Breaking News

Daily Archives: January 26, 2017

శుక్రవారం చిలుకల చిన్నమ్మ జాతర

  నందిపేట, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామంలో శుక్రవారం చిలుకల చిన్నమ్మ జాతర నిర్వహిస్తున్నట్టు గ్రామ విడిసి సభ్యులు తెలిపారు. జాతర సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయం చుట్టు శుభ్రం చేసి అందంగా ముస్తాబు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు.

Read More »

ఘనంగా గణతంత్ర వేడుకలు

  గాంధారి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతోపాటు 19 గ్రామ పంచాయతీల్లో ప్రజలు వేడుకలు ఘనంగా జరుపుకొని జాతీయ జెండా ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద నెహ్రూ యువజన సంఘం, తెరాస, కాంగ్రెస్‌, టిడిపి, యువజనసంఘాల ఆద్వర్యంలో జాతీయజెండా ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్‌ సత్యం, తెరాస ఆధ్వర్యంలో శివాజీరావు, కాంగ్రెస్‌ ఆద్వర్యంలో ...

Read More »

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

  నిజాంసాగర్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఎం.ఎ.అబ్దుల్‌ గనిఖాన్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపిడివో కార్యాలయంలో ఎంపిపి సునంద, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ అంతిరెడ్డి, పశువైద్య శాఖ కార్యాలయంలో వెటర్నరీ అదికారి సయ్యద్‌ యూనుస్‌, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారిణి స్పందన, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాద్యాయుడు వెంకటేశ్వర్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం గణతంత్ర వేడుకల సందర్భంగా ...

Read More »

నర్సింగాపూర్‌లో సరస్వతి విగ్రహ ఆవిష్కరణ

  డిచ్‌పల్లి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామంలో గురువారం చదువులతల్లి సరస్వతి విగ్రహాన్ని సర్పంచ్‌ సువర్ణ, అత్తమామలు గంగారాం, లక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సర్పంచ్‌ సువర్ణ, మురళి దంపతులు విగ్రహాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ పాఠశాలలో సరస్వతి విగ్రహ ఏర్పాటుచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కవిత, ఎంపిటిసి లక్ష్మి, ...

Read More »

ఉన్నత విద్యలో నాణ్యత కీలకం

  – తెవివి విసి ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఉన్నత విద్యలో నాణ్యత కీలకమైందని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య స్పష్టం చేశారు. గురువారం 68వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్సిటీ పరిపాలనా భవనం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు 26 జనవరి దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగిన విషయమన్నారు. ...

Read More »

వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

  మోర్తాడ్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీల ముందు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, తహసీల్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడివో శ్రీనివాస్‌, విద్యావనరుల కేంద్రంలో ఎంఇవో రాజేశ్వర్‌, ఐకెపి, ఇజిఎస్‌, భవిత, వ్యవసాయ కార్యాలయాల వద్ద ఎంపిపి కల్లడ చిన్నయ్య, పశు వైద్య కార్యాలయంలో డాక్టర్‌ గంగాప్రసాద్‌, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ అశోక్‌రెడ్డి, ఎక్సైజ్‌ కార్యాలయంలో సిఐ సహదేవుడు, సొసైటీ భవనం ముందు ఛైర్మన్‌ ఎలాల ...

Read More »

శుక్రవారం రామన్నపేట్‌లో రాజరాజేశ్వరస్వామి జాతర

  మోర్తాడ్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రామన్నపేట గ్రామ శివారులోగల రాజరాజేశ్వర స్వామి ఆలయ జాతర శుక్రవారం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ, విడిసి సభ్యులు తెలిపారు. జాతరకు వివిధ జిల్లాల నుంచి భక్తులు విచ్చేస్తారని, ఆలయం వరకు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. జాతర సందర్భంగా శ్రీవారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో మహిళలు మంగళహారతులతో, భజనలు, కీర్తనలతో ఊరేగిస్తారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానంతో పాటు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు వారు ...

