Daily Archives: January 23, 2017

రోడ్డు భద్రతపై ఎస్‌ఆర్‌కె విద్యార్థుల ర్యాలీ

  కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు బద్రతా వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి ఎస్‌ఆర్‌కె డిగ్రీ కళాశాల విద్యార్థులు సోమవారం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ర్యాలీని పట్టణ సిఐ శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణించేటపుడు ప్రతి ఒక్కరు హెల్మెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే బాద్యత నేటియువతరంపై ఉందన్నారు. అనంతరం విద్యార్థులు ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని నినాదాలతో అవగాహన ర్యాలీ చేపట్టారు. ...

Read More »

డయల్‌యువర్‌ ఎస్పీకి 7 ఫిర్యాదులు

  కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్పీలో ప్రజలనుంచి 7 ఫిర్యాదులు అందినట్టు కామారెడ్డి ఎస్పీ శ్వేత తెలిపారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు డయల్‌ యువర్‌ ఎస్పీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. కామారెడ్డి పట్టణం -2, దేవునిపల్లి, మాచారెడ్డి, గాంధారి, పిట్లం, బిచ్కుంద నుంచి ఒక్కో ఫిర్యాదు అందినట్టు తెలిపారు. సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు పిర్యాదులకు సంబంధించి సమాచారం ...

Read More »

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌నిబందనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీసు, రవాణా శాఖ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. సోమవారం నిర్వహించిన ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ద్విచక్ర వాహనచోదకుడు తప్పకుండా విధిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లు ...

Read More »

బీడీ కార్మికుల సమస్యలపై వినతి

  కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల సమస్యలు పరిస్కరించాలని నూతన బీడీ కార్మికుల సంఘం ఆద్వర్యంలో సోమవారం లేబర్‌ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి శివంగి సత్యం మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని బీడీ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్న అందరికి చేతినిండా పని కల్పించాలని, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నాన్‌పిఎఫ్‌ కార్మికులకు పిఎఫ్‌ నెంబర్లు ఇప్పించాలని, కార్మికులందరికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు, కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని ...

Read More »

అభివృద్ది పనులు ప్రారంభం

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 22వ వార్డు ఇస్లాంపురలో మురికి కాలువ నిర్మాణం పనులను సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 14వఆర్థిక సంఘం నిధులు రూ. 2 లక్షల వ్యయంతో మురికి కాలువల నిర్మాణం పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ సయ్యద్‌, నాయకులు అన్వర్‌ పాషా, నారాయణ, సతీష్‌, విక్రమ్‌, మహ్మద్‌, ఎజాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

శారదాదేవి ఆలయంలో కమలానంద భారతి స్వామిజీ పూజలు

  కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి హౌజింగ్‌ బోర్డు కాలనీలోని శ్రీశారదా దేవి ఆలయాన్ని సోమవారం కమలానంద భారతీ తీర్థ మహాస్వామి సందర్శించారు. గణపతి, అభయాంజనేయ, శ్రీశారద, ఆదిశంకరాచార్యుల ఆలయాలను సందర్శించారు. ఆలయాల్లో ప్రత్యేకపూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం ప్రపంచంలోనే గొప్పదన్నారు. 84 లక్షల జీవరాశులకు లేని జ్ఞానం మానవునికి భగవంతుడు ప్రసాదించాడని చెప్పారు. ఫిబ్రవరి 7వతేదీన వసంతి పంచమి సందర్బంగా అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించాలని భక్తులకు ...

Read More »

సాగర్‌ ద్వారా నీటి విడుదల

  నిజాంసాగర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు హెర్సులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి అనుసందానంగా ఉన్న జల విద్యుత్‌ కేంద్రం రెండు గేట్ల ద్వారా 1750 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు డిప్యూటి డిఇ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద యాసంగి రైతులు పంటలు వేసుకునేందుకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ల వద్ద నీటిపారుదల శాఖ సిబ్బంది, గ్రామ రెవెన్యూ సహాయకులను భద్రతగా నియమించడం జరిగిందన్నారు. నీరు వృధాకాకుండా పొదుపుగా ...

Read More »

ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

  కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు ఆయా ప్రజాసంఘాలు, పార్టీలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సుభాష్‌ రోడ్డులోగల నేతాజీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతాజీ లాంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోదుల త్యాగాల ఫలితంగానే నేడు స్వాతంత్య్ర దేశంలో మనం స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నామన్నారు. నేతాజీ తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ...

