అమెరికాకు పోటెత్తిన భారత విద్యార్థులు

  • విదేశీ విద్యార్థుల్లో రెండో స్థానం

అమెరికా చట్టసభల్లోనే కాదూ… అక్కడి విద్యాసంస్థల్లోనూ భారత ప్రాతినిధ్యం పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 2015-16 కాలానికి మొత్తం 1,65,918 మంది భారత విద్యార్థులున్నారు. క్రితం ఏడాదితో పోల్చితే ఇది 25శాతం ఎక్కువ! ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ఎక్స్చేంజ్‌పై 2016 సంవత్సరానికి ‘ఓపెన్‌ డోర్స్‌’ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం… 2015-16 కాలంలో అమెరికాలో మొత్తం 10,44,000 మంది కాలేజీ, యూనివర్సిటీ స్థాయి విదేశీ విద్యార్థులు ఉన్నారు. ఇంతమంది విదేశీ విద్యార్థులు నమోదు కావడం అమెరికాలో ఇదే తొలిసారి. క్రితం ఏడాదితో పోల్చితే ఇది 7శాతం ఎక్కువ. అమెరికాలోని మొత్తం విద్యార్థు ల్లో విదేశీ విద్యార్థులు 5శాతం ఉన్నా రు. బ్రిటన్‌లోని విదేశీ విద్యార్థుల కంటే దాదాపు రెట్టింపు విద్యార్థు లు అమెరికాలో చదువుకుంటున్నారు. భారత విద్యార్థులు పెరగడంపై భారతలోని అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ మాట్లాడుతూ.. ఇరుదేశాల ప్రజాసంబంధాల బలోపేతానికి ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అమెరికా విద్యార్థులు కూడా భారతకు వస్తున్నారని, విదేశాల్లో విద్యాభ్యాసం కోసం ఎంచుకుంటున్న 25 ప్రాధాన్య దేశాల్లో భారత 13వ స్థానంలో ఉందని, ఇక్కడికి వస్తున్న వారికి తమ ప్రభుత్వం ఇస్తున్న రుణాలు కూడా పెరుగుతున్నాయని రిచర్డ్‌ పేర్కొన్నారు.

Check Also

ఎన్నికలు వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 మహమ్మారి జిల్లాలో విస్తరిస్తున్న కారణంగా ఈ ...

Comment on the article