Daily Archives: January 16, 2017

వైభవంగా శివసహస్ర స్తోత్ర పారాయణం

  కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి శివారులోగల ఇల్చిపూర్‌ గ్రామంలో నెలకొల్పిన సరస్వతి మహాక్షేత్రంలో సోమవారం శివసహస్ర నామ స్తోత్ర పారాయణం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ధర్మజ్యోతి స్వచ్చంద ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు కేదార్‌నాథ్‌ శర్మ గురూజీ ఆధ్వర్యంలో సోమవారం సాయంకాలం స్తోత్ర పారాయణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపూజలు నిర్వహించారు. శివ నామాన్ని జపించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు విఠల్‌ పటేల్‌, కమిటీ సభ్యులు సిద్దాగౌడ్‌, అర్చకులు జితేందర్‌ శర్మ, ప్రసాద్‌ ...

Read More »

మురికి కాలువ నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డువిద్యనగర్‌ కాలనీలో చేపడుతున్న మురికి కాలువ నిర్మాణ పనులను సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు 4 లక్షల వ్యయంతో మురికి కాలువ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టరును ఆదేశించారు. కార్యక్రమంలో ఎ.ఇ.లు గంగాధర్‌,జగన్నాథం, వార్డు కౌన్సిలర్‌ రాధిక, నాయకులు సల్ల అశోక్‌, శివరాజు, నర్సింలు, కిషన్‌,రాములు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉపాధి కూలీలకు వేతనాల పంపిణీ

  నిజాంసాగర్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని 17 గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కింద పనిచేసిన కూలీ డబ్బులు రూ. 12 లక్షల 55 వేలు మంజూరయ్యాయని ఇజిఎస్‌ ఎపిఓ సుదర్శన్‌ తెలిపారు. హరితహారం పథకం కింద నాటిన మొక్కలు, ఇంకుడు గుంతలు, పంట కాలువలకు సంబందించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు డిపిఎం రజిత బయోమెట్రిక్‌ విధానం ద్వారా కూలీ డబ్బులు పంపిణీ చేశారు. ...

Read More »

కొనసాగుతున్న నీటి విడుదల

  నిజాంసాగర్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఆయకట్టు కింద పంటలు సాగుచేసుకుంటున్న రైతులకోసం సాగర్‌ నుంచి నీటివిడుదల పెంచారు.ఈనెల 5న 1200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతుల అవసరాల మేరకు ఈనెల 10వతేదీ నుంచి 1600 క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం 1750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు డిఇ దత్తాత్రి తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

Read More »

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయాలి

  – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యురాలు పశ్యపద్మ కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల రెండవ ప్యాకేజీ పనులను, లెండి ప్రాజెక్టు పనులను ప్రబుత్వం వెంటనే పూర్తిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యురాలు పశ్యపద్మ డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో సోమవారం నిర్వహించిన సిపిఐ జిల్లా కౌన్సిల్‌ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 22 ప్యాకేజీ పనులనునిలిపివేయడంతో పంట పొలాలకు నీరు లేక, రైతులు పంటలు పండించలేక ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి

  ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబీకుల ఆందోళన కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి వైద్యం అందక ఆడపిల్లకు జన్మనిచ్చి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మహిళ మృతికి వైద్య సిబ్బందేకారణమంటూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌కు చెందిన కోనేటి భాగ్య (23) అనే మహిళ ప్రసవం ...

Read More »

కలెక్టరేట్‌ ఎదుట మహిళ ఆత్మహత్య యత్నం

  – అత్తారింటి వేధింపులే కారణం కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజావాణి జరుగుతున్న సమయంలో ఓ మహిళ కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. గమనించిన కలెక్టరేట్‌ సిబ్బంది ఆమెను అడ్డుకొని కలెక్టర్‌ సత్యనారాయణ వద్దకు తీసుకెళ్లారు. అనిత అనే బాధిత మహిళ కథనం ప్రకారం ఆమెకు 2006లో కామారెడ్డి మండలం ఇస్రోజివాడకు చెందిన మక్కల వ్యాపారి గంగాదర్‌రావుతో వివాహం జరిగింది. వారికి 9 సంవత్సరాల కూతురు స్పందన, ...