Read More »

స్నేహితుని జ్ఞాపకార్థం క్రికెట్‌ టోర్నమెంట్‌

  నిజాంసాగర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తోటి స్నేహితుని జ్ఞాపకార్థం విద్యార్థులు క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించారు. మండలంలోని మహ్మద్‌నగర్‌ జడ్పిహెచ్‌ఎస్‌లో 10వ తరగతి చదువుతున్న ప్రశాంత్‌ అనే విద్యార్థి ఈనెల 4వ తేదీన కడుపునొప్పి భరించలేక మృతి చెందాడు. ప్రశాంత్‌ జ్ఞాపకార్థం తోటి విద్యార్థులు క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించి విజేతలకు 26 జనవరి గణతంత్ర దినోత్సవం రోజు బహుమంతి ప్రదానంచేస్తామని తెలిపారు. మొదటి జట్టుకు రూ. 1000 నగదు, రన్నర్‌కు రూ. 500 నగదు అందజేయనున్నట్టు విద్యార్థులు తెలిపారు.

Read More »

రహదారి పనులు ప్రారంభం

  నిజాంసాగర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్వా గ్రామం శివారునుంచి బండలింగేశ్వర ఆలయం వరకు మొరం రోడ్డు పనులు సర్పంచ్‌అనసూయ సోమవారం ప్రారంభించారు. గ్రామం నుంచి ఆలయం వరకు రహదారి అద్వాన్నంగా మారడంతో ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మొరం పనులకు 3 లక్షల నిదులను మంజూరు చేశారు. కంకర రోడ్డు కావడంతో ఎమ్మెల్యేకు విన్నవించడంతో నిధులుమంజూరు చేశారని హర్షం వ్యక్తంచేస్తున్నారు. పనులు త్వరలోనే పూర్తిచేస్తామని సర్పంచ్‌ అన్నారు. కార్యక్రమంలో మండల తెరాస అధ్యక్షుడు నర్సింలు, సుదర్శన్‌రావు, రాంచందర్‌ ఉన్నారు.

Read More »

పోలియో రహిత గాంధారిని నిర్మిద్దాం

  గాంధారి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో రహిత మండలంగా గాంధారిని మొదటి స్తానంలో నిలుపుదామని తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మన్‌ అన్నారు. సోమవారం తహసీల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల టాస్క్‌ఫోర్సు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 29వ తేదీన పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రతి ఒక్కరు 0-5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ప్రచారానికి 27న మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మండలంలో ఆరుమార్గాల్లో 48 బూత్‌లను ఏర్పాటు చేసినట్టు వైద్యాధికారి వీరేందర్‌ తెలిపారు. ...

Read More »

ప్రారంభమైన పండరిపూర్‌ యాత్ర

  గాంధారి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి నుంచి పండరిపూర్‌ వరకు చేపట్టిన పాదయాత్ర సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక విఠలేశ్వర్‌ వద్ద గాంధారి విడిసి ఆధ్వర్యంలో ముదెల్లి బాల్‌రాజ్‌గౌడ్‌ మహరాజ్‌ సమక్షంలో పండరిపూర్‌ వరకు పాదయాత్రగా భక్తులు బయల్దేరారు. ప్రారంభం సందర్భంగా మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ మార్కెట్‌కమిటీ ఛైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, భరత్‌ భూషణ్‌ జోషి, విడిసి ఛైర్మన్‌ గంగరాజయ్యలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 13 రోజుల పాటు పండరిపూర్‌ వరకు ...

Read More »

డిమాండ్లు పరిష్కరించాలని విఓఎల సమ్మె

  గాంధారి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఐకెపి విఓఎలు చేపడుతున్న నిరవధిక సమ్మె సోమవారం నాటికి 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మండలానికి చెందిన విఓఎలు స్థానిక మహిళా శక్తి భవనంలో ఎపిఎం గంగరాజు, మండల మహిలా సమాఖ్యలకు వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం విఓఎలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 15వేల జీవన భృతి కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ...

