Monthly Archives: December 2016

సావిత్రిబాయి పూలే జయంతి కరపత్రాల ఆవిష్కరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే 185వ జయంతి వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను శనివారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ అంబేడ్కర్‌ సంఘం జిల్లా అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్‌ ఆకుల బాబు, గౌరవ అద్యక్షుడు కొత్తపల్లి మల్లయ్యలు మాట్లాడుతూ కామారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో ఈనెల 3వ తేదీన జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్‌, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువడ, ఆర్మూర్‌, బోధన్‌లలో జయంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనికి అన్ని వర్గాల ...

Read More »

వైభవంగా అయ్యప్ప ఆలయంలో పూజలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మండల పూజా కార్యక్రమంలో భాగంగా శనివారం స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు సంఘం అధ్యక్షుడు చీలప్రభాకర్‌ ఇంటివద్దనుంచి స్వామివారి ఆభరణాల ఊరేగింపు నిర్వహించారు. 500 మంది స్వాములతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండాఊరేగింపు జరిపారు. 10 గంటలకు ఆలయానికి చేరుకొని హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం 2 వేల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. లింగన్నపేట, సంస్కృతిపాఠశాల నిర్వాహకుడు ...

Read More »

తెలంగాణ జాగృతి క్రికెట్‌ కప్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో జనవరి 7వతేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాగృతి క్రికెట్‌కప్‌-2017ను హైదరాబాద్‌లో నిజామాబాద్‌ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. క్రికెట్‌ మ్యాచ్‌లు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరుగుతాయని, మన జోన్‌ నుంచి 24 టీంలు క్రికెట్‌ మ్యాచ్‌లో పాల్గొంటాయన్నారు. కామారెడ్డి జోన్‌లోని విన్నర్‌టీం, నిజామాబాద్‌ జోన్‌ టీంతో తలపడుతుందన్నారు. అందులో నెగ్గిన టీం ఈనెల 23న హైదరాబాద్‌ ఎల్‌బిస్టేడియంలో ...

Read More »

విద్యార్థులు తెలంగాణ భవిష్యత్తు వారసత్వ సంపద

  – ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ కామారెడ్డి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ భవిష్యత్తు వారసత్వ సంపద విద్యార్థులని ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్‌ అందెశ్రీ అన్నారు. కామారెడ్డి మండలంల చిన్నమల్లారెడ్డి గ్రామంలోని చైతన్య విద్యానికేతన్‌ పాఠశాలలో 2016 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2017 కుస్వాగత కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అందెశ్రీ మాట్లాడుతూ కామారెడ్డిని జిల్లాగా ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్దికి జిల్లాల పునర్విభజన తోడ్పడుతుందన్నారు. తను రాసిన జయజయహే ...

Read More »

వందశాతం మరుగుదొడ్లు పూర్తి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గాండ్లపేట్‌ గ్రామంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్తానికసర్పంచ్‌రాజేశ్వర్‌ మండల అధికారుల, గ్రామస్తుల సహకారంతో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు శనివారం వరకు పూర్తిచేయించారు. అంతేగాకుండా గత రెండ్రోజులుగా గ్రామపంచాయతీలో మండల ప్రత్యేకాధికారి శంకరయ్య, ఎంపిడివో శ్రీనివాస్‌, ఐకెపి సిసి మహేందర్‌, ఇవో జావిద్‌, స్తానికసర్పంచ్‌ గ్రామస్తులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రేషన్‌ సరుకులు క్యాష్‌లెస్‌ విధానంపై తీసుకునేలా వందశాతం పూర్తిచేశారు. గ్రామంలో 158 కుటుంబాలున్నాయని, బ్యాంకు, ఆధార్‌ లింకేజీ సైతం ...

