Breaking News

Daily Archives: October 28, 2016

ప్రభుత్వం పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలి

  కామారెడ్డి, అక్టోబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా పంటలు నీటమునిగి నష్టంవాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని బిఎస్‌పి ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు తలారి బాల్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో బిఎస్‌పి సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై బాల్‌రాజు మాట్లాడారు. రైతులకు సంబంధించిన రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి వారిని ఆదుకోవాలని కోరారు. తెరాస అధికారంలోకి వచ్చిన నాటినుంచి బడుగు, బలహీన వర్గాల ...

Read More »

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు

  కామారెడ్డి, అక్టోబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం భగవాన్‌ ధన్వంతరి జయంతి వేడుకలను పిఎంపిటి అసోసియేషన్‌ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టనంలోని మెహెరబాబా కళ్యాణ మండపంలో ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలువేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచానికి వైద్యాన్ని పరిచయంచేసిన మహనీయుడు ధన్వంతరి అనిఅన్నారు. ఆయుర్వేదానికి మూలపురుషుడు ధన్వంతరి అని, ఆయుర్వేద వైద్య ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి పరిచయంచేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పిఎంపిటి ప్రతినిధులు బాల్‌కిసన్‌గౌడ్‌, విఠల్‌, శ్రీనివాస్‌, చారి, భూషణ్‌, చంద్రకాంత్‌రావు, రాజమౌళి, ఓంప్రకాశ్‌, రాజారెడ్డి, ...

Read More »

సొగత్తూరు చేరిన అయ్యప్పల పాదయాత్ర

  కామారెడ్డి, అక్టోబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అయ్యప్పస్వాములు కామారెడ్డి నుంచి శబరిమలకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నాటికి సొగత్తూరు పల్కోజికి చేరుకుంది. స్వాములు అక్కడ భిక్ష నిర్వహించి స్వామివారికి పూజలు నిర్వహించి, అక్కడే బస చేయనున్నారు. శనివారం జోడాకుల ఆలయానికి చేరుకోనున్నట్టు స్వాములు తెలిపారు. 1260 కి.మీ.లు మొత్తం పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో స్వాములు పాల్గొన్నారు.

Read More »

మాదిగ వృత్తిపనికి పెన్షన్‌ ఇచ్చేవరకు ఉద్యమం

  – ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ కామారెడ్డి, అక్టోబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాదిగ వృత్తి పనివారికి పెన్షన్‌ ఇచ్చే వరకు ఉద్యమం చేస్తామని ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మాదిగ చైతన్య పాదయాత్రలో భాగంగా శుక్రవారం కామారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు బోనాలతో, డప్పు చప్పుల్లతో పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈ యాత్రను ఉద్దేశించి వంగపల్లి మాట్లాడుతూ 40 రోజులుగా సాగుతున్న యాత్ర మాదిగల అభివృద్ది, మాదిగ వృత్తివారికిపెన్షన్‌, ...

Read More »

అత్యవసర కేసులు గాందీఆసుపత్రికి రిఫర్‌ చేయాలి

  నిజామాబాద్‌, అక్టోబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్లిష్టమైన, అత్యవసరమైన కేసులున్నచో హైదరాబాద్‌ గాంధి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌ చేయాలని, ప్రైవేటు ఆసుపత్రులకు కాదని జిల్లా వైద్యాధికారికి, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకునికి జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబరులో ఏర్పాటు చేసిన ఎంఎంఆర్‌ ఆడిట్‌లో పాల్గొన్న జిల్లా వైద్యశాఖాధికారితో, డాక్టర్లతో, ఐసిడిఎస్‌ సిడిపిఓలతో సూపర్‌వైజర్లతో ఏఎన్‌ఎంలతో నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు. గర్భిణీ స్త్రీలపై వారు నిర్వహిస్తున్న విదులపై సమగ్రంగా సమీక్షించారు. క్లస్టర్‌ ...

Read More »

జిల్లా కోసం కొనసాగుతున్న ఆందోళన

  బాన్సువాడ, అక్టోబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ జిల్లా సాధన కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో పక్షం రోజులుగా ఆందోళన కొనసాగుతోంది. బాన్సువాడ అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రతిరోజు వివిధ పార్టీల నాయకులు, కులసంఘాలు రోజువారి వంతుల వారిగా దీక్ష చేస్తున్నారు. బాన్సువాడ జిల్లా ఏర్పాటు చేస్తే జుక్కల్‌, బాన్సువాడతో పాటు సంగారెడ్డి జిల్లాలోని కంగిటి, కల్లేరు మండలాలకు అనుకూలంగా ఉంటుందని దీక్ష చేపడుతున్న నాయకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు రోజుకో రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ...

Read More »

రతన్ టాటాకు అదంటే పిచ్చి… చెప్పినా వినిపించుకోలేదు… మిస్త్రీ ‘దీపావళి’ బాంబు

మరొక్క రోజులో భారతదేశం దీపావళి జరుపుకోనుంది. ఈ దీపావళి పండుగలో మనం పేల్చే బాంబులు పేలుతాయో లేదో కానీ టాటా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన మిస్త్రీ మాత్రం తన లేఖాస్త్రం ద్వారా టాటా గ్రూపులో ఉన్న లుకలుకలు, సెంటిమెంట్లు, గుదిబండలా మారిన ఉత్పత్తులు, నష్టాలు, యాజమాన్యం వైఖరి… ఇలా అనేక విషయాలపై తన లేఖలో తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా తనకు చైర్మన్ పదవి అప్పగిస్తూనే కోరలు పీకేసిన కుర్చీపై కూర్చోబెట్టారంటూ విమర్శించారు. ఇక అలాంటప్పుడు తనకు స్వేచ్చగా తీసుకునే నిర్ణయాలు తీసుకునే ...

