Breaking News

Daily Archives: November 19, 2016

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌, అనుబంధ సంఘాల ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరా గాంధీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అద్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సేవలు చేసిందన్నారు. దేశ ఖ్యాతిని నలుమూలల చాటిందని కొనియాడారు. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం ...

Read More »

ఝాన్సీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీరనారి ఝాన్సీలక్ష్మిబాయిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థిసేన జిల్లా ప్రధాన కార్యదర్శి జింక భాస్కర్‌ అన్నారు. ఝాన్సీలక్ష్మిబాయి 188వ జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ధైర్య సాహసాలతో పోరాడిన వీరనారి ఝాన్సీలక్ష్మిబాయి పరాయి పాలన నుండి భారత విముక్తిలో తనదైన పాత్ర పోషించిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం రాజ్యపాలన చేపట్టి అందరికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో జాకీర్‌, అన్విత్‌రెడ్డి, రంజీత్‌ కుమార్‌, దినేష్‌, శ్రీనివాస్‌, మోసిన్‌, మాజీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

దేశ సౌభాగ్యం కోసం సైకిల్‌యాత్ర

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో అన్ని వర్గాల వారు కలిసి ఉండి, దేశ అస్తిత్వాన్ని, శాంతి, సౌభ్రాతృత్వం కాపాడాలని కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌ యాత్ర చేపట్టినట్టు పంకజ్‌ మల్‌ అనే యువకుడు తెలిపారు. పంకజ్‌మల్‌ సైకిల్‌ యాత్ర శనివారం కామారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికులు ఆయన్ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంకజ్‌ మల్‌ మాట్లాడుతూ దేశం శాంతియుతంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షిస్తూ సైకిల్‌ యాత్ర చేపడుతున్నట్టు ...

Read More »

గులాంనబీ ఆజాద్‌ దిష్టిబొమ్మ దగ్దం

  – సైనికులను అవమానించడంపై బిజెపి ఆందోళన కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్‌ సైనికులను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బిజెపికామారెడ్డి జిల్లా శాఖ ఆద్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. నిజాంసాగర్‌ చౌరస్తా నుంచి బిజెపి శ్రేణులు కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆజాద్‌ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసే క్రమంలో ప్రధానమంత్రి నోట్లను రద్దుచేస్తే ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ఆజాద్‌ ...

Read More »

బోరు పనులు ప్రారంభం

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 2వ వార్డులో శనివారం బోరు తవ్వకం పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా బోరు తవ్వకం పనులు ప్రారంభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ కాళ్ల గణేష్‌, నాయకుడు చాట్ల రాజేశ్వర్‌, సంజీవ్‌కుమార్‌, ధర్మసేన, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మహిళా శక్తిని అంతటా చాటాలి

  – జిల్లా ఎస్పీ శ్వేత కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా శక్తిని అంతటా చాటాలని కామారెడ్డి జిల్లా ఎస్‌పి శ్వేతా పిలుపునిచ్చారు. ఝాన్సీ లక్ష్మిబాయి 188వ జయంతి ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లోని అవకాశాలను వినియోగించుకొని జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను అదిరోహించాలని ...

Read More »

చైల్డ్‌ యాక్టు గోడప్రతుల ఆవిష్కరించిన జిల్లా ఎస్‌పి

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ శ్వేతా చైల్డ్‌ యాక్టులకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ పిల్లలు వేధింపులకు గురికాకుండా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత వహించాలన్నారు. పిల్లలపై లైంగిక వేదింపులు జరగకుండా చూడాలన్నారు. పిల్లలను పనిలో పెట్టుకోవద్దని, అది నేరమని స్పష్టం చేశారు. బాలలను కాపాడేందుకు చైల్డ్‌ లైన్‌ టీంలు ఏర్పాటు చేసినట్టు ...

Read More »

గ్రామ పంచాయతీ బిల్లులు వసూలు

  నిజాంసాగర్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బూర్గుల్‌ గ్రామంలో ఇంటి కుళాయి బకాయిల వసూలు కోసం పంచాయతీ కార్యదర్శులు బృందంగా ఏర్పడి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ పన్నులు చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుచేయడంతో వాటిని కూడా తీసుకుంటామని వారు ప్రజలకు సూచించారు. గ్రామంలో ఇంటి కుళాయి బకాయిలు 5617 రూపాయలు వసూలుచేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శులు సంధ్యారాణి, క్యాసప్ప, సుధాకర్‌ ఉన్నారు.

