Breaking News

Daily Archives: October 24, 2016

26న టిడిపి కామారెడ్డి జిల్లాస్థాయి సమావేశం

  కామారెడ్డి, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఈనెల 26న కామారెడ్డి జిల్లాస్థాయి నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్టు టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.డి.ఉస్మాన్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో ఈనెల 26న పట్టణంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ఉదయం 11 గంటలకు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సమావేశానికి రాష్ట్ర నాయకులు హాజరవుతున్నట్టు చెప్పారు. నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ...

Read More »

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రాంగణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఐసిడిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కజొన్నలకు మద్దతుధర రూ. 1365 కల్పించిందని, రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దని, దళారులకు తమ పంటలను విక్రయించవద్దని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రాజమణి, వైస్‌ఛైర్మన్‌ గౌరీ శంకర్‌, పాలకవర్గ సభ్యులు లక్ష్మినారాయణ, రాజాగౌడ్‌, షేక్‌ అజీజ్‌, రమేశ్‌ ...

Read More »

కాలనీలో మరమ్మతులు చేపట్టాలి

  కామారెడ్డి, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీలు చెడిపోయాయని వాటికి మరమ్మతులు చేయాలని కౌన్సిలర్‌ ఎస్‌.రామ్మోహన్‌ సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా పట్టణంలోని 32వ వార్డులో రోడ్లు, మురికి కాలువలు చెడిపోయాయన్నారు. రోడ్లపై గుంతలు పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు. డ్రైనేజీలు తెగిపోవడంతో రోడ్లపై మురికినీరు ప్రవహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి మరమ్మతుల కోసం ...

Read More »

కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 9వ వార్డు అయ్యప్పనగర్‌ కాలనీలో సోమవారం నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిదులు రెండు లక్షల రూపాయలతో కల్వర్టు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగి మోహన్‌, పిట్ల వేణు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉచిత నేత్రవైద్య శిబిరానికి స్పందన

  కామారెడ్డి, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత నేత్రవైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నేత్ర వైద్యులు చంద్రశేఖర్‌ ఆద్వర్యంలో ఇద్దరు వైద్య నిపుణులు 60 మంది పెన్షనర్లకు నేత్ర పరీక్షలు నిర్వహించారు. పదిమందికి కంటి శస్త్రచికిత్సలు అవసరం కాగా సూచించారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు రాసి ఇచ్చారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం ప్రతినిదులు నిట్టు విఠల్‌రావు, వెంకటి, సాయాగౌడ్‌, యాదగిరి, గంగాగౌడ్‌, మురళి, కుత్బుద్దీన్‌, ...

Read More »

ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు…

  కామారెడ్డి, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలుతప్పవని పట్టణ సిఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ శోభన్‌లు అన్నారు. సోమవారం పట్టణంలో ట్రాఫిక్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. వ్యాపార సముదాయాల ముందు వినియోగదారులు తమ వాహనాలు సక్రమంగా పార్కింగ్‌ చేయకపోవడంవల్ల ట్రాఫిక్‌కు, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని అన్నారు. వాహనాలు సరిగా పార్కు చేసేలా దుకాణాల యజమానులు చూసుకోవాలన్నారు. దుకాణంలోని సామాన్లు, బోర్డులను, రేకుల షెడ్లను రోడ్డును ఆక్రమిస్తూ ...

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

  – కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఇందులో మొత్తం 184 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు వారి వారి కేంద్రాల్లో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. వ్యవసాయంపై సమీక్షిస్తూ పంట బీమాకు ...

Read More »

ధాన్యం దళారుల పాలు…

  బాన్సువాడ, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నమాటలు ఆచరణలో కనిపించడం లేదు. ఖరీఫ్‌ దిగుబడులు చేతికందుతున్న తరుణంలో ధాన్యం కొనుగోలుకు దళారులు గ్రామాల్లో వాలిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో విధిలేని పరిస్థితిలో రైతులు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు. వీరి అవసరాన్ని ఆసరా చేసుకొని దళారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రతియేటా దళారుల మోసాలు వెలుగుచూస్తున్నప్పటికి ప్రభుత్వం రైతులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో వారినే ...

Read More »

ప్రతిఅధికారి వారంలో నాలుగురోజులు ఫీల్డ్‌లోనే…

  నిజామాబాద్‌, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకొరకు చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అందేలా జిల్లా స్థాయి, డివిజనల్‌ స్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రతిశాఖకు చెందిన అధికారి వారంలో సోమవారం, శనివారం విడిచి మిగిలిన రోజుల్లో వారి వారికి సంబందించిన శాఖలలోని పురోగతిని పరిశీలించడానికి ఫిల్డ్‌లకు వెళ్లాలని, ఫీల్డ్‌లో నిర్వహించిన పనుల పరిశీలన తదితర విషయాలకు సంబంధించిన ...

