Breaking News

Daily Archives: October 22, 2016

ఛలో హైదరాబాద్‌ గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రైతాంగ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 25న నిర్వహించనున్న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను కామారెడ్డిలో శనివారం ఆవిష్కరించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతుధర కల్పించాలని, అన్ని వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, స్వామినాథన్‌ కమీషన్‌ సిఫారసుల ఆధారంగా మద్దతుధర కల్పించాలని అన్నారు. దళారీల దోపిడిని అరికట్టాలని, వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. ...

Read More »

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలి

  – అదికారులతో కలెక్టర్‌ కామారెడ్డి, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజలకు చేరువయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పన్నుల వసూలుపై దృష్టి సారించి వసూళ్లను వేగవంతం చేయాలని, డిసెంబరు చివరినాటికి 80 శాతం వసూళ్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ...

Read More »

హామీలను విస్మరిస్తే పాలకులకు ఘోరీ కడతారు

  – సిపిఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేశ్‌ కామారెడ్డి, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి, తెరాస ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని, వారికి ప్రజలే ఘోరీ కడతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో శనివారం నిర్వహించిన కామారెడ్డి ఏరియా సిపిఐ నిర్మాణ మహాసభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి దేశ, విదేశాలు తిరుగుతూ మా ...

Read More »

విద్యార్థులను చితకబాదిన టీచర్‌

  – గ్రామస్తుల ఆందోళన కామారెడ్డి, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ డివిజన్‌లోని పెద్దకోడప్‌గల్‌ ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్‌ టీచర్‌ అపర్ణ విద్యార్థులను చితకబాదిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం… ఇంగ్లీష్‌ ఉపాధ్యాయురాలు అపర్ణ పిల్లలు ఇంగ్లీష్‌ సరిగా చదవడంలేదని, అల్లరిచేస్తున్నారనే నెపంతో పదిమంది విద్యార్థినిలను చితకబాదింది. దీంతో విద్యార్థినిలు పాఠశాలలో తీవ్రంగా రోదించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు తరలివచ్చారు. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ...

Read More »

చెరువులో పడి వృద్దురాలి ఆత్మహత్య

  కామారెడ్డి, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట మండలంలోని ఇస్సానగర్‌ గ్రామంలో శనివారం చెరువులో పడి బాలవ్వ (72) ఆత్మహత్యకు పాల్పడినట్టు బీబీపేట పోలీసులు తెలిపారు. బాలవ్వ మోకాళ్ల నొప్పులు, అనారోగ్యంతో బాధపడుతుందని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని మృతురాలి కుమారుడు రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

Read More »

జిల్లా అబివృద్దిలో మహిళలు తమవంతు పాత్ర పోషించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నూతన జిల్లా అభివృద్దిలో మహిళా సంఘాల ప్రతినిదులు తమవంతు పాత్ర వహించాలని, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్దిలోకి రావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కామారెడ్డి జిల్లా సమాఖ్య మొదటి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన డిఆర్‌డిఎ జిల్లా మహిళా సమాఖ్యకు శ్రీలక్ష్మినర్సింహ జిల్లా మహిళా సహకార సమాఖ్యగా నామకరణం చేశారు. ...

Read More »

రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

  మార్కెట్‌ సిబ్బందిపై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం కామారెడ్డి, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. కామారెడ్డి వ్యవసాయమార్కెట్‌ యార్డును శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యార్డులో మూత్రశాలలు సరిగా లేకపోవడాన్ని, నీటి సౌకర్యం లేకపోవడాన్ని గమనించారు. దీంతో అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంరోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ...

