Daily Archives: February 5, 2017

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసనసభ్యులు గంపగోవర్ధన్‌ పుట్టినరోజు వేడుకలను తెరాస పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రెడ్‌క్రాస్‌ రక్తనిధి సంస్థలో ఏడుగురు తెరాస కార్యకర్తలు రక్తదానం చేశారు. గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మినారాయణ, శ్రీనివాస్‌, కుదురత్‌, అమ్‌జద్‌, ప్రసాద్‌, సంగమేశ్వర్‌ పాల్గొన్నారు. అలాగే మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, కౌన్సిలర్‌ లక్ష్మినారాయణ, గణేశ్‌, మోహన్‌, మల్లేశ్‌ యాదవ్‌, ...

Read More »

మూడోదఫా నీటి విడుదల

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని ఆయకట్టు కింద ఉన్న పంటల అవసరాలకు మూడోదఫా నీటిని విడుదల చేస్తున్నారు. డిసెంబరు నెలాఖరులో మొదటి,జనవరిలో రెండో దఫా, ఫిబ్రవరిలో మూడోదఫా నీటి విడుదల చేస్తున్నట్టు డిఇ దత్తాత్రి తెలిపారు. ఇప్పటి వరకు లక్ష 15 ఎకరాల్లో పంట సాగుచేశారని నీటిపారుదల శాఖాధికారులు తెలిపారు. వరినాట్లు వేసుకున్న రైతులకు నీరందక పోవడంతో నిజాంసాగర్‌, బాన్సువాడ తదితర మండలాల్లో వరినాట్లు ఇంకా పూర్తిచేయలేదు. ప్రధాన కాలువ ద్వారా ...

Read More »

నేరెళ్‌ తాండాలో ఘనంగా ఆంజనేయస్వామి ఆలయవార్షికోత్సవం

  గాంధారి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం నేరెళ్‌ తాండాలో ఆంజనేయస్వామి వారి ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం హోమం, అభిషేకాలు నిర్వహించిన అనంతరం వార్షికోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామిజి అనుగ్రహ భాషణం, ప్రవచనాలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ, గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో జడ్పిటిసి తానాజీరావు, వైస్‌ ఎంపిపి చందా నాయక్‌, మాజీ ఎంపిపి దశరథ్‌ ...

Read More »

సోమవారం ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి

  గాంధారి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ తెలిపారు.సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వినతులు స్వీకరిస్తామన్నారు. మండల ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా పట్టా పాసుపుస్తకాలు, పహాణీ నఖలు, తదితర పత్రాల కొరకు ప్రజావాణిలో పిర్యాదు చేస్తే సమస్య వెంటనే పరిష్కారిస్తామని తెలిపారు. మండలంలోని ఆయా శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొంటారని, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ...

Read More »

ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా నూతన కార్యవర్గం

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌సి వర్గీకరణ సాదన కోసం జిల్లాలో మాదిగ విద్యార్థి సమాఖ్యను బలోపేతం చేసేందుకు అడ్‌హక్‌ కమిటీ ఏర్పాటు చేసినట్టు మాదిగ దండోరా రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటేశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా సురేశ్‌కుమార్‌, కో కన్వీనర్లుగా కొమ్ము కుమార్‌, నిమ్మ ప్రభాకర్‌, విజయ్‌ కుమార్‌, సుమన్‌, జీవన్‌, భూమేశ్‌, సాయిలులను నియమించినట్టు తెలిపారు. వర్గీకరణ ఫలాలు ముందుగా విద్యార్థులకే అందుతాయని కామారెడ్డి జిల్లాలోని ...

Read More »

గాంధారిలో వాహనాల తనిఖీ

  గాందారి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ఆదివారం అంగడి సందర్భంగా స్థానిక ఎస్‌ఐ రాజేశ్‌ పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనికీ చేపట్టారు. ఈ సందర్భంగా సరియైన దృవీకరణ పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. 15 వాహనాల నుంచి 1500 రూపాయలు జరిమానా విధించినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. తప్పకుండా వాహనచోదకులు హెల్మెట్‌ ధరించాలని, వాహనాలు నడిపే సమయంలో అన్ని దృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఒకటి, రెండు సార్లు జరిమానా విధిస్తామని, మూడోసారి ...

