Breaking News

Daily Archives: October 25, 2016

మతిస్థిమితంలేని వ్యక్తిని కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు

  నందిపేట, అక్టోబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించారు. ఈవిషయమై నందిపేట ఎస్‌ఐ జాన్‌రెడ్డి కథనం ప్రకారం… మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలం వడ్డి గ్రామానికి చెందిన కొప్పరి వినోద్‌ అనే మతిస్థిమితం లేని వ్యక్తి నందిపేటలో తిరుగుతూ పోలీసులకు కనిపించాడు. అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చి వారిని నందిపేటకు పిలిపించారు. మంగళవారం వినోద్‌ను వారి తల్లి, ...

Read More »

నిజాంసాగర్‌ నీటి లికేజీలను అరికట్టేదెప్పుడు…

  నిజాంసాగర్‌, అక్టోబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్షలాది ఎకరాలకు సాగునీరుఅందించే నిజాంసాగర్‌ వరద గేట్ల నుంచి నీరు వందలాదిక్యూసెక్కులు మంజీరలోకి వృధాగా వెళ్లిపోతుంది. ఇటీవల నాలుగైదు గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతూ మంజీరలోకి కలిసిపోతుంది. ప్రతిరోజు వందలాది క్యూసెక్కుల నీరు మంజీరనదిలోకి వెళుతుంది. ప్రాజెక్టుపై 28 వరదగేట్లకు ఏళ్లకాలం నుంచి మరమ్మతులతోపాటు, గ్రిసిన్‌ ఆయిల్‌తో మరమ్మతులుచేయకపోవడంతో గేట్లు సక్రమంగా బిగియకపోవడంతో కింది భాగం నుంచి నీరు వృధాగా వెళుతుంది. నిజామాబాద్‌ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి నిజాంప్రభువు 1921 ...

Read More »

నిలకడగా నిజాంసాగర్‌ నీరు..

  నిజాంసాగర్‌, అక్టోబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టునీటి మట్టం నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఘన్‌పూర్‌ నుంచి 563 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. నిజాంసాగర్‌ పూర్తిస్తాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం అదేస్థాయిలో నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 17.803 టిఎంసిలు కాగా ప్రస్తుతం 17.802 టిఎంసిల నీరు నిలువఉందని ప్రాజెక్టు డిప్యూటి ఇఇ సురేశ్‌బాబు తెలిపారు. ఎగువ ప్రాంతంలోగల సింగూరు ప్రాజెక్టు నుంచి వర్షపు నీరు తగ్గుముఖం ...

Read More »

ధాన్యం కోతలు షురూ…

  నందిపేట, అక్టోబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో ఖరీఫ్‌ వరికోతలు ఊపందుకున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు వరికోతలు ప్రారంభించారు. పంటలను విక్రయం కొరకు ఎండబెడుతున్నారు. వరి పంటలకు ప్రభుత్వం 1510 మద్దతు ధర ప్రకటించి మండలంలో ఇప్పటివరకు సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అయితే సొసైటీవారు ఎండిన వరినే కొనుగోలు చేస్తారుకాబట్టి రైతులు పంటలను ఎండబెడుతున్నారు. రెండు, మూడేళ్లుగా వాతావరణం అనుకూలించక పంటల సాగుపై ఆసక్తి చూపని రైతులు ఈయేడు వర్షాలు బాగా కురియడంతో ఉత్సాహంగా ...

Read More »

26న ఛలో కలెక్టరేట్‌

  కామారెడ్డి, అక్టోబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26న ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో నిర్వహించనున్న ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఇసి మెంబరు చెలిమెల భానుప్రసాద్‌ పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల పరిష్కారం కొరకు ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై ...

Read More »

విద్యార్థి సమస్యలపై టిజివిపి ఆద్వర్యంలో ఆందోళన

  – విద్యార్థి నాయకుల అరెస్టు కామారెడ్డి, అక్టోబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదలచేయాలని టిజివిపి ఆద్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళుతుండగా పోలీసులు విద్యార్తి నాయకులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదుచేసినట్టు సమాచారం. ఈ సందర్బంగా టిజివిపి కామారెడ్డి జిల్లా అద్యక్షుడు ఎనుగందుల నవీన్‌ మాట్లాడుతూ రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, శాంతియుతంగా కలెక్టరేట్‌కు ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు తమను అరెస్టుచేసి కేసులు నమోదుచేయడం తగదన్నారు. ...

Read More »

శాసనసభాపతికి ఘనస్వాగతం

  కామారెడ్డి, అక్టోబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి మధుసూదనాచారికి మంగళవారం కామారెడ్డిలో ఘన స్వాగతం పలికారు. ఓ కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో కామారెడ్డిలో ఆగిన శాసనసభాపతికి ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌తో పాటు ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, స్వర్ణకార సంఘం నాయకులు స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత కామారెడ్డికి తొలిసారిగా వచ్చిన నేపథ్యంలో పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుస్మ, వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, తెరాస పట్టణ అద్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ...

Read More »

కొనసాగుతున్న అయ్యప్పల పాదయాత్ర

  కామారెడ్డి, అక్టోబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అయ్యప్ప దేవాలయం నుంచి శబరిమలకు 119 మంది అయ్యప్పదీక్షా స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. మంగళవారం పాదయాత్ర కొత్తకోట, పెబ్బర వరకు సాగింది. పెబ్బరలో స్వాములు పూజలు నిర్వహించి దీక్ష చేశారు. అక్కడి ప్రతినిదులు స్వాములకు భిక్ష, ఇతర సదుపాయాలు కల్పించినట్టు స్వాములు తెలిపారు.

Read More »

రైతులు మోసపోవద్దు

  నందిపేట తహసీల్దార్‌ ఉమాకాంత్‌ నందిపేట, అక్టోబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నందిపేట తహసీల్దార్‌ ఉమాకాంత్‌ రైతులకు సూచించారు. ఐలాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని నందిపేట మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఏ-గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు రూ. 1510 మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు లక్ష్మినారాయణ, సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌, ...

Read More »

తెరాసలో చేరిన గౌడసంఘం సభ్యులు

  నందిపేట, అక్టోబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం డొంకేశ్వర్‌ గ్రామ గౌడ సంఘం నాయకులు మంగళవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వగృహంలో తెరాస పార్టీలో చేరారు. డొంకేశ్వర్‌ గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు భూమాగౌడ్‌, రాముగౌడ్‌, అశోక్‌గౌడ్‌, గంగాగౌడ్‌, కిష్టాగౌడ్‌ తదితరులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. కార్యక్రమంలో తెరాస మండల నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు. 1982లో టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న భూమాగౌడ్‌ డొంకేశ్వర్‌ గ్రామ అద్యక్షునిగా, ...

Read More »