Breaking News

అక్రమ మైనింగ్‌ రద్దుచేయాలి

 

గాంధారి, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం చద్మల్‌ గ్రామంలో రైతులు సాగుచేస్తున్న భూమిలో అక్రమ మైనింగ్‌ అనుమతులు రద్దుచేయాలని అకిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. చద్మల్‌ గ్రామంలోని 121, 122 సర్వే నెంబర్లలో గల ప్రభుత్వ భూమిలో దాదాపు 16 నుంచి 20 మంది రైతులు పట్టాలు పొంది పండ పండించుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. ఇలాంటి భూమిలో ప్రభుత్వం ఎలాంటి పర్యావరణ అనుమతులు, గ్రామ పంచాయతీ తీర్మానం, ఫారెస్టు అనుమతులు లేకుండా శ్రీనివాస మైనింగ్‌కంపెనీకి అనుమతి ఇవ్వడాన్ని ఖండించారు. ప్రభుత్వం మైనింగ్‌ మాఫియా నుసన్నల్లో పనిచేస్తుందని, రైతుల పొట్టకొట్టే ఇటువంటి అనుమతులు రద్దుచేయాలన్నారు. రైతుల భూములను ముందుగా తీసుకున్నట్టయితే వారికి ప్రత్యామ్నాయమార్గాలు చూపించి నష్టపరిహరం చెల్లించి, అలాంటి ఎలాంటి నోటీసులు లేకుండా మైనింగ్‌కు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ మైనింగ్‌ను రద్దుచేసి రైతుల భూములు వారికే చెల్లేవిధంగా చూడాలని అఖిలపక్ష నాయకులు కోరారు. కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్‌) నాయకులు కట్ల భూమన్న, టిడిపి నాయకులు రాజులు, కాంగ్రెస్‌ నాయకులు బాలయ్య, అఖిలపక్ష నాయకులు దేవిసింగ్‌, ఎర్రం రాములు, మోతిరాంనాయక్‌, సాయిలు, తదితరులున్నారు.

Check Also

17న అవయవదాన మహాసంకల్పం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *