‌, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article