Read More »

పెన్‌డౌన్‌ సమ్మె కొనసాగిస్తాం

  మోర్తాడ్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిఆర్‌డిఎ పిడిని సస్పెండ్‌ చేసేవరకు ఐకెపి ఆద్వర్యంలో పెన్‌డౌన్‌ సమ్మె కొనసాగిస్తామని భీమ్‌గల్‌ ఏరియా కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం 5వ రోజు మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, వేల్పూర్‌, భీమ్‌గల్‌ మండలాల్లోగల ఐకెపి సిబ్బంది పెన్‌డౌన్‌ సమ్మె కొనసాగించారని వారు తెలిపారు. ఐకెపి సిబ్బందిపై జిల్లా అధికారుల ఒత్తిడి మానుకోవాలని, అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రస్థాయిలోనే మహిళా సాధికారతలో ఐకెపి అగ్రస్థానంలో నిలిపామని, అంతేగాకుండా ...

Read More »

చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడాలి

  మోర్తాడ్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దొన్కల్‌ గ్రామంలోగల చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి తొలగించి కాపాడాలని సహకార సంఘానికి చెందిన గ్రామస్తులు తహసీల్‌ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌కు అందజేశారు. గత వారంరోజుల క్రితం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రబీ సీజన్‌ పంటలపై నవాబు ఎత్తిపోతల ద్వారా చెరువులను నింపేందుకు నీరందిస్తున్నారని, తమ గ్రామానికి చెందిన ఓ కబ్జాదారు ఎర్రకుంటను కబ్జాచేశారని, అంతేగాకుండా ...

Read More »

ఒడ్యాట్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం

  మోర్తాడ్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మాడల్‌ గ్రామంగా ఎంపికైన ఒడ్యాట్‌ గ్రామంలో జాతీయ సేవా పథకం కింద మోర్తాడ్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో సర్పంచ్‌ నాగం పోశన్న అధ్యక్షతన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో కో ఆర్డినేటర్‌ డి.కె.రాజు, ప్రిన్సిపాల్‌ పెద్దన్నలు మాట్లాడారు. గతంలో తమ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో పుష్కరాలలో భక్తులకు సేవలందించారన్నారు. మోర్తాడ్‌ గ్రామంలో వారంరోజుల పాటుస్వచ్చభారత్‌, తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారని, అదేవిధంగా శీతాకాల ...

Read More »

పంచాయతీ బిల్లులు వందశాతం వసూలు చేయాలి

  బీర్కూర్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో గల గ్రామ పంచాయతీల్లో ఇంటి, నల్లా బిల్లులు వంద శాతం వసూలు చేసేలా పంచాయతీ కార్యదర్శులు ప్రణాళికలు సిద్దం చేయాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని మండల అభివృద్ది కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్యంపై ప్రతి ఒక్కరు శ్రద్ద వహించాలని, ఇంటి, నల్లా బిల్లులు వసూలు చేయాలని, మరుగుదొడ్ల నిర్మాణంలో లబ్దిదారులకు ప్రేరేపించాలని ...

Read More »

నా పొలం నాకు ఇప్పించండి సారూ…

  బీర్కూర్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో సోమవారం తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఓ ఫిర్యాదు వచ్చినట్టు నయాబ్‌ తహసీల్దార్‌ హేమలత తెలిపారు. కంశెట్‌పల్లి గ్రామనికి చెందిన మన్నె నర్సింలు తనకు 168/20 సర్వేనెంబరుపై నసురుల్లాబాద్‌లో నాలుగు ఎకరాల పొలం ఉందని, ఇట్టిపొలాన్ని గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నానని, ప్రస్తుతం అట్టి పొలాన్ని తన ఆధీనంలోలేదని, తహసీల్లు తానే చెల్లిస్తున్నానని, తన పొలం తనకు ఇప్పించాల్సిందిగా ప్రజావాణిలో పిర్యాదు చేశాడు. సంబంధిత విఆర్వో ద్వారా ...

Read More »

గుర్తు తెలియని మహిళ శవం లభ్యం

  బీర్కూర్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బీరాపూర్‌ గ్రామ ప్రధాన పంట కాలువలో సోమవారం ఉదయం గుర్తు తెలియని మహిళ శవం కొట్టుకువచ్చినట్టు ఏఎస్‌ఐ మజీద్‌ఖాన్‌ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… నిజాంసాగర్‌ ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటర్‌ 25 కాలువ మీదుగా 50 సంవత్సరాల మహిళ కాలువలో కొట్టుకు వచ్చిందని, బీరాపూర్‌ శివారు ప్రాంతంలో స్థానికులు గుర్తించి సమాచారం అందించారన్నారు. కాగా మహిళ రెండు చేతులకు వెండి గాజులున్నాయని, శవం కుల్లిపోయి ఉందని, రెండుమూడురోజుల క్రితం ...

Read More »