Breaking News

Daily Archives: February 2, 2017

కొనసాగుతున్న నట్టల నివారణ మందుల పంపిణీ

  నందిపేట, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మారంపల్లి గ్రామంలో గురువారం గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి గంగాధర్‌ టీకాలు వేయగా, పశువైద్యాధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ గత వారంరోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో విడతల వారిగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా కుర్మ,యాదవ కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు తెలిపారు. తద్వారా వారికి ప్రభుత్వం ...

Read More »

నిత్యవసర సరుకులు సకాలంలో అందించాలి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని రేషన్‌ డీలర్లు నిత్యవసర సరుకులను సకాలంలో లబ్దిదారులకు అందజేయాలని తహసీల్దార్‌ డేవిడ్‌ అన్నారు. మండలంలోని అంకోల్‌ గ్రామ చౌకధరల దుకాణాన్ని ఆయన పరిశీలించారు. రేషన్‌ దుకాణంలో గల స్టాక్‌ రిజిష్టర్‌ తనిఖీ చేశారు. రిజిష్టర్‌ ప్రకారం సరుకులు ఉన్నాయో లేదో లెక్కపెట్టి చూశారు. ప్రతినెల 20వ తేదీ లోపు సరుకులకు సంబంధించిన డిడిలు రేషన్‌ డీలర్లు చెల్లించాలని, నిత్యవసర సరుకులు సరైన సమయంలో లబ్దిదారులకు అందజేయాలనిసూచించారు. ఆయన వెంట ...

Read More »

మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని నసురుల్లాబాద్‌ తహసీల్దార్‌ డేవిడ్‌ అన్నారు. మండలంలోని బస్వాయిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. మొదట మధ్యాహ్న భోజనపు హాజరు పట్టికలు పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని రోజువారి కోడిగుడ్లు ఖచ్చితంగా ఇవ్వాలని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు ఉన్నారు.

Read More »

ప్రమాదస్థలాన్ని పరిశీలించిన ఏఆర్‌పి బృందం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తాపడి మాసాయిపల్లికి చెందిన సాయిలు మృతి చెందడంతో గురువారం ఏఆర్‌పి బృందం (రోడ్డు ప్రమాద నివారణ కమిటీ) ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. వాహనదారులు అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయని, వేగం విషయంలో జాగ్రత్త వహించాలని బాన్సువాడ సిఐ శ్రీనివాస్‌ సూచించారు. వారి వెంట ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి, సర్పంచ్‌ నర్సయ్య, మల్లెల ...

Read More »

పాఠశాల అభివృద్దికి కృషి చేయాలి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల అభివృద్దికి నిర్వహణ కమిటీలు కృషి చేయాలని తహసీల్దార్‌ అబ్దుల్‌ గనిఖాన్‌ అన్నారు. నిజాంసాగర్‌లో పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, పంచాయతీ రాజ్‌ సభ్యులు, ప్రధానోపాద్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చే నిదులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యాభివృద్ది జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. బడి ఈడు పిల్లలను 1-14 సంవత్సరాలలోపు పిల్లలను బడుల్లో చేర్పించేలా ...

Read More »

నవోదయ పాఠశాలలో స్వచ్చభారత్‌

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జవహార్‌ నవోదయ పాఠశాలలో గ్రామసహాయకులు స్వచ్చభారత్‌ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. గ్రామ సహాయకులతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు తొలగించారు. పాఠశాల ఆవరణలో గ్రామ సహాయకులు, సిబ్బంది పాల్గొని చెత్త, చెదారం తొలగించి శుభ్రం చేశారు. ఆర్‌ఐ సయ్యద్‌ హుస్సేన్‌, ఉపాధ్యాయులు బాబురావు ఉన్నారు.

Read More »

దివ్యాంగులకు ఫిజియో థెరఫి వైద్యం

  గాంధారి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో గురువారం దివ్యాంగులకు ఫిజియోథెరఫి చికిత్సను అందజేశారు. వారికి డాక్టర్‌ రవిందర్‌ ఫిజియోథెరఫి వైద్యం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిజియో ధెరఫి నిర్వహించడం ద్వారా దివ్యాంగులు సకలాంగులుగా మారి నడుస్తారని, నడిపిస్తారన్నారు. ఉచితంగాప్రభుత్వం ఫిజియోథెరఫి వైద్యం అందిస్తుందని, దివ్యాంగులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిఆర్‌పి ప్రకాశ్‌, ప్రధానోపాధ్యాయులు తిరుపతి, మారుతి,రిసోర్సు పర్సన్‌లు పెంటయ్య, సాయన్న, దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు తదితరులున్నారు.

Read More »

తగ్గుతున్న నీటి మట్టం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయాన్ని నమ్ముకొని ఆయకట్టు కింద ఉన్న రైతులు యాసంగి పంటలు వేసుకుంటున్నారు. ఆయకట్టు కింద ఇప్పటివరకు రెండు దఫాలుగా నీటి విడుదల చేశారు. 15 రోజులపాటు ఒకతడి నీటిని విడుదల చేసేందుకు జిల్లా నీటిపారుదల శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. మరో మూడు తడులకు మాత్రమే నీటిని విడుదల చేయడం జరుగుతుందని ...

Read More »

శుక్రవారం గాంధారిలో గణిత స్ఫూర్తి కార్యక్రమం

గాంధారి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం గణిత స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎంఇవో సేవ్లానాయక్‌ తెలిపారు. తెలంగాణ గణిత ఫోరం ఆద్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 2017 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఒక్కరోజు గణితంపై శిక్షణ కార్యక్రమం గాంధారి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు, కార్యక్రమాన్ని మండలంలోని 10వ తరగతి విద్యార్థులు హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో గణితంలో మేధావులైన ఉపాధ్యాయులు ...

Read More »

4న శిక్షణ సదస్సు

  గాంధారి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీన హైదరాబాద్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విజయ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన గోడప్రతులను గురువారం గాంధారి మండల కేంద్రంలో జేఏసి నాయకులు ఆవిష్కరించారు. శిక్షణ తరగతులకు తెలంగాణ రాజకీయ జేఏసి ఛైర్మన్‌ కోదండరామ్‌ హాజరవుతారని, జిల్లాలోని విద్యావంతులు ఈ శిక్షణ తరగతులకు హాజరుకావాలన్నారు. సదస్సులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ది, విద్యార్థుల పాత్ర, రాష్ట్రంలో నిరుద్యోగ ...

Read More »

10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టేషనరీ అందజేత

  నందిపేట, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందు ఫౌండేషన్‌ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పరీక్ష అట్టలు, పెన్నులు, స్టేషనరీ అందజేశారు. గురువారం జడ్పిహెచ్‌ఎస్‌ ఆంధ్రానగర్‌లో 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా స్టేషనరీ అందజేసినట్టు సంస్థ అధ్యక్షుడు శ్రీకాంత్‌ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులకు ఉన్నత విద్యకోసం ఆర్థిక సహాయం సంస్థ ద్వారా అందజేస్తామని చెప్పారు. గ్రామ సర్పంచ్‌ రామకృష్ణ, గ్రామాభివృద్ది ...

Read More »