Daily Archives: January 30, 2017

టివియువి శిక్షణ సదస్సు గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక టివియువి సదస్సుకు సంబంధించిన గోడప్రతులను సోమవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర ఉపాధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్‌యాదవ్‌, రజనీకాంత్‌లు మాట్లాడుతూ ఫిబ్రవరి 4న టివియువి ఆధ్వర్యంలో ఓయులో శిక్షణ సదస్సు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ఆచార్య కోదండరాం హాజరవుతారని తెలిపారు. సదస్సులో రాష్ట్ర అభివృద్దిలో విద్యార్థుల పాత్ర, నిరుద్యోగ సమస్య, విద్యార్థి ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, యూనివర్సిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం తదితర వాటిపై చర్చిస్తామన్నారు. ...

Read More »

కామారెడ్డి ఉపాధ్యాయునికి ఉత్తమ అవార్డు

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని భవిత పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రభుకు ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తెలంగాణ ప్రయివేటు లెక్చరర్ల అసోసియేషన్‌, శ్రీనివాస రామానుజన్‌ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అబ్దుల్‌ కలాం పేరిట పురస్కారాలు అందజేస్తున్నారు. ఈపురస్కారం తనకు లభించడం పట్ల ...

Read More »

ఘనంగా మార్కండేయుని జయంతి

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రుషి మార్కండేయ జయంతి వేడుకలు పద్మశాలీలు ఘనంగా నిర్వహించారు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్నేహ పురి కాలనీలోగల మార్కండేయ ఆలయ ప్రాంగణంలోఉత్సవాలు జరిపారు.ఈ సందర్భంగా గాయత్రీ యజ్ఞం నిర్వహించారు. పద్మశాలీ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం మహిళా సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వేరు వేరు విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పసుపుబొట్టు కార్యక్రమం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ...

Read More »

మహాత్మునికి ఘన నివాళి

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో సోమవారం మహాత్మాగాంధీ 69వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పాఠశాలలో గాంధీజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో కలెక్టర్‌ సత్యనారాయణతోపాటు జేసి సత్తయ్య, డిఆర్వో మణిమాల ఇతర అధికారులు గాంధీజి చిత్రపటానికి పూలమాలలువేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఉప్పు ...

Read More »

యువకుని ఆత్మహత్య

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన నంగునూరి ఆనంద్‌కుమార్‌ (31) అనే యువకుడు మానసిక వేదనతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్టు పట్టణ ఎస్‌ఐ శోభన్‌ తెలిపారు. ఆనంద్‌ కొన్నేళ్ళుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడన్నారు. ఆర్థికంగా నిలబడలేకపోవడం, వ్యాపారంలో నష్టం రావడంతో ఇటీవల మెడికల్‌ ఏజెన్సీలో చేరాడు. అయినా కూడా ఆర్థిక పరిస్థితి కుదుట పడకపోవడంతో మరింత మానసిక వేదనకు గురయ్యాడు. ఇటీవలే మానసిక వైద్యున్ని సంప్రదించినట్టు కుటుంబీకులు తెలిపారు. సోమవారం ఉదయం ఎవరు లేనిసమయంలో ...

Read More »

మహాత్మునికి ఘన నివాళి

  గాంధారి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతిపిత మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా ఆయనకు గాంధారి మండలప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ కార్యాలయంలో సదాశివనగర్‌ సిఐ శ్రీశైలం, ఎస్‌ఐ రాజేశ్‌, పోలీసులు ఉదయం 11 గంటలకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం గాంధీజి విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా అన్ని ప్రబుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది బాపూజీ వర్ధంతి సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ...