Read More »

సైనికులకు సన్మానం

  నందిపేట, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని ఐలాపూర్‌ గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ మీసాల సుదర్శన్‌ జెండా ఎగురవేసి వందనం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఐలాపూర్‌ గ్రామానికి చెందినవారు దేశ రక్షణ కోసం సైన్యంలో ఉన్నవారిని శాలువాలతో సత్కరించారు. గ్రామం నుంచి ఎక్కువ మంది సైనికులు ఆర్మీలో ఉండడం విశేషమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ ...

Read More »

ఘనంగా గణతంత్ర దినోత్సవం

  నందిపేట, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవం సందర్బంగా గురువారం నందిపేట మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఉమాకాంత్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడివో నాగవర్ధన్‌, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ జాన్‌రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌ రాజ్‌కుమార్‌ త్రివర్ణ పతాకాలు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల, సూర్యోదయ, ...

Read More »

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

  బీర్కూర్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారులు, ప్రజాప్రతినిదులు, పాఠశాలల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. మండలాల్లోని ఆయా గ్రామాల్లో పాఠశాల విద్యార్థులచే గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ సమైక్యతా నినాదాలతో ర్యాలీలు చేపట్టారు. అనంతరం ఆయా పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. బీర్కూర్‌ తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కృష్ణానాయక్‌, నసురుల్లాబాద్‌ తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ డేవిద్‌, బీర్కూర్‌ ఠాణాలో ఏఎస్‌ఐ మజీద్‌ఖాన్‌, నసురుల్లాబాద్‌ ...

Read More »

ఈనెల 31 ఓయు బ్యాక్‌లాగ్‌ పరీక్ష ఫీజుకు చివరితేది

  బీర్కూర్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ బిఎ, బికాం, బిఎస్సీ బ్యాక్‌లాగ్‌ పరీక్షల కోసం ఈనెల 31వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.రామసుబ్బారెడ్డి తెలిపారు. అదేవిధంగా రూ. 100 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 6వ తేదీ వరకు అవకాశముందన్నారు. 2008-09 సంవత్సరం, అంతకుముందు సంవత్సరంలో అడ్మిషన్‌ అయిన విద్యార్థులు మామూలు పరీక్ష ఫీజునకు అదనంగా ఒక్కో పేపరుకు రూ. 1000 చొప్పున చెల్లించి చివరి ...

Read More »

ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడి వృద్ధురాలి మృతి

  బీర్కూర్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని నాచుపల్లి గ్రామంలోగల డి-25 కెనాల్‌లో ప్రమాదవశాత్తు మహిళ పడి మృతి చెందిందని నాచుపల్లి పరిసర ప్రాంతాల్లో కాలువపై శవం వస్తుండగా రైతులు గమనించి సమాచారం అందించారని ఎస్‌ఐ గోపి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… మృతురాలు మైలారం గ్రామానికి చెందిన మిద్దింటి పోచవ్వ (90)గా గుర్తించారు. మృతురాలు యాచకురాలిగా జీవనం సాగిస్తుండేదని కుటుంబీకులు తెలిపారన్నారు. కాగా మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శవాన్ని పోస్టుమార్టం చేసి కేసు నమోదు ...

Read More »

‘హోదా’ ప్రదర్శనకు సినీ ప్రముఖుల మద్దతు

రాజమౌళి, రానా సహా పలువురు యువహీరోల ట్వీట్లు  హీరో విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు.. అతడిపై ఫిర్యాదు   ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం యువత చేపడుతున్న మౌనప్రదర్శనకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, హీరో రానా సహా పలువురు సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ‘హింస కన్నా మౌన ప్రదర్శన మేలు’ అనే పోస్టర్‌ను రాజమౌళి, రానా ట్విటర్‌ అకౌంట్లలో పోస్ట్‌ చేశారు. అలాగే.. యువహీరోలు సందీప్‌ కిషన్‌, సాయిధరమ్‌ తేజ్‌, తనీష్‌, ‘బర్నింగ్‌స్టార్‌’ సంపూర్ణేష్‌ బాబు కూడా తమ మద్దతు ప్రకటించారు. మరోవైపు..హీరో మంచు విష్ణు ...

