Breaking News

Monthly Archives: November 2016

అయ్యప్పస్వాముల భిక్ష

  కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం అయ్యప్పస్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప దీక్షా స్వాములకు మండల పూజా కార్యక్రమంలో భాగంగా భిక్ష ఏర్పాటు చేశారు. అయ్యప్పమాల ధారులు భిక్షలో పాల్గొన్నారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు.

Read More »

విద్యార్థుల స్కాలర్‌షిప్‌ గడువు పొడిగించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పొడిగించాలని బుధవారం పిడిఎస్‌యు నాయకులు కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నోట్ల మార్పిడి విధానాన్ని చేపట్టడంతో విద్యార్తులు నూతన బ్యాంకు ఖాతాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటివరకు చాలా మంది విద్యార్తులకు బ్యాంకు ఖాతాలు లేవన్నారు. నూతన జిల్లాల ఏర్పడిన నేపథ్యంలో, తద్వారా ఏర్పడిన డివిజన్‌లు, మండలాల ఏర్పాటు వల్ల విద్యార్థులు బ్యాంకు ఖాతాల ...

Read More »

బోధన వృత్తి సవాళ్లతో కూడుకున్నది

  – టిటియు – యుఎస్‌ఐ అకడమిక్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ వాణి కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన వృత్తి అంత సులభమైనది కాదని, సవాళ్లతో కూడుకున్నదని టిటియు – యుఎస్‌ఐ అకడమిక్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ వాణి అన్నారు. కామారెడ్డి కర్సక్‌ బిఇడి కళాశాలలో బుధవారం నిర్వహించిన తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎదుర్కొంటున్న సవాళ్ళు అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌ కార్యక్రమానికి ఆమెముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సవాళ్లను అధిగమించాలంటే ఉపాధ్యాయుడు 3సి నమూనా గురించి విద్యార్తులకు అవగాహన ...

Read More »

బెల్లం వండడం రైతుల హక్కు

  – సిపిఐ (ఎంల్‌) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి కట్ల భూమన్న కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బెల్లం తయారుచేయడం రైతుల హక్కు అని సిపిఐ (ఎంల్‌) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి కట్ల భూమన్న అన్నారు. బుధవారం కామారెడ్డలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు చెరుకు వండవద్దని ఎక్సైజ్‌ అధికారులు రైతులవద్దకెళ్లి బెదిరించడం సమంజసం కాదన్నారు. హరితహారంలో భాగంగా కామారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ కామారెడ్డి గడ్డ బెల్లంకు అడ్డ అని మాట్లాడి ప్రస్తుతం బెల్లం వండితే ...

Read More »

గోదావరి జలాల సమస్య పరిష్కరించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గోదావరి జలాలు సరఫరా సరిగా లేదని, దాన్ని పునరుద్దరించాలని కామారెడ్డి 32వ వార్డు కౌన్సిలర్‌ రామ్మోహన్‌ బుధవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గోదావరి జలాలు పట్టణంలో సరఫరా కావడం లేదన్నారు. దీనివల్ల పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్‌ దృస్టికితీసుకు వచ్చారు. ఈవిషయమై మంగళవారం జరిగిన మునిసిపల్‌ పాలకవర్గ సమావేశంలో బల్దియా ఏ.ఇ. భువనేశ్వర్‌ను ...

Read More »

క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలి

  – జిల్లా ఎస్పీ శ్వేత కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడాకారులు చిన్నప్పటినుంచే క్రీడల్లో రాణించి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేషనల్‌ యువ కో ఆపరేటివ్‌ సొసైటీ ఆద్వర్యంలో 11-12 సంవత్సరాల బాలబాలికలకు అథ్లెటిక్‌ పోటీలను నిర్వహించారు. జెండా ఊపి ప్రారంభించిన అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడాపోటీలు దోహదపడతాయన్నారు. ...

Read More »

నిజాంసాగర్‌ నీటి విడుదల వాయిదా…

  నిజామాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఖరీఫ్‌ వరి పంటలు ఇంకా పూర్తి కానందున, అదేవిధంగా రైతుల కోరిక మేరకు డిసెంబరు 1వ తేదీన నిజాంసాగర్‌ నుండి పంట పొలాలకు నీటిని విడుదల చేయడం తాత్కాలికంగా వాయిదా వేసినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే నీటి విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ తెలియపరుస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.