Read More »

ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం

  బీర్కూర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌, బీర్కూర్‌లలో సోమవారం ఆయా తహసీల్దార్లు కృష్నానాయక్‌, డేవిడ్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు ఆయా మండలాల లబ్దిదారులు ప్రజావాణి ద్వారా సమస్యలు పరిస్కరించుకోవాల్సిందిగా సూచించారు. ప్రజావాణిలో సమస్యల పరంగా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారానికి దారి చూపుతామని తహసీల్దార్లు తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం ప్రజల శ్రేయస్సు కొరకు మండల స్థాయిలో ...

Read More »

గణతంత్ర వేడుకల సందర్భంగా క్రీడాపోటీలు

  బీర్కూర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 26 జనవరి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నసురుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లోగల పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. కబడ్డి, ఖోఖో, వ్యాసరచన, వాలీబాల్‌, డ్రాయింగ్‌ లాంటి పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు గణతంత్ర దినోత్సవం రోజు బహుమతి ప్రదానం చేయనున్నారు.

Read More »

ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

  బీర్కూర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో సోమవారం నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అతివాదుల్లో ప్రముఖ పాత్ర పోషించారని, దేశం కోసం ప్రాణం సైతం లెక్కచేయకుండా పోరాడారని నేతాజీని కొనియాడారు. పోరాటం ద్వారానే స్వేచ్చ లభిస్తుందని నమ్మిన వ్యక్తి అని, ఆయన సిద్ధాంతాలు ప్రస్తుత సమాజానికి సరిపోయేవిధంగా ఉన్నాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ఉపాధి హామీ కూలీలు పనికిరాకుంటే జాబ్‌కార్డులు తొలగిస్తాం

  మోర్తాడ్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకంకింద జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పనులు కల్పించడం జరిగిందని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌, ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు. మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో నోడల్‌, క్లస్టర్‌ అధికారులతో ఉపాధి హామీ, హరితహారం, మరుగుదొడ్ల పనులపైసమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ కింద ఫీడర్‌ చానల్‌ పనులు, హరితహారం కింద మొక్కలకు నీరు పోసే పనులు కల్పిస్తున్నామని జాబ్‌ ...

Read More »

విద్యార్థులకు ముగ్గులు, వ్యాసరచన పోటీలు

  మోర్తాడ్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచనపై , కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిలకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు. ఈనెల 28వ తేదీన రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన, పలు పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐలు నర్సయ్య, బీమయ్య, ప్రిన్సిపాల్‌ స్వప్న, ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరు

  మోర్తాడ్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఐకెపి ఆధ్వర్యంలో 1136 మంది విద్యార్థులకు అభయహస్తం, ఆమ్‌ఆద్మీ స్కాలర్‌షిప్‌లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఐకెపి ఎపిఎం ప్రమీల సోమవారం తెలిపారు. 2014-15 సంవత్సరానికి గాను ఒక్కో విద్యార్తికి 1200 రూపాయల చొప్పున మొత్తం 13 లక్షల 63 వేల 200 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇట్టి డబ్బును విద్యార్థుల ఖాతాల్లోగాని, వారి తల్లిదండ్రుల కాతాల్లోగాని నేరుగా జమచేస్తామని తెలిపారు.

Read More »

‘జల్లికట్టు’బాటు!

చెన్నయ్‌ మెరీనా బీచ్‌లో వేలాదిమంది యువతీయువకులు చలికీ ఎండకీ సముద్రపు గాలికీ వెరవకుండా నాలుగురోజులుగా భీష్మించుకు కూర్చున్న దృశ్యం అద్భుతంగా ఉన్నది. నచ్చినవారు మాట్లాడుతుంటే మెచ్చినవారు చప్పట్లు కొడుతుంటే, ఉద్వేగం తప్ప ఏ మాత్రం ఉద్రిక్తత లేని ఆ వాతావరణం చూస్తుంటే ముచ్చటేస్తున్నది. ప్రజాసమస్యల మీద పదిమంది ఒక్కచోటచేరితే శాంతిభద్రతలంటూ లాఠీ విదిలించే పాలకులు ఈ దృశ్యం చూసి ఏమనుకుంటున్నారో? వేలమంది చేరినా అక్కడ ఏ ఉత్పాతమూ సంభవించలేదు. అంటువ్యాధులు సోకలేదు. కుర్రకారు ఎప్పటికప్పుడు రోడ్లనూ తీరాన్నీ శుభ్రపరుస్తూ గతంలో కంటే శుభ్రంగా కాపాడుతున్నారు. ...

Read More »