Read More »

పంటలు రోడ్లపైన – ప్రాణాలు గాలిలో…

  నందిపేట, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట నుంచి ఆర్మూర్‌ వెళ్లే ప్రధానరహదారి వెంట ఉన్న గ్రామాల రైతులు విత్తనాలను, కోసిన పంటలను రోడ్లపై ఎండబెడుతున్నారు. ఒకవైపు పంటలు ఆరబోసి, మరోవైపు వాహనాల కోసం దారి వదులుతున్నారు. ప్రభుత్వం కోట్లు వెచ్చించి ప్రమాదాలు జరగకూడదని డబుల్‌ రోడ్లు ఏర్పాటుచేస్తే రైతుల పంటలు ఆరబెట్టడం వల్ల వన్‌వేగా మారుతున్నాయి. డబుల్‌ రోడ్డు అనే నమ్మకంతో వాహనదారులు వేగంగా నడిపేటపుడు ఆకస్మాత్తుగా ఆరబోసిన పంటలు అడ్డం వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా ...

Read More »

ప్రజావాణికి అధికారుల అనూహ్య స్పందన

  నందిపేట, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాసమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండల అధికారుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ తమ సమస్యలను వినతులరూపంలో తీసుకొచ్చినపుడు సంబంధిత శాఖల అధికారులు లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావని కావున సంబంధిత అధికారులందరు హాజరుకావాలని శనివారం తహసీల్దార్‌ఉమాకాంత్‌ అధికారులందరిని ముందస్తుగా ఆదేశించారు. దీంతో సోమవారం అన్ని శాఖల అధికారులు ప్రజావాణికి హాజరయ్యారు. నాలుగు దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు. నడ్కుడ గ్రామానికి చెందిన ఒక ...

Read More »

గల్ఫ్ దేశాల్లో భవిష్యత్ మరింత ఘోరం.. సంస్కరణలు చేయాల్సిందే..

గల్ఫ్‌లో ముందుంది ముసళ్ళ పండుగ చమురు వదులుకోవాలి ఆదాయం పెంచుకోవాలి, ఐ.యం.ఫ్ సూచన చమురు ధరలు కొంతమేర మెరుగుపడినా గల్ఫ్ దేశాల ఆర్ధికాభివృద్ధి మాత్రం రానున్న కాలంలో నిరాశజనకంగా ఉంటుందని, గల్ఫ్ దేశాలన్నీ చమురేతర ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని ప్రపంచ ఆర్ధిక సంస్ధ హెచ్చరించింది. సంప్రదాయ ఆదాయ వనరు చమురు రంగం నుంచి ఇతర రంగాల్లో ఆదాయాన్ని అన్వేషించడం, వ్యయాన్ని తగ్గించడం, పన్నులు ప్రవేశపెట్టడం మొదలగు ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం పట్ల గల్ఫ్ దేశాల ప్రభుత్వాలను ఐ.యం.యఫ్ ప్రశంసించింది. వచ్చే ...

Read More »

బ్రిక్స్‌వేదికగా వ్యూహాత్మక అడుగులు!

భూభారత్‌కు చిరకాల మిత్రునిగా ఉన్న సోవియట్‌ రష్యావైఖరిపై భారత్‌ అప్రమత్తంగా వ్యవహరి స్తోంది. గోవావేదికగా జరుగుతున్న ఎనిమిదవ బ్రిక్స్‌దేశాల సదస్సులో పాక్‌ భారత్‌ సరిహద్దుల్లోని ఉద్రి క్తతల నేపథ్యంలో ఆదేశంతో కలిసి రష్యా సైనిక కవాతు లు నిర్వహించడం, పైగా ఎన్‌ఎస్‌జికూటమి, మసూద్‌ అజహర్‌ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ డిమాండ్‌ ను వ్యతిరేకిస్తున్న చైనాతో రష్యా చెలిమి వంటి వాటిపై తన వైఖరిని భారత్‌ రష్యాకు స్పష్టంచేయనున్నది. ఐదు దేశాల మధ్య ఇన్‌ఫ్రారంగంలో భారీ ప్రాజెక్టులకు నాంది పలకడం, వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాల సమీక్ష, ...

Read More »

కోహ్లీ @ 150

మొహాలి: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 134 బంతుల్లో 154 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 286 పరుగుల విజలక్ష్యాన్ని సాధించే క్రమంలో కెప్టెన్ ధోనీ(80)తో కలిసి 151 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెమోదు చేశాడు. 16 ఫోర్లు, 1 సిక్స్‌, 114 స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందంది. స్కోర్ వివరాలు.. న్యూజిలాండ్ : 285/10(49.4 ఓవర్లలో) భారత్ : 289/3(48.2 ఓవర్లో)

Read More »

సాయిబాబాను భూతంగా అభివర్ణించిన స్వరూపానంద సరస్వతి

హైదరాబాద్‌: ద్వారక పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి షిిరిడి సాయిబాబాపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఓ భూతాన్ని పూజిస్తున్నారని, సాయిపూజ పేరుతో ఓ భూతాన్ని కొలుస్తున్నారని అన్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లో ‘గురు వందనం’ కార్యక్రమానికి ఆయన హజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ చూసినా సాయి విగ్రహాలు, ఫొటోలే కనిపిస్తున్నాయన్నారు. స్వరూపానంద ఇటీవల అనంతపురం, కడపలో సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే షిిరిడి సాయిబాబాపై  స్వరూపానంద సరస్వతి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై సాయి భక్తులు ఆగ్రహం ...

Read More »

డ్రాగన్ కనిపించిందట!

చైనా బోర్డర్ లో నిజంగా డ్రాగన్ కనిపించిందంటా.  చైనీయుల పురాణాల్లో డ్రాగన్లను గురించిన ప్రస్తావన ఉంది. అయితే డ్రాగన్లను ఎవరైనా చూశారా? అంటే లేదు. కేవలం చైనా పురాణ గాథలు, ఇతిహాసాల్లో మాత్రమే అవి ఉన్నాయి. కానీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలో ఓ డ్రాగన్ ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. ఇవి అత్యంత శక్తిమంతమైన జీవులని చైనా పురాణాల్లో పేర్కొన్నారు. పవిత్ర శక్తులు కలిగివుండే డ్రాగన్లు నీరు, వర్షపాతం, ప్రకృతి విపత్తులు(వరదలు, తుపానులు)పై అధికారం కలిగివుంటాయని చైనీయుల నమ్మకం. దీంతో చైనాను పాలించిన ...

Read More »

మా జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు.. పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్

మా జోలికి వస్తే తగిన శాస్తి తప్పదని పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ యధేచ్చగా ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీనిపై భారత్ సైన్యం ఆదివారం తీవ్రంగా హెచ్చరించింది. తమ సైనికులను కనీసం తాకాలని ప్రయత్నించినా పాక్‌ తీవ్ర మూల్యం చెల్లించుకోకతప్పదని తేల్చిచెప్పింది. గత శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లోని హీరానగర్‌ సెక్టర్‌లో బీఎస్‌ఎఫ్‌ జవాను గుర్నామ్‌ సింగ్‌ను పాక్‌ సైన్యం కవ్వింపు కాల్పుల్లో గాయపడి మృతి ...

Read More »

పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వాషింగ్టన్‌: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌ను అమెరికా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. ఆ దేశంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నేలమట్టం చేసేందుకు తానే స్వయంగా చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోననని తేల్చిచెప్పింది. పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్) తమ దేశంలో ఉన్న ఉగ్రవాద గ్రూపులన్నింటిపై చర్యలు తీసుకోవడం లేదని, ఈ నేపథ్యంలో తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి రావొచ్చునని తేల్చిచెప్పింది. ‘సమస్య ఏమిటంటే పాకిస్థాన్‌ ప్రభుత్వంలో మూడు బలమైన వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఐఎస్ఐ.. పాకిస్థాన్‌లో క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు ...

Read More »

బాల్‌ను ధోనీవైపు విసిరిన కివీస్ కీపర్ రోంచి..

మొహాలి: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీకి అనుకోని సంఘటన ఎదురైంది. కోహ్లీ షాట్ కొట్టి సింగిల్ రన్ తీశాడు. అయితే వెంటనే సెకండ్ రన్‌కోసం కూడా ప్రయత్నించడంతో ధోనీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. కానీ అదే సమయానికి బంతి కివీస్ కీపర్ రోంచి చేతికి చేరింది. దీంతో కీపర్ వైపుగా వెళుతున్న కోహ్లీని చూస్తూ ధోనీ రన్ చేస్తున్నాడు. కీపర్ రోంచి కోహ్లీని ఔట్ చేయడానికి ప్రయత్నించకుండా ధోనీ వైపు ఉన్న వికెట్ల కేసి ...

Read More »

వైద్యులు షాక్.. తెలియకుండానే తొమ్మిది నెలల గర్భాన్ని మోసింది !

ఏమాత్రం నమ్మశక్యం కానీ విధంగా ఓ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన వైద్యులతోపాటు, ప్రతీఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉన్నట్టుండి కడుపులో నొప్పి రావడంతో కిడ్నీలో రాళ్లున్నాయేమో అనుకుని ఓ మహిళ హాస్పిటల్‌కు వెళ్లింది. కానీ వైద్యులు కాసేపట్లో నీకు కాన్పు రాబోతుందని, ఇవి పురిటి నొప్పులని తెలిపారు. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అంతేకాదు అరగంటలోనే పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చిందట. మహిళ పేరు ‘స్టేఫానీ జాగర్స్’ అనే మహిళ తొమ్మిది నెలలుగా ఏమాత్రం బరువు పెరగలేదు. కనీసం ఆమెకు ...

Read More »