Breaking News

Daily Archives: October 27, 2016

బోరుమోటారు, కల్వర్టు పనులు ప్రారంభం

  కామారెడ్డి, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గురువారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. పట్టణంలోని 4వ వార్డులో నిర్మిస్తున్న కల్వర్టు పనులు ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు లక్ష రూపాయలతో కల్వర్టు నిర్మిస్తున్నట్టు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి లక్ష రూపాయలతో ఏర్పాటు చేసిన బోరు మోటారును ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపి, ప్రభాకర్‌ యాదవ్‌, భూంరెడ్డి, నాయకులు పిప్పిరి వెంకటి, సంపత్‌, భాస్కర్‌, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మధ్యవర్తులవల్లే రెవెన్యూ అధికారులపై అవినీతి ముద్ర

  కామారెడ్డి, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మధ్యవర్తులు, దళారుల వల్లే రెవెన్యూ శాఖాధికారులపై అవినీతి ముద్రపడుతుందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్‌ అన్నారు. అసోసియేషన్‌ మొదటి కార్యవర్గ సమావేశం గురువారం కామారెడ్డలో నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్‌ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జవాబుదారీగా పనిచేస్తున్న తమను అవినీతి ఉద్యోగులుగా గుర్తించడం సమంజసం కాదన్నారు. చిన్న చిన్న పొరపాట్లకు రెవెన్యూ ఉద్యోగులను బలిచేయొద్దని కోరారు. రెవెన్యూ ఉద్యోగులందరు ఏకతాటిపైకి రావాలని కోరారు. అనంతరం ...

Read More »

భిక్కనూరు వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరి మృతి

  కామారెడ్డి, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలం బిటిఎస్‌ వద్ద 44వ నెంబరు జాతీయరహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు సంఘటన స్తలంలోనే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బులెరో వాహనం స్కూటీని ఢీకొనగా స్కూటీపై ఉన్న కామారెడ్డిపట్టణం ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన రాజారెడ్డి (65) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా సాయన్నను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బులెరోను తప్పించే ప్రయత్నం చేయగా టోల్‌గేటు వద్ద పట్టుకున్నట్టు భిక్కనూరు పోలీసులు తెలిపారు. కేసు ...

Read More »

గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

  కామారెడ్డి, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి చౌరస్తాలోని ఓ కిరాణ దుకాణంలో అక్రమంగా నిలువ ఉంచిన గుట్కా ప్యాకెట్లను గురువారం ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు కిరాణ దుకాణంపై దాడిచేయగా అక్రమంగా నిలువ ఉంచిన రూ. 50 వేల విలువగల గుట్కా ప్యాకెట్లు లభించాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసినట్టు అధికారులు వివరించారు.

Read More »

కామారెడ్డి పట్టణ ప్రగతికి కృషి

  – ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ కామారెడ్డి, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌ అన్నారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌ నుంచి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్‌ నిర్మాణానికి సంబంధించిన పనులను గురువారం ఆయన ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 10 లక్షలతో పనులు చేపట్టినట్టు తెలిపారు. పట్టణంలోని 33 వార్డుల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి పట్టణాన్ని ఆదర్శ ...

Read More »

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు

  కామారెడ్డి, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని షేర్‌గల్లికి చెందిన గంజి రమేశ్‌ (45) అనే వ్యక్తి అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందిందని పట్టణ పోలీసులు తెలిపారు. పట్టణంలోని షేర్‌గల్లిలో నివాసముంటున్న రమేశ్‌ పచ్చకామెర్లతో బాధపడుతుండగా ఈనెల 25న కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడం జరిగిందన్నారు. చికిత్స జరుగుతుండగా మూత్రశాలకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రమేశ్‌ ఎర్రరంగు చొక్క, నలుపురంగు ప్యాంటు దరించిఉన్నాడని, చామనచాయ, 5.5 అడుగుల ఎత్తు ఉంటాడని, రమేశ్‌ ...

Read More »

గ్రూప్‌-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

  – కామారెడ్డి జిల్లాలో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 11,13 తేదీల్లో జరగబోయే టిఎస్‌పిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్లను ఆదేశించారు. గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భవనంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి పోలీసు, ఆర్టీసి, విద్యుత్తు, మునిసిపల్‌ అధికారులతోపాటు చీఫ్‌ సూపరింటెండెంట్లతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రూప్‌-2 పరీక్షలను ...