Read More »

నిజాంసాగర్‌లో చేప పిల్లల విడుదల

  నిజాంసాగర్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మత్స్యకార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు తెరాస ప్రభుత్వం చేపపిల్లలను విడుదల చేసేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయంలో శనివారం చేపపిల్లలను ఎమ్మెల్యే హన్మంత్‌షిండేతో కలిసి విడుదల చేశారు. నిజాంసాగర్‌ జలాశయంలో 32 లక్షల చేప పిల్లలను మంత్రి చేతుల మీదుగా విడుదలచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మత్స్యకార్మికులను కరువు నుంచి ...

Read More »

29న జిల్లాస్థాయి యువజనోత్సవ పోటీలు

  నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా యువజన, క్రీడల కార్యాలయం నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లాస్థాయి యువజన ఉత్సవ పోటీలు ఈనెల 29న నిర్వహిస్తున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి ముత్తన్న తెలిపారు. పోటీలు ఉదయం 9 గంటల నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వీటిలో కర్ణాటక శాస్త్రీయ గాత్ర సంగీతం, హిందుస్థాని శాస్త్రీయ గాత్ర సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, కథక్‌, మణిపూరి, ఒడిస్సి, వీణ, సితార్‌, తబల, మృదంగం, గిటార్‌, హార్మోనియం, వేణుగానం, ...

Read More »

ఘనంగా మహిళా దినోత్సవం

  నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం నిజామాబాద్‌ ప్రాంతీయ గ్రంథాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాందీ చిత్రపటాన్ని ఆవిష్కరించి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థినిలకు రంగవల్లి పోటీలు ఏర్పాటు చేశారు. అలాగే 20న ఆదివారం ఉదయం 10 గంటలకు ముగింపు సమావేశం నిర్వహించబడుతుందని, వారంరోజుల పాటు నిర్వహించిన ఆయా పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం ఉంటుందని గ్రంథపాలకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య ...

Read More »

దెయ్యమైనా పవన్ పాటకు చిందెయ్యాల్సిందే!

పాత తరాన ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోల పేర్లను ప్రస్తావించే వాళ్లు ఆనాటి చిన్న హీరోలు. ఆ తర్వాత ఆ స్థానాన్ని చేరింది చిరంజీవి, బాలకృష్ణ వంటి నటులు. ఇప్పుడది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్థానం. చాలా సినిమాల్లో పవన్ పేరును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రస్తావిస్తూనే ఉన్నారు. హీరో నితిన్ గురించి అయితే.. ఇంకా చెప్పనక్కర్లేదు. పవన్ అంటే వీరభక్తి చాటేస్తాడు ఈ యంగ్ హీరో. తాజాగా విడుదలైన నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలోనూ పవన్ పేరును వాడుకున్నారు. ...

Read More »

తండ్రి కాబోతున్న నాని!

ఓ సాధారణ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి స్టార్‌ హీరో రేంజ్‌కు ఎదిగాడు నాని. 2012లో విశాఖపట్నానికి చెందిన అంజనను ప్రేమించి పెళ్లి చేసకున్న నాని.. ఇప్పుడు మరో ప్రమోషన్‌ పొందబోతున్నాడట. త్వరలోనే ఈ నేచురల్‌ స్టార్‌ తండ్రి కాబోతున్నట్టు తెలుస్తోంది. నాని భార్య అంజన ప్రస్తుతం గర్భవతి అని సమాచారం. మరో రెండు నెలల్లో అంజన ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందట. సో.. మిగతా టాలీవుడ్‌ హీరోల్లాగానే నాని కూడా తండ్రి అయిపోతున్నాడన్నమాట.

Read More »

సింగర్ గీతామాధురి మనసు మార్చుకుందట!

ఇప్పటికే గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న సింగర్‌ గీతామాధురి ఇకపై యాక్టర్‌గా మారాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. గీత ఇదివరకే ఓ షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన విషయం తెలిసిందే. ఆమెను సినిమాల్లో నటింపజేయడానికి ఇప్పటికే చాలామంది నిర్మాతలు ప్రయత్నించారు. అయితే ఆమె పూర్తిగా సంగీతం మీదే దృష్టి పెట్టడంతో ఆ ఆఫర్లను తిరస్కరించింది. కాగా, ఇటీవల ఆమె మనసు మార్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె ఓ ఫీచర్‌ ఫిల్మ్‌లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీని తర్వాత అన్నీ కుదిరితే ఆమె వెండితెర మీద మెరవడం ఖాయంగా కనిపిస్తోంది ...