Read More »

ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహం తనిఖీ

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ఆదివారం సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్సీకి విన్నవించారు. వసతి గృహంలో ప్యూరిఫైడ్‌ నీటి కోసం రెండు లక్షల నిధులు మంజూరుచేయిస్తామని ఆయన హామీఇచ్చారు. విద్యార్థులకు అవసరమగు క్రీడా సామగ్రి అందిస్తామని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థులు వసతి గృహాల్లో ఉండి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, వివిధ ...

Read More »

సైడ్‌వాల్‌ వంతెన కోసం సర్వే

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ప్రాజెక్టు దిగువన ఉన్న నాగమడుగు వద్ద హైలెవల్‌ వంతెన నిర్మాణానికి అధికారులు సర్వే చేపట్టారు. మిషన్‌ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు అందించడానికి సైడ్‌వాల్‌ వంతెన నిర్మాణం కోసం సర్వే చేస్తున్నట్టు ఇంజనీర్‌ రమేశ్‌, తెలిపారు. మండలంలోని అచ్చంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో మంజీరాపై ఉన్న నాగమడుగు లోలెవల్‌ వంతెన వద్ద హైలెవల్‌ వంతెన ద్వారా పలు గ్రామాలకు మిషన్‌ భగీరథ నీరందిస్తామన్నారు.

Read More »

కేంద్ర కార్మికశాఖ మంత్రికి స్వర్ణకారుల విజ్ఞప్తి

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు కామారెడ్డి పట్టణ స్వర్ణకారులు ఆదివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ స్వర్ణకార సంఘం సహాయ కార్యదర్శి శ్రీనివాస్‌చారి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం అని చెబుతున్న ప్రస్తుత సమయంలో స్వర్ణకారులకు చేతినిండా పనిలేకుండాపోయిందని, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొలేక భార్య, పిల్లల పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉండడానికి ఇల్లులేక, దుకాణ కిరాయిలు చెల్లింపులు, పిల్లల చదువులు భారంగా మారాయని ...

Read More »

పంచముఖి హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించిన తొగుట పీఠాధిపతి

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీపంచముఖి హనుమాన్‌ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని ఆదివారం ఉదయం తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్దికి పలు సూచనలు చేస్తు అనుగ్రహ భాషణం చేశారు. స్వామీజీ సూచనల మేరకు ఆలయ అభివృద్దికి చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆంజనేయశర్మ, నగేశ్‌, శ్రీనివాస్‌, రవి, చంద్రశేఖర్‌, వెంకటి, రాజ్‌కుమార్‌, చీలప్రభాకర్‌, లక్ష్మణ్‌, కౌన్సిలర్‌లు ముప్పారపు ఆనంద్‌, కుంబాల రవి, జమిల్‌, గణేశ్‌, భక్తులు ...

Read More »

షబ్బీర్‌అలీని విమర్శించే అర్హత తెరాసకు లేదు

  గాంధారి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీని విమర్శించే అర్హత స్థానిక తెరాస నాయకులకు లేదని గాంధారి మండల కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ది జరగకపోయినా జరిగినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అభివృద్ది విషయంలో షబ్బీర్‌ అలీచేసిన ఆరోపణలు నిజమని, దీనిపై ఎలాంటి చర్చకైనా సిద్దమని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. గాంధారి మండలాన్ని కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని జేఏసి ఆధ్వర్యంలో 101 రోజుల ...

Read More »

సిసి డ్రైనేజీ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పోచారం కాలనీలో సిఎం ప్రత్యేక నిదులు రూ. 25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిసి డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని బాన్సువాడ నియోజకవర్గ తెరాస ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీర్కూర్‌ గ్రామంలో సిసి డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిపి మల్లెల మీణ హన్మంతు, చంద్రశేఖర్‌, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌ తదితరులున్నారు.

Read More »

గ్రామస్తుల సహకారంతో కాలువ నిర్మాణ పనులు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మీర్జాపూర్‌ గ్రామంలో చెరువు అలుగు గత 15 రోజుల క్రితం తెగిపోవడంతో ఆయకట్టు శివారు రైతులు, గ్రామప్రజలు విరాళాల రూపంలో డబ్బు పోగుచేసి చెరువు కట్ట అలుగు తూము నిర్మించుకున్నారు. ఈ విషయం పట్టించుకునే నాథుడు కరువు కావడంతో చెరువు ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో విరాళాలతో చెరువు కట్ట నిర్మించుకున్నట్టు తెలిపారు. గ్రామస్తుల కృషితో చెరువు అలుగు నిర్మాణం చేపట్టడం ఆనంద దాయకమన్నారు.

Read More »

కేంద్రమంత్రికి ఆటోడ్రైవర్ల వినతి

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్న కార్మికులు ఆదివారం కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ తెలంగాణ ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నర్సింలు మాట్లాడుతూ తాము ఎలాంటి ఉపాధి దొరకక ఆటోడ్రైవర్లుగా పనిచేస్తు జీవనం సాగిస్తున్నామన్నారు. అనారోగ్యానికి గురైనపుడు ఆసుపత్రుల్లో డబ్బు ఖర్చుచేసి వైద్యం చేయించుకోవడం కష్టతరంగా మారిందన్నారు. ఈ ...

Read More »

సోమవారం ప్రజావాణి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో సోమవారం 6వ తేదీ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీర్కూర్‌ తహసీల్దార్‌ కృష్ణానాయక్‌, నసురుల్లాబాద్‌ తహసీల్దార్‌ డేవిడ్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలోనే ప్రతిసోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు, మండల ప్రజలు వారి వారి సమస్యలను దృష్టికి తెస్తే సంబంధిత శాఖాధికారుల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read More »

కళాశాల భూమి స్వాధీనానికి ఐక్య ఉద్యమమే శరణ్యం

  – ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తుల స్వాధీనానికి విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించినపుడే సాధ్యపడుతుందని ప్రముఖ న్యాయవాది నల్సార్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రచనారెడ్డి అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన కళాశాల ఆస్తుల సంరక్షణ ఒకసామాజిక బాధ్యత, విద్యార్థి చైతన్యవేదికకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పోరాటంలో గెలుపు, ఓటములు సహజమని అడ్డంకులను అధిగమించి పోరాడడం ...

Read More »

73 మంది బాలకార్మికులకు విముక్తి

  కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఆధ్వర్యంలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి 73 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్టు జిల్లా సంక్షేమ అధికారి ఎం.రాధమ్మ తెలిపారు. ఆపరేషన్‌ స్మైల్‌-3లో భాగంగా పోలీసుశాఖ, మహిళ, శిశు సంరక్షణ శాఖ, వివిధ శాఖల సమన్వయంతో ప్రతియేటా జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న తనిఖీలో భాగంగా ఈయేడాది సైతం తనికీలు చేపట్టినట్టు తెలిపారు. వివిధ ప్రాంతాలను పరిశీలించి ...

Read More »

పండిత, పిఇడిల అప్‌గ్రేడేషన్‌ హర్షణీయం

  కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం పండిత, పిఇడిల అప్‌గ్రేడేషన్‌పై ఉత్తర్వులు జారీచేయడం హర్షణీయమని పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి అన్నారు. శ నివారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి ప్రాతినిద్యం, పిఆర్‌టియు టిఎస్‌తో ఏళ్ల కల సాకారమైందన్నారు. దీంతోపాటు సకలజనుల సమ్మె కాలానికి ఇఎల్‌ఎస్‌ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పిఆర్‌టియు ప్రతినిధులు పోచయ్య, రాజులు, భాస్కర్‌రావు, సురేశ్‌, సంతోష్‌, గోవర్ధన్‌, రమణ, తదితరులు ...

Read More »

బంజారా సేవాసంఘం సభ్యత్వ నమోదు

  కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం ఆలిండియా బంజారా సేవా సంఘం జీవిత కాల సభ్యత్వ నమోదు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.కిషన్‌, జాతీయ ఉపాధ్యక్షుడు అమర్‌సింగ్‌లు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 1953లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత్‌రావు నాయక్‌ ఆధ్వర్యంలో ఆలిండియా బంజారా సేవా సంఘం స్థాపించారన్నారు. 39 మందికి సభ్యత్వ నమోదు అందజేశారు. కామారెడ్డి జిల్లాలో బంజారా భవన నిర్మాణానికి ప్రభుత్వం రెండెకరాల భూమి, కోటి రూపాయలు ...

Read More »

రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు సమన్వయంతో పనిచేసి రైతుల చివరి ఆయకట్టు వరకు సాగునీరందేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నీటిపారుదల సలహాబోర్డు సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో యాసంగి పంటకు సంబంధించి ప్రతి ఎకరాకు నీరందించేలా నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అదికారులు ప్రణాళికతో చర్యలు ...

Read More »