కామారెడ్డి, డిసెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పేర్కొంటూ కామరెడ్డి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం జాతిపిత మహాత్మాగాంది విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డులో ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. బుధవారం కామారెడ్డి జిల్లాకేంద్రంలో జరిగిన సంఘటన దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు ఒకే వాహనంపై వెళుతున్న ముగ్గురిని ఆపి చలాన్ రాస్తే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి మనుసులమని ఎస్ఐని బెదిరించారని, అదే సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి ఎస్ఐ ఆంజనేయులును దుర్బాషలాడాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే ఎస్ఐ, ఎస్‌పిలకు పోన్‌చేసి తమ బైక్ విడిపించుకున్నారని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ప్రజాప్రతినిదులే దౌర్జన్యానికి పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. ఎస్ఐని తిట్టిన రవిందర్రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కోయల్కర్ కన్నయ్య, గంగాధర్, పండ్ల రాజు, భైరయ్య, చింతల శ్రీనివాస్, ఇసాక్ షేరూ, విష్ణు, మెడికల్ రాజు, రమేశ్, నర్సింగ్, ఆరిఫ్, కోన శ్రీనివాస్, కిషన్, తదితరులున్నారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018