Read More »

కృష్ణవేణి పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లోని కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో ప్రిన్సిపాల్‌ జాబ్రినూతన సంవత్సర వేడుకలు శనివారం నిర్వహించారు. 2016 కు వీడ్కోలు తెలుపుతూ 2017 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భారీ కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

పిఆర్‌టియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల విద్యావనరుల కేంద్రంలో పిఆర్‌టియుకు చెందిన నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీలను తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ఎంఇవో రాజేశ్వర్‌లు శనివారం ఆవిస్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పిఆర్‌టియు అధ్యక్ష, కార్యదర్శులు శంకర్‌, గంగాధర్‌, ఉపాద్యాయ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

కామర్స్‌ లెక్చరర్‌కి గోల్డ్‌ మెడల్‌

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని కేర్‌డిగ్రీ కళాశాలలో కామర్స్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న మీర్‌ నిస్సార్‌ అలీ హష్మి ఇటీవల బంగారు పతకం సాధించారు. 2013-15 విద్యాసంవత్సరానికి గాను మౌలానా ఆజాద్‌ ఉర్దూ యూనివర్సిటీ నుంచి ఎం.కాం విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఇటీవల బంగారు పతకం బహుకరించారు. ఈ సందర్భంగా కేర్‌ కళాశాలలో యాజమాన్యం, అధ్యాపక సిబ్బంది ఘనంగా సత్కరించారు. శాలువా,జ్ఞాపిక, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల డైరెక్టర్‌ నరాల ...

Read More »

తెవివిలో నూతన సంవత్సర వేడుకలు

  డిచ్‌పల్లి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ బాలికల వసతి గృహంలో శనివారం 2017 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్య విచ్చేసి కేక్‌కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కొత్త ఆశయాలతో, నూతన ఆలోచనలతో భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. వార్డెన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్రవంతి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలవైపు దూసుకెళ్తు మహిళా శక్తినిచాటాలని సూచించారు. కార్యక్రమంలో వసతి గృహంలోని విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ప్రజలు నిర్వహించుకుంటున్నారు. శనివారం ఉదయం నుంచే 2016 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ విందులు, వినోద కార్యక్రమాల్లో యువత, చిన్న, పెద్ద తలమునకలయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా మాంసం విక్రయదారులకు భలే గిరాకీ పెరిగింది. శనివారం అర్ధరాత్రి కేక్‌కట్‌చేసి మిఠాయిలు పంచి 2017 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా, ఇతరుల ...

Read More »

నగదు రహిత గ్రామంగా జువ్వాడిని తీర్చిదిద్దుతాం

  గాంధారి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగదు రహిత గ్రామంగా జువ్వాడిని మొదటి స్థానంలో ఉంచుతామని తహసీల్దార్‌ లక్ష్మణ్‌ అన్నారు. శనివారం గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామాన్ని సందర్శించి అంగన్‌వాడి, ఐకెపి సిబ్బందితో మాట్లాడారు. గ్రామంలో సర్వే నిర్వహించి ఖాతాదారుల వివరాలు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంగయ్య, డీలర్‌ శంకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా అయ్యప్పస్వామి ఆరట్టు

  గాంధారి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో శనివారం అయ్యప్పస్వామి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమంలో స్వాములు వివిధ వేషధారణలతో నృత్యాలుచేస్తు ఆరట్టులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభాయాత్రకు వస్తున్న రథానికి గ్రామంలోని మహిళలు, భక్తులు ఘనస్వాగతం పలికారు. రథం దారివెంబడి నీటితో శుద్దిచేశారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో ...

Read More »

90 వ రోజుకు చేరిన రిలే దీక్షలు

  గాంధారి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 90 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శనివారం దీక్షలో జేఏసి ప్రతినిదులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసి ప్రతినిధులు పోతంగల్‌ కిషన్‌రావు, తూరుపు రాజులు, బాల్‌రాజ్‌, బాలయ్య, లయన్‌ రమేశ్‌, శంకర్‌, జి.శంకర్‌, రెడ్డిరాజులు, మదార్‌ తదితరులు మాట్లాడుతూ గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని ...

Read More »

మహిళల్లో ఆ కోరికలు పెంచడానికి అమేజింగ్ హోం రెమెడీస్ ..!

