Breaking News

Daily Archives: October 29, 2016

షాదీఖానానా… తహసీల్‌ కార్యాలయమా…

  నందిపేట, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట గ్రామంలో ముస్లింల సమావేశాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా 2007లో అప్పటి ఎమ్మెల్యే కేశ్‌పల్లి గంగారెడ్డి చొరవతో మండల కేంద్రంలోని తహసీల్‌కార్యాలయం పక్కన ముస్లింల కొరకు షాదీఖానా నిర్మించారు. దాన్ని రూ. 10 లక్షలతో నిర్మించారు కానీ అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా అరకొర నిదులతో నిర్మించిన షాదీఖానా పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. కేవలం రేకుల గోడౌన్‌లాగా నిర్మించివదిలేశారు. ప్రహరీగోడ, మూత్రశాలలు లాంటి కనీస వసతులు లేకపోవడం వల్ల ...

Read More »

విద్యావిధానంలో మార్పు వచ్చేంత వరకు పోరాటం

  కామారెడ్డి, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యావిధానంలో మార్పు వచ్చేంత వరకు పోరాటాలు చేయాలని బార్‌ అసోసియేషన్‌అద్యక్షుడు క్యాతం సిద్దిరాములు అన్నారు. ఏఐపిఎస్‌యు జిల్లా ప్లీనరీ సమావేశం శనివారం కామారెడ్డిజిల్లా కేంద్రంలోని కర్షక్‌ బిఇడి కళాశాలలో జరిగింది. దీనికి హాజరైన సిద్దిరాములు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడం తగదన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. చదువుతోపాటు ఉపాధి కల్పనవైపు ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వవిద్యారంగాన్ని ...

Read More »

మొక్కలు కాపాడుతాం

  నిజాంసాగర్‌, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం పథకం కింద నాటిన మొక్కలు రక్షిస్తామని డిప్యూటి తహసీల్దార్‌ హైమద్‌ మస్రూద్‌ అన్నారు. మండలంలోని ఎండివో కార్యాలయంలో నాటిన మొక్కలను పరిశీలిస్తూ కొంత కంచెను మొక్కల పెరుగుదలకు ఏర్పాటుచేయడం జరుగుతుందని అన్నారు. కార్యాలయ ఆవరణలో 135 మొక్కలను నాటడం జరిగిందన్నారు. హరితహారం మొక్కలన్నింటిని రక్షించి నీటి సరఫరా చేస్తామని చెప్పారు.

Read More »

పొలాలల్లో బంతి వనాలు

  నిజాంసాగర్‌, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన తాండాలలో బంతి వనాలు సాగుచేస్తున్నారు. పండించిన పువ్వులను పట్టణాలకు తీసుకెళ్లి గిరిజనులు విక్రయిస్తుంటారు. నిజాంసాగర్‌, పిట్లం, ఎల్లారెడ్డి, బాన్సువాడ మండలాల్లో పొలాల గట్లపై బంతిపూల సాగుచేస్తూ అధిక ఆదాయం పొందుతుంటారు. మండలంలోని పంట పొలాలన్ని విరబూసిన బంతిపూలతో కనువిందు చేస్తున్నాయి. దాదాపు కిలోకు రూ. 250 నుంచి 300 వరకు విక్రయించడం జరుగుతుంది. మండలంలోని నల్లగుట్ట తాండా, మల్లూరు తాండా, సుంకిపల్లి తాండా, దూప్‌సింగ్‌ తాండా ల్లో వందల ఎకరాల్లో ...

Read More »

మాదిగ శక్తిప్రదర్శన గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో నవంబరు 13న నిర్వహించనున్న మాదిగల శక్తి ప్రదర్శన బహిరంగ సభకు సంబంధించిన గోడప్రతులను శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు, జాతీయ అద్యక్షురాలు పెద్దె జీవలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎ,బి,సి,డి, వర్గీకరణ కోసం శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్‌తో బహిరంగ సభ చేపట్టనున్నామన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

గుర్తుతెలియని యువకుని మృతి

  కామారెడ్డి, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి గంజ్‌ గేటు వెనకభాగంలో శనివారం గుర్తుతెలియని యువకుడు (35) మృతదేహం లభించినట్టు కామారెడ్డి ఎస్‌ఐ శోభన్‌ తెలిపారు. యువకుని ఆచూకి తెలియలేదనిగుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తిస్తే పట్టణ పోలీసు స్టేషన్లో సంప్రదించాలని కోరారు.

Read More »

హరితహారం లక్ష్యాన్ని వందశాతం పూర్తిచేయాలి

  – కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వందశాతం లక్ష్యం సాధించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశమందిరంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంపై వివిధ శాఖల వారిగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. శాఖల వారిగా అవసరమైన మొక్కలను అందించేందుకు నర్సరీల్లో ...

Read More »

కామారెడ్డికి రంగాచారి జిల్లాగా నామకరణం చేయాలి

  కామారెడ్డి, అక్టోబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఫణిహారం రంగాచారి పేరును కామారెడ్డి జిల్లాకు చేర్చాలని సిపిఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఫణిహారం రంగాచారి 67వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయం ముందుగల రంగాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రంగాచారి తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాలు విడిచారని గుర్తుచేశారు. అలాంటి సమరయోధులను ప్రభుత్వం గుర్తించకపోవడం సిగ్గుచేటన్నారు. భద్రాద్రి, రాజన్న, కొమురం భీం ...

Read More »