Read More »

విజృంభిస్తున్న వ్యభిచారం

  నందిపేట, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో మళ్ళీ వ్యభిచార వృత్తి విజృంభిస్తుంది. 25 సంవత్సరాల క్రితం గ్రామనడిబొడ్డున వ్యభిచార వృత్తిని బాహాటంగా నిర్వహించేవారు. దీంతో గ్రామ పరువుపోతుందని గ్రామంలోని యువకులు కలిసి వ్యభిచారం నిర్వహించేవారిని ఊరినుంచి పంపించేశారు. చిన్నాభిన్నమైన కుటుంబాలు కొందరు ఊరిచివర నివాసాలు ఏర్పాటుచేసుకొని వ్యభిచార వృత్తి మానేసినట్టు నటిస్తు వచ్చారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి చాపకింద నీరులా తిరిగి వ్యభిచార వృత్తిని ప్రారంభించారు. ఆరునెలల క్రితం సిఐ నర్సింహస్వామి ...

Read More »

సాహస క్రీడలు విద్యార్థుల్లో స్పూర్తిని నింపుతాయి

  డిచ్‌పల్లి, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహస క్రీడలు విద్యార్థుల్లో స్పూర్తిని నింపుతాయని, అవి వారిలో ధైర్య సాహసాలను పెంపొందిస్తాయని తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అన్నారు. తెయు నుంచి ఆరుగురు విద్యార్థులు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్యాంగ్‌ డ్యాం వాటర్‌స్పోర్ట్స్‌ శిక్షణ శిబిరంలో పదిరోజుల పాటు వాటర్‌ స్పోర్ట్స్‌లో వివిధ విన్యాసాలు చేసి వచ్చారు. ఈ శిబిరానికిజాతీయ సేవా పథకం విద్యార్థులు హాజరయ్యారు. శనివారం వారు ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్తి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ ప్రవీణాబాయి, ...

Read More »

జాతీయ సమగ్ర క్యాంప్‌లో తెయు విద్యార్థుల ప్రతిభ

  డిచ్‌పల్లి, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ యూనివర్సిటీలో జరిగిన 7 రోజుల జాతీయ సమైక్యత సమగ్రత శిబిరంలో తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు ప్రత్యేక ప్రతిభచూపి ప్రథమ బహుమతి పొందారు. అక్టోబరు 15 నుండి 21 వరకు శిబిరం జరిగింది. కళా, సాంస్కృతిక ప్రదర్శనలో తెయు విద్యార్థులు బతుకమ్మ ఆట, పాటలతో హోరెత్తించారు. వారి కళా ప్రదర్శన జాతీయసమగ్రత క్యాంప్‌లో హైలెట్‌గా నిలిచింది. మొత్తం 10 రాష్ట్రాల నుంచి 187 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్న ...

Read More »

ప్రజావాణి ఫ్లెక్సీ ఏర్పాటు

  నందిపేట, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాసమస్యల పరిస్కారం కొరకు ప్రతిసోమవారం ఏర్పాటు చేసే ప్రజావాణిలో వినతుల సంఖ్య తగ్గడంతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు నందిపేట తహసీల్దార్‌ వినూత్నంగా ఆలోచించారు. తహసీల్‌ కార్యాలయం ముందు ప్రజావాణికి సంబంధించిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అధికారులందరు ప్రజావాణిలో తప్పక హాజరుకావాలని సూచించారు. ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కోరారు.

Read More »

నీటి కట కట

  నందిపేట, అక్టోబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి బాలలే రేపటి పౌరులని, వారి భవిష్యత్తు తీర్చిదిద్దడానికి లక్షలు వెచ్చించి అన్ని వసతులతో విద్యాలయాలు నెలకొల్పుతున్నామని కార్పొరేట్‌ తరహా విద్యనందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికి, క్షేత్ర స్తాయిలో చూస్తే అందుకు భిన్నంగా ఉంటుందనడానికి నందిపేట మండలంలోని కస్తూర్బా పాఠశాల నిదర్శనం. మండల కేంద్రంలోని పలుగుట్ట సమీపంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్తులకు నీటి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రమంతటా పుష్కలంగా వర్షాలు కురిసి ప్రజలు ఆనందపడుతుంటే అందుకు భిన్నంగా కస్తూర్బా విద్యార్థులకు ...

Read More »