Read More »

భారత్‌కు చైనా వార్నింగ్ : మా వస్తువులను బాయ్‌కాట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ఈమధ్య కాలంలో చైనా దేశం భారతదేశానికి వరుసబెట్టి హెచ్చరికలు చేస్తూనే ఉంది. విదేశీయులు(ముఖ్యంగా అమెరికా దేశస్తులు) భారతేదంలోకి వచ్చి, ఏమాత్రం చైనా-భారత్ సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తే చాలు జడుసుకుంటోంది. వార్నింగులు ఇస్తోంది. తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది చైనా. అదేంటయా అంటే… చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయాలంటూ భారతదేశంలో పనిగట్టుకుని కొందరు కాంపెయిన్ చేయడంపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వరుసబెట్టి దీనిపై రాతలు రాయడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందనీ, పెట్టుబడులు పెట్టే ...

Read More »

ఇండియాలో పిచ్చపిచ్చగా పాకిస్తాన్ ‘స్పై’లు…?

భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన కీలక పత్రాలను పాకిస్తాన్ స్పైలు చౌర్యం చేసి వాటిని పాక్ ఉగ్రవాదులకు చేరవేస్తున్న వైనం బయటపడింది. ముఖ్యంగా ఆర్మీ స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని వారు కాజేస్తూ ఆ వివరాలను చక్కగా పాకిస్తాన్ దేశానికి చేరవేస్తున్నట్లు తేలింది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దేశంలో మరికొందరు ఇలాగే చొరబడి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లో పని చేస్తున్న పాకిస్థాన్ అధికారులు కూడా తమ వక్రబుద్ధిని బయటపెడుతున్నారు. గూఢచర్యం కేసులో పాకిస్థాన్ హైకమిషన్ ఆఫీసర్‌ను ఢిల్లీ పోలీసులు ...

Read More »

కేరళలో రబ్బర్ కోడిగుడ్లు.. చైనా చేతివాటం.. ఉడకబెట్టామో.. బాల్‌ అయిపోద్ది..

కోడిగుడ్డు రబ్బర్ బాల్ ఎలా అయ్యింది. చైనా వాణిజ్య పటిమకు కేరళ కొమ్ము కాస్తోంది. చైనా కృత్రిమ కోడిగుడ్లను తయారు చేస్తూ మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. అయితే కేరళలోని వామపక్ష సర్కారు ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా కేరళ మార్కెట్‌లో కనిపించిన చైనా గుడ్లు కలకలం రేపుతున్నాయి. చైనా గుడ్లను కోళ్లు పెట్టవు. వాటిని కెమికల్స్ వాడి తయారు చేస్తుంటారు. గోధుమ రంగులో ఈ కోడిగుడ్లపై ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ గుడ్లను సూపర్ మార్కెట్‌లోకూడా అమ్ముతున్నారు. మామూలు ...

Read More »

ఆరెస్సెస్‌ మేధోమథనం

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) హైదరాబాద్‌లో మూడురోజుల పాటు నిర్వహించిన అఖిల భారత కార్యకారిణి సమావేశాల్లో పాత కొత్త అంశాల కలయిక కనిపించింది. గోరక్షణ, రామజన్మభూమి ఇత్యాది అంశాల్లో గత వైఖరినే పునరుద్ఘాటించినా, కొన్ని అంశాల్లో ఈ సమావేశం వెలిబుచ్చిన అభిప్రాయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా దాని ఆలోచనల్లో వస్తున్న మార్పును సూచిస్తాయి. వామపక్షాలకు బుద్ధిచెపాల్సిందేనంటూ తొలిరోజే ఈ సదస్సు సంకల్పించడంలో ఆశ్చర్యమేమీ లేదు. రాడికల్‌ జిహాదీ శక్తులకు అధికారంలోని ప్రభుత్వాలు అండగా ఉన్న కారణంగానే పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ...

Read More »

అలా నటించినందుకు ఆ హీరోయిన్‌కు పెళ్లి చేసేశారు!

కన్నడ రచయిత నాగేంద్ర ప్రసాద్‌కు తనకు పెళ్లయినట్లు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫోటోలపై సినీనటి శుభ పూంజ స్పందించారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, తనను అభాసుపాలు చేయడానికే ఎవరో ఇలా చేశారని ఆమె ఆరోపించారు. తాను చేస్తున్న కొత్త సినిమాకి సంబంధించి ఓ సన్నివేశంలో భాగంగా నాగేంద్ర ప్రసాద్‌ గారితో కలిసి పెళ్లి సీన్‌లో నటించానని, లోకేషన్‌లో ఫొటో తీసినవారెవరో ఇలా చేసుంటారని ఆమె చెప్పారు. తనకు ఇప్పుడే పెళ్లిచేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇదే విషయంపై సదరు పెళ్లి కుమారుడు ...

Read More »