Read More »

ప్రమాదస్థలాన్ని పరిశీలించిన సిఐ

  గాంధారి జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం బూర్గుల్‌ గ్రామం వద్ద ఇటీవల జరిగిన ప్రమాదస్థలాన్ని సదాశివనగర్‌ సిఐ శ్రీశైలం సోమవారం పరిశీలించారు. ఇటీవల బూర్గుల్‌ గ్రామ శివారులో రోడ్డుపై ఐచర్‌ వాహనం వేగంగా వెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఢీకొందని దీనిపై కేసు నమోదుకాగా స్థానిక ఎస్‌ఐ రాజేశ్‌ గ్రామస్తులతో కలిసి సంఘటన స్థలాన్ని సిఐ పరిశీలించారు. వారి వెంట ఆర్‌అండ్‌బి అధికారులు తదితరులున్నారు.

Read More »

ప్రతిభా కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి

  గాంధారి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండలంలో 10వ తరగతి చదువుతున్న గిరిజన బాలబాలికలు ప్రతిభ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ బలరాం తెలిపారు. ఈ విద్యాసంవత్సరం 10వ తరగతి చదువుతున్న గిరిజన బాలురు, బాలికలు మాత్రమే ప్రతిభ కళాశాలలో ప్రవేశాలకు అర్హులని, ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇందుకోసం ఈనెల 31 చివరి తేదీ అని గిరిజనులకు ఎలాంటి రుసుము అవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఫోటో, ఆధార్‌కార్డు, సంతకం జతచేసి దరఖాస్తు ...

Read More »

పోలియో చుక్కల వివరాల సేకరణ

  గాంధారి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో ఆదివారం విజయవంతమైనందున రాష్ట్ర వైద్యశాఖ పరిశీలకుడు డాక్టర్‌ సంపత్‌ సోమవారం గాంధారిలో పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉత్తునూరు, వజ్జేపల్లి, బూర్గుల్‌, గాంధారి, వన్రికల్‌ తాండా, రాంలక్ష్మణ్‌పల్లి తదితర గ్రామాల్లో పర్యటించి పోలియో చుక్కలు వేయించుకున్న పిల్లల వివరాలు సేకరించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌ను పరిశీలించారు. మండలంలో మొత్తం 9811 ఇళ్లకు గాను 9450 ఇళ్లలో గల చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ...

Read More »

పాఠశాల నిర్వహణ తీరుపై సమావేశం

  గాంధారి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల నిర్వహణ తీరు, మధ్యాహ్న భోజనంపై పాఠశాల యాజమాన్య కమిటీ, ప్రధానోపాధ్యాయులకు సోమవారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గాంధారి మండల కేంద్రంలోని ఎండివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఇవో సేవ్లానాయక్‌ మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజనం వంటి విషయాల్లో ఎస్‌ఎంసి కమిటీలు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే సమావేశంలో తెలియజేయాలన్నారు. అదేవిధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. పాఠశాలలో విద్యాభివృద్దికి ప్రభుత్వ తోడ్పాటును రిసోర్సు పర్సన్‌లు ...

Read More »

లైంగిక దాడికేసులో నిందితుల అరెస్టు

  గాంధారి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో ఈనెల 25వ తేదీన వృద్దురాలిపై జరిగిన లైంగిక దాడి కేసులో ఓవ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సదాశివనగర్‌ సిఐ శ్రీశైలం తెలిపారు. సోమవారం గాంధారి పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 25వ తేదీన రాత్రి గాంధారికి చెందిన 65 సంవత్సరాల వృద్దురాలిపై ఇదే గ్రామానికి చెందిన కుమ్మరి సంగయ్య (50) లైంగిక దాడికి పాల్పడగా బాధితురాలి ఫిర్యాదు ...

Read More »

ఉత్తమ ఎండివోకు సన్మానం

  గాందారి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రిపబ్లిక్‌దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా ఉత్తమ ఎండివో అవార్డు అందుకున్న గాంధారి ఎండివోను సోమవారం గాంధారిలో సన్మానించారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది ఎండిఓ సాయాగౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు జ్ఞాపిక అందజేశారు. ఇదేవిధంగా జిల్లా స్థాయిలో మరెన్నో ఉత్తమ అవార్డులు ఎండివో సాయాగౌడ్‌ అందుకోవాలని సిబ్బంది ఆకాంక్షించారు.

Read More »

ప్లాట్‌ఫాం పనుల పరిశీలన

  నిజాంసాగర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని సుంకిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న ప్లాట్‌ఫాంను గున్కుల్‌ సొసైటీ ఛైర్మన్‌ మోహినుద్దీన్‌ సోమవారం పరిశీలించారు. జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు సహకారంతో 13వ ఆర్థిక సంఘం నిధులతో పాఠశాల ఆవరణలో ఉన్న గుంతను మొరంతో నింపి రేకుల షెడ్డు వేశారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెంట తెరాస నాయకులు రాంచందర్‌, పాఠశాల ప్రధానోపాద్యాయులు అక్బర్‌ పాషా, ఉపాధ్యాయుడు కృష్ణాగౌడ్‌ ...

Read More »

మెను తప్పితే చర్యలు తప్పవు

  నిజాంసాగర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం సన్నబియ్య భోజనం, వారానికి మూడురోజులు కోడిగుడ్లతో మధ్యాహ్న భోజనపథకం ప్రవేశపెట్టారు. మండల ఉపాధ్యక్షుడు గోగుల పండరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. మెను తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని భోజన ఏజెన్సీ నిర్వాహకులకు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బేగరి రాజు, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, తదితరులున్నారు.

Read More »

జిల్లా కేంద్రానికి ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడిపించాలి

  నిజాంసాగర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నుంచి నిజాంసాగర్‌ మండలానికి ఆర్టీసి వారు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు. నిజాంసాగర్‌ నుంచి కామారెడ్డికి ప్రతి అరగంటకొకటి చొప్పున ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్డినరీ బస్సులు మాత్రమే నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఒకటి కూడా లేకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్ళే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆర్డినరీ బస్సులు మాత్రమే ...

Read More »

నల్లవాగు వంతెనకు సైడ్‌వాల్‌ ఏర్పాటు

  నిజాంసాగర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నల్లవాగు వంతెనకు సైడ్‌వాల్‌ ఏర్పాటు చేశారు. మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామ శివారులోగల నాందేడ్‌, సంగారెడ్డి, అకోలా 161 నెంబరు జాతీయ రహదారిపై నల్లవాగు వంతెన ఇరుపక్కల సైడ్‌వాల్‌లు విరిగి ప్రమాదకరంగా మారిందని, పలుమార్లు నిజామాబాద్‌ న్యూస్‌లో కథనాలకు స్పందించి జాతీయ రహదారుల అధికారులు రైలింగ్‌ మరమ్మతులు చేపట్టారు. వంతెనకు కుడి, ఎడమ వైపులా రైలింగ్‌ విరిగిపోయి గమ్యస్థానాలకు చేరుకునే వాహనదారులు ప్రమాదానికి గురయ్యారు. వార్తలో వచ్చిన కథనాలకు స్పందించిన ...

Read More »

నాలుగు లైన్ల రహదారి కోసం సర్వే

  నిజాంసాగర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగ్‌రావుపల్లి చౌరస్తాలోగల నాందేడ్‌, సంగారెడ్డి, అకోలా 161 నెంబరు జాతీయ రహదారికి నాలుగు లైన్ల రోడ్డు మంజూరు కావడంతో సర్వే పనులు చేపడుతున్నారు. టోటల్‌ కంట్రోల్‌ స్టేషన్‌ యంత్రం ద్వారా ఆపరేటర్‌ సంతోష్‌ సర్వే చేపట్టారు. రోడ్డుకు ఇరుపక్కల సర్వే చేస్తున్నామని ఆయన తెలిపారు. మద్నూర్‌, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు సర్వే చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం మూడు బృందాలుగా ఏర్పడి సర్వే ...

Read More »