Read More »

పవన్‌పై వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్

మెగా ఫ్యామిలీపై తరచుగా కామెంట్లు చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈసారి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌పై ట్వీట్ చేశాడు. పవన్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ నిజమైన హీరో అని తనశైలికి భిన్నంగా డైరెక్టర్ వర్మ సోషల్ మీడియాలో స్పందించాడు. ప్రజల సమస్యలపై సినిమాలతో పాటు బయట కూడా పోరాటం కొనసాగిస్తున్నందున ప్రపంచలోనే రియల్ హీరో పవన్ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు వర్మ. యువత ఇప్పుడు హోదా అంశాన్ని సీరియస్ అంశంగా తీసుకుంటే, భవిష్యత్తు తరాల్లో ఇలాంటి నీచ ...

Read More »

దేశాన్ని విభజించండి: మంచు విష్ణు

హీరో విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు.. అతడిపై ఫిర్యాదు  ‘‘శాంతియుత పోరాటం వల్లనే స్వాతంత్య్రం వచ్చిందన్న సంగతి జల్లికట్టు పోరాటం మనకు గుర్తుచేస్తోంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంది. మనకు మాత్రం ఉత్తరాది నుంచి సరైన గుర్తింపు రావట్లేదు. అలాంటప్పుడు కలిసి ఉంటే ఏం లాభం? కాబట్టి దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాలను రెండు వేర్వేరు దేశాలుగా విడగొట్టేస్తే బాగుంటుంది’ అని విష్ణు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు భారత ...

Read More »

మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం

హైదరాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారాన్ని నడిపిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు నగర పోలీసులు. నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్ పరిధి మధురానగర్‌లో గ్రీన్‌స్పా మసాజ్‌ సెంటర్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read More »

ఆపితే యుద్ధమే!: పవన్‌ కల్యాణ్‌

 ‘‘ఆంధ్రులు ఈ దేశ పౌరులు. కేంద్రానికి బానిసలు కాదు’’ అని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘‘హోదా కోసం గురువారం విశాఖ ఆర్కే బీచ్‌లో తలపెట్టిన శాంతియుత నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపితే… హక్కుల కోసం ఆంధ్రులు చేసే దీర్ఘకాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఎప్పుడు సహకరించాలో, ఎప్పుడు ఎదురు తిరగాలో జనసేనకు బాగా తెలుసు’’ అని హెచ్చరించారు. ‘జల్లికట్టుకు, హోదాకు సంబంధం ఏమిటి’ అని పలువురు నేతలు అడగడంపై స్పందిస్తూ..‘‘సంప్రదాయం కోసం తమిళులు అంత పోరాటం ...

Read More »

వేడిపుట్టిస్తున్న పవన్ ట్వీట్లు.. తాజాగా మరొకటి!

హైదరాబాద్: ప్రత్యేక హోదా పోరాటంపై ఉదయం నుంచి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నజనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరో ట్వీట్ చేశారు. పాలకుల నిర్లక్ష్యానికి ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు, పాలకవర్గాలు యాభై ఏళ్లుగా ఆయా పార్టీల ప్రయోజనాల కోసం చేసిన స్వార్థపూరిత కుట్రలకి ఏ తప్పూ చేయని ప్రజలు ద్వేషంతో విడిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నిర్లక్ష్యపూరిత విభజన పద్ధతికి వచ్చిన నష్టాలను అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రజలు నష్టాలను అనుభవిస్తున్నారని ...

Read More »

రద్దైన పెద్ద నోట్ల జమకు మరో అవకాశం

న్యూఢిల్లీ: రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్ల జమకు ఆర్బీఐ మరో అవకాశం ఇవ్వవచ్చని ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ప్రధాని మోదీ గత ఏడాది నవంబర్ 8 నుంచి పెద్ద నోట్లు చెలామణి కావని ప్రకటించారు. రద్దు చేసిన నోట్లు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసేందుకు ఇచ్చిన గడువు డిసెంబర్ 30తో ముగిసింది. ఆర్బీఐ శాఖల్లో జమకు 2017 మార్చి 31 వరకు అవకాశం ఉంది. కాగా కొంత మంది ఎక్కడెక్కడో దాచి మరిచిపోయిన పాత రూ.1000, రూ.500 నోట్లు గడువు తర్వాత ...

Read More »