మహిళల్లో కామేచ్ఛను పెంచడం ఎలా. ఇది తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది., మీరు లవ్ మేకింగ్ టెక్నిక్స్ తో మీ జీవిత భాగస్వామి సంతృప్తి పొందలేకపోవచ్చు. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామిని సంతృప్తి పరచడానికి కొన్ని మార్గాలను ప్రయత్నించాలి. మహిళల్లో లిబిడో యొక్క పరిమాణం, నాణ్యత మహిళల్లో సెక్స్ డ్రైవ్ ను మరింత పెంచుతుంది. లైంగిక కోరికలు మీ జీవిత భాగస్వామితో పాటు మీరు అనుభవించలేకపోతే అది చాలా క్లిష్టమైన పరిస్థితులకు దారితీస్తుంది. లిబిడో వల్ల మీ జీవితం విచ్ఛిన్నమైతే మరింత ...

Read More »

ఆన్‌లైన్‌ చెల్లింపులపై ప్రత్యేక శ్రద్ద వహించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగదు రహిత లావాదేవీలకోసం అధికారులు ప్రత్యేక శ్రద్దతీసుకోవాలని, లావాదేవీలు ప్రోత్సహించేవిధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మండలాల పరిధిలో ప్రతి గ్రామంలో నగదు రహిత లావాదేవీలు, ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగేలా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. మండలాల్లోని ప్రధాన రహదారుల్లో కెజివీల్స్‌ ట్రాక్టర్లు నడపకుండా కఠిన ...

Read More »

అంబేడ్కర్‌ విగ్రహానికి ముదిరాజ్‌ల వినతి

  కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేపల వృత్తి ముదిరాజ్‌లదేనని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటన చేయడం దారుణమని గంగపుత్రులు అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తమ ప్రకటన విరమించుకోవాలని, చేపల వృత్తి గంగపుత్రులదని అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రదేశ్‌ గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు పండ్ల రాజు, ఉపాధ్యక్షుడు మహేందర్‌లు మాట్లాడుతూ తరతరాలుగా గంగపుత్రులు చేపలవృత్తిపై ఆధారపడి బతుకుతున్నారని, అలాంటి వృత్తి ...

Read More »

ఉపాధ్యాయ సమస్యలపరిష్కారానికి వినతి

  కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని తపస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డిజిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 2008, 2012 డిఎస్సీల్లో నియామకమైన ఉపాధ్యాయులకు సర్వీసు క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని ఉపాధ్యాయుల జిపిఎఫ్‌ ఖాతాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ చేయాలని ఆ ఖాతాలను వడ్డితో సహా అప్‌డేట్‌ చేయాలని కోరారు. పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా ...

Read More »

బహిరంగ విసర్జన రహిత వార్డు ఎంపిక

  కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 27వ వార్డును బహిరంగ మలమూత్ర విసర్జన రహిత వార్డుగా ఎంపిక చేసినట్టు కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం వార్డులోపర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో స్వచ్చ భారత్‌కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సిబ్బంది ప్రజలకు మలమూత్ర విసర్జన ద్వారా వచ్చే రోగాల గురించి వివరించి మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రోత్సహిస్తున్నారన్నారు. 27వ వార్డులో వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయ్యాయని ఈ ...

Read More »

ఆకట్టుకున్న సైన్స్‌ఫేర్‌

  కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వాణి విద్యాలయం హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన సైన్స్‌ ఫేర్‌ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్‌ ఫేర్‌లో 6- 10వ తరగతి విద్యార్థులు తాము రూపొందించిన వివిధ రకాల ప్రయోగాలు ప్రదర్శించారు. నీటి శుద్దీకరణ,నీటి ద్వారా నడిచే ప్రొక్లెయిన్‌, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే నష్టాలు, నగదు రహితం కోసం స్వైపింగ్‌మిషన్‌ తదితర అంశాలను ప్రదర్శించి వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి మాట్లాడుతూ ...

Read More »

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలోని కాకతీయ నగర్‌ కాలనీలో శుక్రవారం సిసి రోడ్డు నిర్మాణ పనులను ఎంపిపి లద్దూరి మంగమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జడ్పి నిధులు 2 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌నిట్టు వెంకట్‌రావు, ఉపసర్పంచ్‌ రాజేందర్‌, జడ్పిటిసి మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »