Daily Archives: January 11, 2017

ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయాలి

  గాంధారి ప్రజల డిమాండ్లు సరియైనవే గాంధారి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవద్దని రాజకీయ జేఏసి ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. గాంధారి మండలాన్ని కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజల ఆకాంక్ష మేరకుప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, ఎలాంటి ముసాయిదా లేకుండానేమండలాలు, డివిజన్‌లు, జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు. కొన్నిచోట్ల ఎలాంటి ప్రజాభిప్రాయం సేకరించకుండానే మండలాలను తొలగించి ...

Read More »

కామ్రేడ్‌ సాయిలు 21 వ వర్ధంతి సభ

  నందిపేట, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారత రైతుకూలీ సంఘం నందిపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సావులం సాయిలు 21వ వర్ధంతి సభ బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు కె.గంగాధర్‌ మాట్లాడుతూ కామ్రేడ్‌ సాయిలును 1996లో అర్ధరాత్రి నక్సలైట్లు అతి కిరాతకంగా గొడ్డళ్లలో నరికి చంపేశారని, సాయిలు భూస్వామి, పెట్టుబడిదారుడు కానప్పటికి ఎందుకు చంపారో సమాధానం రాలేదని అన్నారు. ప్రజానాయకులను ఈవిధంగా చంపడం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్బంగా రెండు నిమిషాలు మౌనం ...

Read More »

12న వివేకానంద విగ్రహ ఆవిష్కరణ

  నందిపేట, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని పాత పెట్రోల్‌ పంప్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించనున్నారు. నందిపేట యువకులు పార్టీలకు అతీతంగా వివేకానంద సేవాసమితి ఏర్పాటుచేసి తద్వారా విరాళాలు సేకరించి వివేకానంద విగ్రహం ఏర్పాటుచేశారు. 12 జనవరి వివేకానంద జయంతి రోజు కావడంతో విగ్రహావిష్కరణ చేయడానికి ఏర్పాట్లు చేశారు. 2015 సెప్టెంబరు 17న కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్‌ చేత భూమిపూజ చేశారు. సుమారు మూడు లక్షల ...

Read More »

క్యాన్సర్‌పై అవగాహన సదస్సు

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం రేడియేషన్‌ అంకాలజిస్టు డాక్టర్‌ సంజీవ్‌ కె.గుప్త ఆధ్వర్యంలో క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యాధికి సంబంధించి, వ్యాధికి ముందు లక్షనాలు ఎలా ఉంటాయి, దానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార పదార్థాలు,మానివేయాల్సిన ఆహారపదార్థాలు, పానీయాల గురించి సూచనలు చేశారు. దీనికి సంబంధించి కంప్యూటర్‌ద్వారా రిటైర్డ్‌ ఉద్యోగులకు వివరించారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు భద్రయ్య, అధ్యక్షుడు విఠల్‌రావు, ప్రతినిధులు ప్రతాప్‌రెడ్డి, ...

Read More »

కార్మిక చట్టాల అమలుకై ఉచిత న్యాయసేవలందిస్తాం

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మిక చట్టాల అమలుకోసం పేదవారికి ఉచిత న్యాయసేవలందిస్తామని న్యాయమూర్తి ఎం.ఎ. సలీం అన్నారు. కామారెడ్డి పట్టణంలో బుధవారం తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్మిక చట్టాలు వాటి అమలుపై జిల్లా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మిక చట్టాల అమలు జరగడం లేదని, కార్మికులకు చట్టాలపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. అందరు కార్మికులు దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. లక్షలోపు ఆదాయం కలిగిన ...

Read More »

ఘనంగా సంక్రాంతి సంబరాలు

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల్లో బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు కలిసి సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు గోదాదేవీ, రంగనాథ స్వామి వేషధారణలతో బొమ్మరిల్లు, గుడిసెలు వేశారు. పాలు పొంగించి బోడపండ్లు పోసుకున్నారు. రంగ వల్లులతో అందరిని ఆకట్టుకున్నారు. వివిధ కళాశాలలు, పాఠశాలల్లో సైతం విద్యార్థులు అందమైన రంగవల్లులు వేశారు. విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాల విశిష్టత తెలియజేసేందుకు విద్యార్థుల చేత పండగ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Read More »

కూరగాయల మార్కెట్లో స్థలం కబ్జాపై ఆందోళన

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డెయిలీ మార్కెట్లో వ్యాపారులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవడంపై కూరగాయల వ్యాపారులు గురువారం ఆందోళనకు దిగారు. తాము డెయిలీ మార్కెట్లో రోడ్లపై కూరగాయలు అమ్ముతుంటే వ్యాపారులు ఏకంగా రోడ్లను కబ్జాచేసి రేకులు, టెంట్లు వేసుకున్నారని పేర్కొన్నారు. గతంలో ఈ విషయమై బల్దియా అధికారులకు ఫిర్యాదుచేయగా నవంబర్‌ 20 లోగా రేకులు తీసివేయాలని చెప్పినా వ్యాపారులు తీసివేయలేదని, బల్దియాసిబ్బంది రేకులను తొలగించకుండా రోడ్లపై వ్యాపారంచేసుకుంటున్న తమకు సంబంధించిన తాటిపత్ర కవర్లను పీక్కెల్లారని, ...

Read More »

ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి

  గాంధారి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలని ఎపిడి సాయన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎండివో కార్యాలయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచి ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు పని వివరాలు ఆయా కూలీల జాబ్‌ కార్డుల్లో పొందుపరచాలన్నారు. ప్రతిరోజు మినిట్స్‌ రిజిష్టర్‌ను తయారుచేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా ఆయా ...

Read More »

నగదు రహితంపై అవగాహన

  గాంధారి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో పనిచేస్తున్న విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులకు బుధవారం నగదు రహితంపై అవగాహన కల్పించారు. స్థానిక తహసీల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపులు చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా, ఎటిఎంల ద్వారా కొనుగోలు చేయాలని, దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఐకెపి సిబ్బంది ఆయా గ్రామాల్లోకి వెళ్లి నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో ...

Read More »

కొనసాగుతున్న విఓఎల సమ్మె

  గాంధారి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐకెపి విఓఎల సమ్మె గాంధారి మండలంలో కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం ఎదుట ఆయా గ్రామాల విఓఎలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిస్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి విఓఎకు 15 వేల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గ్రామ స్తాయిలో మహిళా సంఘాల బలోపేతానికి విఓఎలు ఎంతో కృషి చేస్తున్నారని, తమతో వెట్టిచాకిరి చేయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. డిమాండ్లు పరిష్కరించేంత వరకు ...

Read More »

క్రికెట్‌ టోర్నిలో ఫైనల్‌కు చేరిన కెసిసి జట్టు

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 2017 క్రికెట్‌ టోర్నమెంట్‌ను నాలుగురోజుల పాటు నిర్వహించగా ఇందులో కామారెడ్డి క్రికెట్‌ క్లబ్‌ జట్టు సెమీ ఫైనల్‌కు చేరింది. 12 జట్లుటోర్నమెంట్‌లో పాల్గొనగా బుధవారం జరిగిన క్వాటర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కామారెడ్డి క్రికెట్‌ క్లబ్‌- నిజామాబాద్‌ రాయల్‌ జట్లు తలపడగా కామారెడ్డి క్రికెట్‌ క్లబ్‌ 9 పరుగుల తేడాతో నిజామాబాద్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు నిజామాబాద్‌లోని ...

Read More »

రెడ్‌క్రాస్‌ సొసైటీ మరిన్ని వైద్యసేవలందించాలి

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లారెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా ప్రజలకు మరిన్ని వైద్య సేవలందించి వారి మన్ననలుపొందాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. నూతనంగా ఎన్నికైన రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యవర్గంతో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొసైటీలో ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేసి జిల్లాకు మంచిపేరు తేవాలన్నారు. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత కామారెడ్డి జిల్లాలో మొదటిగా రెడ్‌క్రాస్‌ సొసైటీని ఏర్పాటైందని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను ...

Read More »

మిషన్‌ భగీరథ పనులు వేగవంతం చేయాలి

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గ్రిడ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం నిజాంసాగర్‌ మండలం తుంకిపల్లి తాండాలో మిషన్‌ భగీరథ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. పనుల పురోగతిపై ఇంజనీర్లతో సమీక్షించారు. తుంకిపల్లి తాండాలో నిర్మాణంలో ఉన్న బిపిటి 1500 కెఎల్‌ సామర్థ్యంగల వాటర్‌ ట్యాంకు పనులను కలెక్టర్‌ పరిశీలించారు. పనులను మే నెలాఖరు వరకు పూర్తిచేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యత లోపించకుండా ...

Read More »

జయలలిత ఆస్తులు జాతీయం చేయాలి!

మద్రాస్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని, ఆమె ఆస్తుల నిర్వహణ కోసం రిటైర్డ్‌ హైకోర్టు  జడ్జిని అడ్మినిస్ట్రేటర్‌గా నియమించాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో బుధవారం ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. గత ఏడాది డిసెంబర్‌ 5న మృతిచెందిన జయలలితకు చట్టబద్ధమైన వారసులు లేరని, తాను ప్రజల కోసం ప్రజల తరఫున పాటుపడుతున్నానని ఆమె తరచూ బహిరంగ సభలలో పేర్కొనేవారని, కాబట్టి ఆమె ఆస్తులను జాతీయం చేసేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిల్‌ కోరింది. తమిళనాడు ...

Read More »

రక్తం ఎక్కడ్నుంచి వచ్చింది?.. బాలికకు ఎమ్మెల్యే నీచ ప్రశ్నలు

పాట్నా : ఓ ఎమ్మెల్యే నీచ ప్రశ్నలతో విద్యార్థినులను కుమిలిపోయేట్లు చేశారు. ధైర్యం చెప్పాల్సిందిపోయి అసభ్య మాటలతో దాడికి దిగారు. బిహార్‌లోని హజిపూర్‌ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించింది. గుర్తుతెలియని వ్యక్తలు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ హాస్టల్ను రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్‌ఎస్‌పీ) ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ సందర్శించారు. మృతురాలి స్నేహితురాలని ఉద్దేశించి.. ‘ఆమెపై రేప్ జరిగిందని ఎలా చెప్తారు? రక్తం ఎక్కడ్నుంచి వచ్చింది’ ...

Read More »

ఏంటి ఈ కొట్లాట.. ట్విట్టర్ ఓపెన్ చేయాలంటేనే సిగ్గేస్తోంది: క్రిష్

సినిమా..సినిమాకు వేరియేషన్ చూపిస్తూ వైవిధ్యంగా తీసే దర్శకుడు క్రిష్. గమ్యం నుంచి గౌతమిపుత్ర శాతకర్ణిదాకా అతడు అనుసరించిన పంథా వేరు. తీసుకున్న కథలు, కథనాలు డిఫరెంట్. చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150, బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు సంక్రాంతి బరిలో వాడి..వేడిగా తలపడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. శాతకర్ణి ఆడియో వేడుకలో క్రిష్ చేసిన ‘ఖబడ్దార్’ వ్యాఖ్య ఎంత దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో. దీనిపై ట్విట్టర్‌లో వివరణ కూడా ఇచ్చాడు క్రిష్. ఇక, ఇటీవల తమ్మారెడ్డి ...

Read More »

‘ఘాజి’ వినాశనం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే!

నిజ సంఘటనల ఆధారంగా సినిమా రానా హీరోగా తెరకెక్కించిన సంకల్ప్ ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్  1971.. డిసెంబరు 4.. ఆనాటికి పాకిస్థాన్‌కు ఉన్న ప్రధాన జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజి మునిగిపోయిన రోజు. అది ఎలా మునిగిపోయిందో మాత్రం ఇప్పటికీ ఓ అంతుచిక్కని రహస్యమే. కానీ, దానిని నాశనం చేసి ముంచేసింది మాత్రం తామేనని భారత నేవీ సగర్వంగా ప్రకటించుకుంది. దాని కథ తెలియాలంటే.. ఇంకా కొంచెం వెనక్కి వెళ్లాల్సిందే. 1965వ సంవత్సరం.. భారత ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ఘాజితో దాడి ...

Read More »

‘ఖైదీ నంబర్ 150’ మూవీ రివ్యూ

టైటిల్ : ఖైదీ నంబర్ 150 జానర్ : మాస్ యాక్షన్ డ్రామా తారాగణం : చిరంజీవి, కాజల్, అలీ, తరుణ్ అరోరా సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : వి వి వినాయక్ నిర్మాత : రామ్ చరణ్ ఇటీవల కాలంలో టాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. తొమ్మిదిన్నరేళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించటం. తండ్రి రీ ఎంట్రీ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారటం. ...

Read More »