Read More »

లీకేజీ నీటితో అవస్థలు

  నిజాంసాగర్‌, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా 18 రోజులుగా కొనసాగుతున్న లీకేజీ నీటివల్ల ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజాంసాగర్‌ 16,12 గేట్ల వద్దలీకేజీలు కావడంతోనాగమడుగు వద్ద రహదారి గుండా లీకేజీ నీరు ప్రవహిస్తుంది. దీంతో అచ్చంపేట్‌, ఆరేపల్లి, చిన్న ఆరేపల్లి, లింగంపల్లి, నిజాంపేట్‌, నారాయణఖేడ్‌ గ్రామాల ప్రజలతో పాటు ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. 16 గేట్ల ద్వారా లీకేజీ అరికట్టేందుకు పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని, ప్రయాణం ...

Read More »

లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు…

  నిజాంసాగర్‌, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్షరాల లక్షలు వెచ్చించి లక్షణంగా భవనాలు వదిలేశారు. లక్షల వ్యయంతో మండల కేంద్రంలోని హౌజింగ్‌శాఖ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. అన్ని హంగులతో కార్యాలయం నిర్మించినా హౌజింగ్‌ శాఖాధికారులు ఖాళీ కావడంతో భవనాలు వృధాగా మారాయి. కొన్ని నెలల క్రితం నుంచి హౌజింగ్‌ కార్యాలయ తలుపులు తెరుచుకోలేకపోయాయి. మండల కేంద్రంలోని హౌజింగ్‌ భవనాల చుట్టు ముళ్ల పొదలతో పాటు పాముల పుట్టలు తయారయ్యాయి. హౌజింగ్‌పథకాల అమలుతోపాటు లబ్దిదారులకు బిల్లుల చెల్లింపునకు కార్యాలయాలను అందుబాటులోకి ...

Read More »

తెయు చీఫ్‌ వార్డెన్‌గా డాక్టర్‌ బి.సాయిలు నియామకం

  డిచ్‌పల్లి, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వసతి గృహాల చీఫ్‌ వార్డెన్‌గా డాక్టర్‌ బి.సాయిలు గురువారం నియమితులయ్యారు. వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య, రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్‌ సాయిలు గతంలో సౌత్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌గా, వార్డెన్‌గా పనిచేశారు. అదేవిధంగా మెయిన్‌ క్యాంపస్‌కు ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. తనపై నమ్మకంతో చీఫ్‌ వార్డెన్‌ బాధ్యతలు అప్పగించినందుకు విసి, రిజిస్ట్రార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు..

  నిజామాబాద్‌, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు లక్ష్యసాధనలో చదవడం ఎంత ముఖ్యమో గ్రహించిన ప్రభుత్వం ప్రతి పాఠశాలలో, వసతి గృహాల్లో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. గురువారం ప్రగతిభవన్‌లో విద్యాసంస్థల శాఖాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగా జిల్లాలోని పాఠశాలల్లో పూర్తిస్తాయిలో డిజిటల్‌ తరగతులకు అవసరమయ్యే సామగ్రి అందుబాటులో ఉన్న పాఠశాలల ...

Read More »

వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం

  నందిపేట, అక్టోబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల సర్వసభ్య సమావేశం గురువారం ఎంపిపి యమున ఉపన్యాసంతో ప్రారంభమైంది. అనంతరం మండల అధికారులు తమ తమ శాఖల త్రైమాసిక నివేదికలు సమర్పించారు. ముందుగా వ్యవసాయ శాఖాధికారి గంగమల్లు తదనంతరం పశువైద్యాధికారి ప్రభాకర్‌ నివేదిక సమర్పిస్తూ జిల్లాలో మొదటిసారి మండలంలోని మూడురకాల మేలైన గడ్డి విత్తనాలు సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తున్నామని దాంతో పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. వైద్యాదికారి రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడునెలల్లో 60 కాన్పులు చేసినట్లు ...

Read More »