Read More »

తెలంగాణ మాదిగ జేఏసిని బలోపేతం చేయాలి

కామారెడ్డి,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మాదిగ జేఏసిని బలోపేతం చేసేందుకు మాదిగ యువకులు ముందుకు రావాల్సిన అవసరముందని తెలంగాణమాదిగ జేఏసి యువజన విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గడ్డం సంపత్‌కుమార్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డిలోఆయన మాట్లాడుతూ మాదిగ జేఏసిని బలోపేతం చేసేందుకు జిల్లా, మండల, గ్రామస్థాయిలో కమిటీ వేయనున్నట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగుతున్న వర్గీకరణ ఉద్యమంలో మాదిగ యువకులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. జేఏసి కమిటీలో భాగస్వాములు కావాలని కోరారు. ...

Read More »

డిసెంబరు 18 బహిరంగసభకు మాదిగలు తరలి రావాలి

కామారెడ్డి,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఆర్‌పిఎస్‌ తెలంగాణ ఆధ్వర్యంలో డిసెంబరు 18వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగసభకు మాదిగలు పెద్ద ఎత్తున తరలిరావాలని, సభను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ నాయకులు ఇబత్‌వారూ, తుకారాం, వేముల బలరాంలు కోరారు. కామారెడ్డిలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. డప్పుకు, చెప్పుకు రెండువేల పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌తో సభ నిర్వహిస్తున్నామన్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తోపాటు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్తిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ఎంపి కవితలు హాజరు కానున్నట్టు ...

Read More »

బిఇడి రెండోదశ కౌన్సిలింగ్‌ను వెంటనే ప్రారంభించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో బిఇడి రెండోదఫా కౌన్సిలింగ్‌ను వెంటనే ప్రారంభించాలని పిడిఎస్‌యు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బిఇడి రెండో దశ కౌన్సిలింగ్‌ చేపట్టడంలో విఫలమైందన్నారు. బిఇడి మొదటి దశ కౌన్సిలింగ్‌ పూర్తయి, తరగతులు పూర్తయి రెండున్నర నెలలు గడుస్తున్నా నేటికి రెండోదశ కౌన్సిలింగ్‌ నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. బిఇడి చదువుకోవాలని ఆశతో ఎదురుచూస్తున్న వేలాది ...

Read More »

డిసెంబరు 9 నుంచి రాష్ట్రస్తాయి యోగా పోటీలు

కామారెడ్డి,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్‌ బోర్డులోని భవిత పాఠశాలలో డిసెంబరు 9 నుంచి 11వ తేదీ వరకు  3వ రాష్ట్రస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర యోగా అసోసియేషన్‌ అధ్యక్షుడు రాంచంద్రం తెలిపారు. కామారెడ్డిలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 8 – 14 బాలబాలికలకు సబ్‌ జూనియర్‌, 14-20 బాలబాలికలకు జూనియర్‌, 20-25 , 25-40, 40 నుంచి 50, పై వయసు గలవారికి వారి ...

Read More »

కామారెడ్డి ట్రాక్టర్‌ యజమానుల సంఘం కార్యవర్గం

  కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ట్రాక్టర్‌ యజమానుల సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా మల్లేశ్‌ యాదవ్‌ రెండోసారి ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షునిగా ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా హైమద్‌, గంగాధర్‌, కార్యదర్శిగా సిద్దిరాంరెడ్డి, ఉప కార్యదర్శిగా శంకర్‌, కోశాదికారిగా రమేశ్‌, సహాయ కోశాధికారిగా రాజు, కార్యవర్గ సభ్యులుగా జీవన్‌గౌడ్‌, నజీర్‌, వెంకట్‌రెడ్డి, శ్రీను, జగన్‌రెడ్డిలను ఎన్నుకున్నారు.

Read More »

అధికారుల పనితీరుపై దద్దరిల్లిన మునిసిపల్‌ కౌన్సిల్‌

  – కమీషనర్‌ అధికారులను సరెండర్‌ చేస్తామని హెచ్చరిక కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన మంగళవారం జరిగిన కామారెడ్డి పాలకవర్గ సమావేశంలో అధికారుల పనితీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. అధికారులు తమ పనితీరుమార్చుకోకుంటే ప్రబుత్వానికి సరెండర్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ అధికారులు పొందుపరుస్తున్న ఎజెండాలో ప్రగతి పనులకు సంబంధించి ధరలలో చాలా వ్యత్యాసాలున్నాయన్నారు. వేల రూపాయల్లో అయ్యే పనులను లక్షల్లో ఖర్చు చూపిస్తూ తప్పుడు ఎజెండాలు తయారుచేస్తున్నారని ...

Read More »

తడపాకల్‌ చెరువులో చేప పిల్లల విడుదల

  మోర్తాడ్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తడపాకల్‌ గ్రామ చెరువులో మత్స్యశాఖ ఆద్వర్యంలో ఊరచెరువులో మంగళవారం 33 వేల చేపపిల్లలను స్థానిక సర్పంచ్‌ల లోలం లావణ్య, ఎంపిటిసి సరస్వతి లు విడుదల చేశారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వందశాతం సబ్సిడీ కింద మత్స్యకారుల అభివృద్దికై చేప పిల్లలను అందిస్తున్నారని, పెరిగిన తర్వాత విక్రయించేందుకు 75 శాతం సబ్సిడీతో మత్స్య కార్మికులకు వాహనాలు, భవన నిర్మాణాలకు నిధులు అందించనున్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, గంగపుత్ర ...

Read More »

మోర్తాడ్‌లో దీక్షా దివస్‌…

  మోర్తాడ్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 29న తెలంగాణ రాష్ట్ర సాధనకై సిఎం కెసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టిన రోజు కావడంతో తెరాస పార్టీ పిలుపు మేరకు మోర్తాడ్‌లో మండల తెరాస నాయకులు ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల విద్యార్థులు దీక్షా దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణకు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల తెరాస ...

Read More »

అభివృద్దే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం కృషి

  మోర్తాడ్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనని మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో తహసీల్దార్‌, ఎంపిడివో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ, మోర్తాడ్‌ డిగ్రీకళాశాల భవన ప్రారంభోత్సవానికి, ఏర్గట్ల మండల కేంద్రంలోని పలు అభివృద్ది పనులకు ముఖ్యఅతిథిగా విచ్చేసి భూమిపూజచేసి ప్రారంభించారు. స్థానిక సర్పంచ్‌ దడివె నవీన్‌, ఎంపిపి కల్లడ చిన్నయ్య అధ్యక్షతన ...

Read More »

తెయు పరీక్షల షెడ్యూల్‌…

డిచ్‌పల్లి,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం వివిధ పరీక్షల తేదీలను విడుదలచేసింది. డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు డిసెంబరు 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆచార్య కనకయ్య తెలిపారు. అదేవిధంగా పిజి సెమిస్టర్‌ పరీక్షలు డిసెంబరు 15 నుంచి ప్రారంభమవుతాయన్నారు. డిసెంబరు 15 నుంచి ప్రారంభమయ్యే బిసిఎ 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు యూనివర్సిటీ కళాశాలలో నిర్వహిస్తారని ఆయన అన్నారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు. ...

Read More »

అక్షరాస్యతతోనే ఆదర్శగ్రామం…

– జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామస్థాయిలో 18 నుంచి ప్రభుత్వ సిబ్బంది వివిధ హోదాల్లో విదులు నిర్వహిస్తారని వారితో ప్రజలకు కావాల్సిన పనులు చేయించుకునే బాధ్యత గ్రామ ప్రజలదేనని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. మంగళవారం నందిపేట మండలం నారాయణపూర్‌ గ్రామ సభలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. సాక్షరభారతి కేంద్రాల్లో వయోజన విద్యనేర్చుకోవాలని, రాత్రిపూట చదువుకోవాలని ఎన్ని పనులున్నా అక్షర జ్ఞానం పెంపొందించుకోవాలని గ్రామస్తులకు ...

Read More »

చలితో సాగుకు ఇబ్బంది…

బాన్సువాడ,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐదారురోజులుగా చలి తీవ్రత పెరగడం ఖరీఫ్‌ సాగును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వరి సాగుచేసే రైతులకు ఇబ్బంది ఉంటుంది. చలి తీవ్రత వల్ల ఇపుడు వరి నారుమళ్ళు వేస్తే సక్రమంగా మొలకెత్తలేని పరిస్తితి ఉంటుంది. దీంతో రైతులకు ఇబ్బంది ఎదురవుతుంది. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకు మేలు కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. చలి తీవ్రత వల్ల గతంలో నారుమళ్ళకు ఇబ్బంది కలిగిన అనుభవాలు ఉన్నాయి. దీంతో కొందరు రైతులు ...

Read More »

హనుమాన్‌ మందిరంలో శిఖర ప్రతిష్ట

  బాన్సువాడ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలో ప్రఖ్యాతి గాంచిన పెద్ద హనుమాన్‌ మందిరంలో బుధవారం 30వ తేదీ నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు హనుమాన్‌ ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శిఖర ప్రతిష్ట, ధ్వజస్థంభ, దత్తాత్రేయ, నవగ్రహాలను ప్రతిష్టాపన చేయనున్నట్టు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు వివిధ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవాల్లో హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామిజీ, మెదక్‌ జిల్లా తొగుట చిన్నస్వామి శ్రీగురు ...

Read More »