Breaking News

Daily Archives: February 4, 2017

నేడు నేరెల్‌ తాండాకు ఎమ్మెల్యే రాక

  గాంధారి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం నేరెల్‌ తాండాలో గల ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి రానున్నట్టు వైస్‌ ఎంపిపి చందానాయక్‌ తెలిపారు. నేరెళ్‌ తాండాలో ఆంజనేయస్వామి ఆలయం నిర్మించి ఐదేళ్ళు పూర్తయినందున ఐదవ వార్షికోత్సవ కార్యక్రమానికి రవిందర్‌రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. వార్షికోత్సవానికి మండలంలోని భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని చందానాయక్‌ కోరారు.

Read More »

అభివృద్ది చూసి ఓర్వలేకనే విమర్శలు

  గాంధారి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డిపై షబ్బీర్‌ అలీ విమర్శలు చేస్తున్నారని తెలంగాణ జడ్పిటిసిల ఫోరం ఉపాధ్యక్షుడు, గాంధారి జడ్పిటిసి తానాజీరావు ధ్వజమెత్తారు. గాంధారి మండల కేంద్రంలోని హరాలే గార్డెన్స్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. శుక్రవారం గాంధారిలో షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ది కుంటుపడిందని, ఎమ్మెల్యే స్వయంగా కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు చేస్తున్నారని ఆరోపించారని, ఇలాంటి విమర్శలు మానుకోవాలన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ...

Read More »

స్థానిక సమస్యలపై పోరాటానికి సిద్దం కావాలి

  గాంధారి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో నెలకొన్న సమస్యలపై పోరాటానికి సిద్దం కావాలని సిపిఎం జిల్లా నాయకులు మోతిరాం నాయక్‌ పిలుపునిచ్చారు. శనివారం గాంధారిలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే మండలంలోని తాండాల్లో, గ్రామాల్లో రోడ్లు లేవన్నారు. బస్సు సౌకర్యాలు కూడా లేవన్నారు. నర్సాపూర్‌ వంటి గ్రామాలకు ప్రజలు నడుచుకుంటూ వెళుతున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా పాలకులు, ప్రభుత్వాలు మారినా గ్రామాల్లో పరిస్థితి మారలేదన్నారు. ఓట్లు, సీట్ల కోసం ప్రజలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయన్నారు. ప్రభుత్వ ...

Read More »

జోరందుకున్న కంది కొనుగోళ్ళు

  గాంధారి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో కంది కొనుగోళ్ళు జోరందుకున్నాయి. ఈనెల 1వ తేదీన ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాన్ని గాంధారిలో ప్రారంభించింది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 4850, బోనస్‌ రూ. 200 కలిపి మొత్తం 5050 క్వింటాలుకు కందులను మార్క్‌ఫెడ్‌, ఎఫ్‌సిఐ ద్వారా కొనుగోలుచేస్తుంది. రైతులు నష్టపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని ఏఎంసి ఛైర్మన్‌ గీత, శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. దీంతో గాంధారి మార్కెట్‌ కమిటీ గోదాముల్లో 1వ ...

Read More »

సీజనల్ ఫ్రూట్స్ గా పరిచమయ్యే సీతాఫలంను ఖచ్ఛితంగా ఎందుకు తినాలి..?

ఇందులోఆరోగ్యానికి సంబంధించి అద్భుతమైన శరీరంలో వ్యర్థంగా ఉండే ఫ్రీరాడికల్స్ ను నివారించే విటమిన్ సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా….క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, నియాసిన్ మరియు పొటాషియంలు కూడా అధికంగా ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి. ఈ ఫ్రూట్ లో క్యాలరీలు ఎక్కువైనా, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా స్మూతీస్, మిల్క్ షేక్స్, డిజర్ట్స్ , ఐస్ క్రీమ్స్ లో అధికంగా ఉపయోగిస్తుంటారు, ఫ్రెష్ గా ఉన్న ఫ్రూట్ ను నేరుగా తిన్నా భలే ...

Read More »