Breaking News

పవన్‌కల్యాణ్‌ సినిమాలో ఖుష్బూ

సీనియర్‌ తార ఖుష్బూ తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఓ తెలుగు సినిమాకు సంతకం చేశారు. పవనకల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ రూపొందించనున్న సినిమాలో ఆమె నటించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా ఆమె తెలియజేశారు. ‘‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఓ తెలుగు సినిమాని చేస్తున్నానని అధికారికంగా ప్రకటిస్తున్నా. త్రివిక్రమ్‌, పవన్ కల్యాణ్‌ కలిసి చేస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రంలో చేయబోతున్నా’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ఆ సినిమా కోసం త్రివిక్రమ్‌ బ్రిలియంట్‌ స్ర్కిప్ట్‌ తయారుచేశారన్నారు. ‘‘నాది చాలా పవర్‌ఫుల్‌ కేరక్టర్‌. మెగాస్టార్‌ చిరంజీవితో నా చివరి తెలుగు సినిమా చేశాను. ఇప్పుడు ఆయన తమ్ముడితో నటించబోతున్నా. సంతోషంగా ఉంది’’ అన్నారామె. ఓ సినిమాలో నటించాలనే నిర్ణయం తీసుకోవడానికి చాలా కాలం తీసుకున్నానని ఆమె చెప్పారు. అయితే ఆమె చివరి తెలుగు చిత్రం చిరంజీవితో చేసిన ‘స్టాలిన’ (2006) కాదు. యస్‌.యస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా చేసిన ‘యమదొంగ’ (2007). అందులో ఆమె యమధర్మరాజు పాత్రధారి మోహనబాబు సతీమణి పాత్రలో కనిపించారు. దీనికామె వివరణ ఇచ్చారు. ‘‘రాజమౌళి సినిమా ‘యమదొంగ’లో నాది స్పెషల్‌ అప్పీరెన్స్ మాత్రమే. నేను షూటింగ్‌లో పాల్గొన్నది మూడు రోజులే. దాన్ని పూర్తి స్థాయి పాత్రగా లెక్కలోకి తీసుకోలేను’’ అని చెప్పారు ఖుష్బూ.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *