Breaking News

మొట్టమొదటి విద్యుదుత్పాదన కేంద్రం కామారెడ్డి జిల్లాలోనే

 

నిజాంసాగర్‌, అక్టోబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొట్టమొదటి జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోనే ఉంది. నిజాంసాగర్‌ మండలం హసన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హెడ్స్‌లూస్‌ గ్రామంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు అనుసంధానంగా 1954లో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. మూడు టర్బయిన్‌ల ద్వారా 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగేలా దీన్ని నిర్మించారు. నిజాంసాగర్‌ నీటిని ఆయకట్టుకు, ప్రధానకాలువ ద్వారా విడుదల చేసే నీటితో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంటారు. ఒక్కో టర్బయిన్‌ ద్వారా 5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం రెండు టర్బయిన్‌లు పనిచేస్తున్నాయి. 1954లో ఈ టర్బయిన్‌ను ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించడం జరిగింది. మూడో టర్బయిన్‌కు మరమ్మతులు చేయించాలని, తద్వారా మూడు పనిచేయడం వల్ల 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన జరుగుతుంది.

Check Also

పరీక్ష కేంద్రం తనిఖీ

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో ...

Comment on the article