Read More »

గీత దాటిన డిపాజిట్.. ఐటీ అటాక్

గ్యాంగ్టక్(సిక్కిం): నల్లధనంపై దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించే అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన పది రోజుల్లోనే ఆదాయ పన్ను శాఖ భారీ నగదు లావాదేవీలపై నోటీసులు జారీ చేసింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రద్దు చేసిన నోట్లను తక్కువ మొత్తంలోనే మార్పు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడానికి రూ. 2.5 లక్షలకు పైగా డబ్బును బ్యాంకులో ...

Read More »

ఆ వాడలో ఎదురుచూపులు…

జీవిత చిత్రం ‘వారం రోజులైంది. ఒక్క మగాడు రావడం లేదు’ అంది ఢిల్లీ జి.బి.రోడ్‌లోని ఒక సెక్స్ వర్కర్. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నిజమే కాని ఆ చర్య ఫలితంగా ఊహించని శిబిరాలు పడుతున్న ఇక్కట్లు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.  పెద్దనోట్ల రద్దు వల్ల ‘క్యాష్ అండ్ క్యారీ’ పద్ధతిలో నడిచే సెక్స్‌వర్కర్ల లావాదేవీలు గత వారం రోజులుగా పూర్తిగా కుదేలయ్యాయని తెలుస్తోంది. ‘అప్పటికీ మేం పాత నోట్లు తీసుకుంటాం అనే అంటున్నాం. కాని ...

Read More »

కారులో రూ.65 లక్షలు

మద్దిపాడు: పెద్దనోట్ల రద్దు ప్రకటన అనంతరం నల్లధనం కట్టలు తెంచుకుని బయటకు వస్తోంది. పలు మార్గాల ద్వారా నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు నల్లబాబులు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద కారులో రూ. 65లక్షల నగదు లభ్యమైంది. పోలీసుల వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో పెద్దమొత్తంలో నగదును గుర్తించారు. అయితే ఈ భారీ మొత్తానికి ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు నగదును తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదును ...

Read More »

కోటిరూపాయలు పట్టించిన మహిళను పోలీసులు ఏం చేశారో తెలుసా..

న్యూఢిల్లీ : కోటిరూపాయల నల్లధనాన్ని పట్టించిన మహిళను అభినందించాల్సింది పోయి…ఆ నల్ల కుబేరుడి నుంచి లంచం తీసుకొని మహిళ పెట్టిన కేసునే విత్ డ్రా చేసుకోమని పోలీసులు బెదిరించిన వింత ఘటన దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో జరిగింది. జహంగీర్ పురి ప్రాంతానికి చెందిన అష్మినా షియాకా అనే ఓ మహిళ ఓ పాన్ షాపు నడుపుతోంది. ఈ నెల 14 వతేదీన ఓ స్ర్కాప్ డీలరు కోటిరూపాయల బ్యాగును ఇంట్లో దాచిపెట్టాడని అష్మినా పోలీసులకు సమాచారం అందించింది. అంతే జహంగీర్ పురి ప్రాంత ...

Read More »

ఆ శివాలయం తలుపులకు నాగబంధం.. చూసిన పూజారులకు ఆశ్చర్యం

చెన్నై: తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని పురాతన శివాలయం తలుపులకు పాము పెనవేసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. కొళత్తూర్‌ గ్రామంలో వెయ్యేళ్ల పురాతన ఏకాంబరేశ్వర ఆలయం వుంది. ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, సుబ్రమణ్యస్వామి, పార్వతి, పరమేశ్వరుల సన్నిధులున్నాయి. ప్రతి రోజు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. కార్తీక మాసం సందర్భంగా సుబ్రమణ్యస్వామికి, శివపార్వతులకు ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఆలయ తలుపులు తెరవడానికి వచ్చిన పూజారి తలుపునకు పెనవేసుకున్న పామును చూసి దిగ్ర్భాంతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ...

Read More »

ఉరి వేసుకుని ప్రముఖ నటి ఆత్మహత్య

 లిమా: ప్రముఖ హాలీవుడ్‌ నటి, మోడల్‌ లిసా లిన్‌ మాస్టర్స్‌ ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజుల క్రితం లిమా పర్యటన వెళ్లింది. అక్కడ ఓ హోటల్‌‌ బస చేస్తున్న ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే లిసా చనిపోయింది ఈరోజు కాదని రెండు రోజుల క్రితమే అని చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవాళ ఆమె మృతదేహాన్ని హోటల్ సిబ్బంది గుర్తించి భర్తకు సమాచారం అందించింది. ఆమె స్టే చేస్తున్న రూమ్‌‌లో రెండు లేఖలు దొరికాయి. ఆ లేఖలో తన ఆత్మహత్యకు ప్రధాన కారణం డిప్రెషన్ ...

Read More »